For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6:షోలో రెచ్చిపోయిన జంట.. అందరి ముందే దుప్పటి కప్పుకుని ముద్దులు.. అతను వద్దన్నా వినకుండా

  |

  బిగ్ బాస్.. అత్యధికంగా పాపులర్ అయిన రియాలిటీ షోలలో ముందుంటుంది. నిజానికి ఈ షో ముందుగా అమెరికాలో బిగ్ బ్రదర్ పేరుతో ప్రారంభమైంది. ఆ తర్వాత భారతదేశంలో మొదటగా హిందీలో స్టార్ట్ చేశారు. అక్కడ మంచి సక్సెస్ సాధించడంతో వివిధ ప్రాంతీయ భాషల్లోకి తీసుకొచ్చారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ క్రమంలోనే తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ప్రస్తుతం ఈ రియాలిటీ షో మంచి ప్రేక్షకాదరణను పొందుతోంది. హిందీలో ప్రస్తుతం 16వ సీజన్ కంటిన్యూ కాగా కన్నడలో 9వ సీజన్, తమిళం, తెలుగులో ఆరో సీజన్లు ప్రసారం అవుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లో షాకింగ్ సీన్ చోటుచేసుకుంది. దీంతో హౌజ్ లోని కంటెస్టెంట్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ విషయంలోకి వెళితే..

   ఎక్కడా చూడలేని విధంగా..

  ఎక్కడా చూడలేని విధంగా..

  ఎంటర్టైన్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా సినిమాలు, ఓటీటీలు మారిన విషయం తెలిసిందే. వాటికి సరిసమానంగా బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో కూడా ఉంటోంది. ఈ బిగ్ బాస్ షోలో జరిగే సన్నివేశాలు, ట్విస్ట్ లు, రొమాన్స్ లు, గొడవలు, అరుపులు ఎక్కడా చూడలేం. వీటన్నింటిని కలుపుతూ ఫుల్ మీల్స్ లా ప్రేక్షకులకు అందిస్తున్నారు ఇంటి సభ్యులు. ఈ క్రమంలో కొందరు హద్దులు కూడా దాటుతున్నారు.

  భార్యాభర్తల సరసం..

  భార్యాభర్తల సరసం..

  ఇప్పటివరకు లవ్ ట్రాక్ లు, వన్ సైడ్ లవ్ లు, ఫ్రెండ్స్ మధ్య ఘాటు చుంబనాలు, హగ్గులు, సిగ్గులు చూశాం. కానీ ఈసారి బట్ ఫర్ ఏ చేంజ్ అన్నట్లుగా భార్యాభర్తల మధ్య సరసం చూడాల్సి వచ్చింది. అదికూడా మిగిలిన కంటెస్టెంట్ల అందరూ ముందు దుప్పటిలోకి లాగి మరి భర్తపై భార్య ఘాటుగా ముద్దులు కురిపించింది. దానికి సిగ్గు పడటం తనవంతు అయింది. ఇది ఎక్కడా జరగలేదు. తెలుగు బిగ్ బాస్ షోలో తాజా ఎపిసోడ్ లో ఈ ముద్దు సీన్ అందరినీ ఆశ్చర్యపరిచింది.

  టైటిల్ కోసం 14 మంది పోటీ..

  టైటిల్ కోసం 14 మంది పోటీ..

  బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లోకి మొత్తం 21 మంది కంటెస్టెంట్లుగా వచ్చిన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు ఒక్కటిగా బ్యూటిఫుల్ కపుల్ రోహిత్ సహ్ని-మెరీనా అబ్రహం అడుగుపెట్టారు. వీరిద్దరి మొదటగా కలిసి ఆడాలని చెప్పిన బిగ్ బాస్.. ఇటీవల విడివిడిగా ఆడాల్సిందిగా ఆదేశించారు. దానికి తగినట్లుగానే వారి గేమ్ వారు ఆడేందుకు చాలా బాగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ ఆరో సీజన్ లో 14 మంది కంటెస్టెంట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు.

  రసవత్తరంగా గేమ్..

  రసవత్తరంగా గేమ్..


  ఇటీవల జరిగిన గత రెండు ఎపిసోడ్ లలో చేపల చెరువు గేమ్ ఆడించాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో సభ్యుల మధ్య గొడవలు, అరుపులు, లాక్కోవడాలతో గేమ్ చాలా రసవత్తరంగా జరిగింది. అయితే దీనికన్నా ఎక్కువగా రోహిత్ కు మెరీనా ముద్దులు వర్షం కురిపించడం హాట్ టాపిక్ అయింది. హౌజ్ లో చుట్టూ మిగతా కంటెస్టెంట్లతో మాట్లాడే క్రమంలో సడెన్ గా రోహిత్ కు మెరీనా ముద్దు పెట్టింది.

  దుప్పటి కప్పుకుని మరి..

  దుప్పటి కప్పుకుని మరి..

  తర్వాత అందరూ చూస్తున్నారని దుప్పటి కప్పుకుని ముద్దుల వర్షం కురిపించింది మెరీనా. తర్వాత ఇక చాలురా అని రోహిత్ అన్నప్పటికీ.. మళ్లీ దుప్పటిలోకి లాగింది మెరీనా. ఇది చూసిన వాసంతి, శ్రీహాన్, కీర్తి ఆశ్చర్యపోయారు. తర్వాత రోహిత్ సిగ్గు పడుతున్నాడంటా ఆటపట్టిస్తూ అందరూ నవ్వుకున్నారు. గత ఎపిసోడ్ లలో జరిగిన ఈ సీన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

  గత సీజన్ లలో జరగలేదు...

  గత సీజన్ లలో జరగలేదు...


  అయితే ఇప్పటివరకు ఇలా భార్యాభర్తల మధ్య ఇలాంటి ముద్దు సీన్లు మాత్రం గత సీజన్ లలో జరగలేదు. బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ లో హీరో వరుణ్ సందేశ్-వితికా జంట అడుగుపెట్టిన ఇలాంటి సంఘటనలు అయితే ఇంతలా చోటుచేసుకోలేదు. కాగా రోహిత్ అండ్ మెరీనా బుల్లితెరపై సీరియల్స్ లో నటించే క్రమంలో ప్రేమలో పడ్డారు. తర్వాత పెద్దలను ఒప్పించి 2017లో వివాహం చేసుకున్నారు. ఈ జంట ఇప్పటికే డాన్స్ జోడి డాన్స్ అనే రియాలిటీ షోలో పాల్గొన్నారు.

   ఇంతకుముందు కూడా ఇలాగే..

  ఇంతకుముందు కూడా ఇలాగే..

  ప్రస్తుతం నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ వీరికి రెండో రియాలిటీ షో. ఈ షోలో రోహిత్ సహ్ని అండ్ మెరీనా అబ్రహం జంట ఇంతకుముందు కూడా ఇలాగే ముద్దులాట ఆడి ఇంటి సభ్యులను ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే మరోవైపు.. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న తమిళ బిగ్ బాస్ ఆరో సీజన్ ప్రసారం అవుతోంది. ఇటీవల జరిగిన జీపీ ముత్తు ఎలిమినేషన్ తర్వాత 19 మంది కంటెస్టెంట్లు మిగిలారు.

  హగ్ చేసుకోవడం, పలు చోట్ల తాకడం..

  వీరిలో అసల్ కోలార్, నివాషిని మధ్య ఘాటుగా రొమాన్స్ జరుగుతోంది. నివాషినిని అసల్ కోలార్ హగ్ చేసుకోవడం, పలు చోట్ల తాకడం వంటి చేయడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. గత సీజన్ లలో కూడా ఇలాంటి చాలానే జరిగాయి. మరి ఈ సీజన్ లో ఇప్పుడే ప్రారంభమైన ఈ రొమాన్స్ ఎక్కడికి వెళ్తుందో చూడాలి మరి.

  English summary
  Bigg Boss Couple Contestants Rohit Sahni And Marina Abraham Kissing In Bigg Boss Telugu 6 Season Video Viral
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X