Bigg Boss Telugu 6: తన గొయ్యి తానే తవ్వుకుంటున్న రేవంత్.. టైటిల్ విన్నర్ రేసులో అతను!

బిగ్ బాస్ తెలుగు 6 స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈసారి విన్నర్ ఎవరు అనే విషయంలో రేవంత్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అతనే విన్నర్ అని.. వస్తున్న ఓట్ల లెక్కను చూస్తేనే అర్ధమవుతుంది. అయితే రేవంత్ అతి కారణంగా అతను మెల్లగా పట్టు కోల్పోతున్నాడు. ఇక ఈ ఛాన్స్ ను అవకాశంగా తీసుకుంటన్నాడో లేదో గాని ఒక కంటెస్టెంట్స్ మాత్రం ఫైనల్ లో రేవంత్ కు పోటీని ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇక రేవంత్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నట్లు అనిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

పరిస్థితి ఎలా ఉన్నా కూడా..

పరిస్థితి ఎలా ఉన్నా కూడా..

బిగ్ బాస్ లో పరిస్థితి ఎలా ఉన్నా కూడా వాటన్నిటిని ఫేస్ చేస్తూ చివరి వరకు నిలిచిన వారే టైటిల్ విన్నర్ అవుతారు. అయితే ఈ క్రమంలో కొన్ని పొరపాటున జరిగినప్పటికీ కూడా ఆడియన్స్ సపోర్ట్ ఉంటే సరిపోతుంది. అయితే రేవంత్ అడుగులు వేస్తున్న విధానం కొన్ని సార్లు రివర్స్ అవుతున్నాయి. మొన్నటి వరకు అతని ఫైనల్ విన్నర్ అని టాక్ అయితే బలంగా ఉండేది. కానీ ఇప్పుడు అతను చేస్తున్న పొరపాట్లు ఫైనల్స్ లో తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది.

రేవంత్ కూడా అదే తరహాలో

రేవంత్ కూడా అదే తరహాలో

బిగ్ బాస్ లో పొరపాటు చేసిన కూడా పరవాలేదు కానీ ఎదుటివారికి అవకాశం ఇవ్వకూడదు అనే విధంగా కొనసాగుతూ ఉండాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేజిక్కించుకుంటారు. ఇక రేవంత్ కూడా అదే తరహాలో మొన్నటి వరకు కొనసాగుతూ వచ్చాడు. అతని కోపం కూడా పెద్దగా మైనస్ కాలేదు అని చెప్పాలి. ఎందుకంటే అనవసరమైన వివాదాల్లో కాకుండా ఫిజికల్ టాస్కులలో అతను చాలా బలంగానే పోరాడాడు.

టిక్కెట్ టూ ఫినాలే టాస్క్ లో

టిక్కెట్ టూ ఫినాలే టాస్క్ లో

ఇక గత రెండు మూడు రోజుల నుంచి బిగ్ బాస్ లో రేవంత్ కొనసాగుతున్న విధానం అతని రావాల్సిన ఓట్లపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టిక్కెట్ టూ ఫినాలే టాస్క్ లో ఏకాభిప్రాయంతో తదుపరి చాలెంజ్ కోసం కంటెస్టెంట్స్ ను మీరే సెలెక్ట్ చేసుకోవాలని బిగ్ బాస్ అన్నప్పుడు ఎవరు కూడా పెద్దగా ఆ విషయంలో సంతృప్తి చెందలేదు. ముఖ్యంగా రేవంత్ అయితే ఊహించిన విధంగా ప్రవర్తించడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

మళ్ళీ సీరియస్ అయ్యాడు

మళ్ళీ సీరియస్ అయ్యాడు

అంతేకాకుండా టిక్కెట్ టూ ఫినాలేలో అవకాశం లభించినప్పటికీ కూడా ఓటమిపాలైన రేవంత్ ఊహించని విధంగా మళ్ళీ సీరియస్ అయ్యాడు. అతను ప్రవర్తించిన తీరు ఎవరికీ కూడా అంతగా నచ్చలేదు. ముఖ్యంగా సంచాలక్ గా ఉన్న వారిపై కూడా రేవంత్ పూర్తిస్థాయిలో సంతృప్తిగా ఉండలేదు. రేవంత్ ఇప్పటికే జనాల నుంచి రావాల్సిన ఓట్ల సంఖ్య కూడా తగ్గుతుంది. అతను గత వారం నుంచి కొనసాగుతున్న తీరు ఏ మాత్రం కరెక్ట్ గా లేదు అని సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

ఫైనల్స్ లో రోహిత్?

ఫైనల్స్ లో రోహిత్?

ఇక రేవంత్ తప్పు చేయడంతో ఇప్పుడు అందరి ఫోకస్ కూడా రోహిత్ పై పడింది. టికెట్ టూ ఫినాలే లో ఎవరూ కూడా పెద్దగా ఏక అభిప్రాయానికి మొగ్గు చూపలేదు. కానీ రోహిత్ మాత్రం పాయింట్స్ విషయాన్ని పరిగణలోకి తీసుకొని తాను వెనుకడుగు వేస్తున్నట్లు చెప్పడం మెచ్చుకోదగిన విషయం. బిగ్ బాస్ లో గెలవడం ముఖ్యం కాదు.

ఎలా ఆడారు అనేదే చాలా ముఖ్యం. ఇక రోహిత్ టిక్కెట్ టూ ఫినాలే నుంచి తప్పుకోవడం అతనికి బాగా ప్లస్ అయింది. గత వారమే అతనికి ఓట్లు భారీగా పెరిగాయి. ఒక విధంగా అతను రేవంత్ కు పోటీగా వస్తున్నాడు అని చెప్పవచ్చు. ఇలానే కొనసాగితే తప్పకుండా ఫైనల్లో వీరిద్దరి మధ్య పోటీ ఉండవచ్చు అని అనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X