Bigg Boss Telugu 6: రోహిత్ ఫైర్.. కూల్ చేసేందుకు చేయి పెట్టుకొని లోపలికి తీసుకెళ్లిన శ్రీసత్య

బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ కొన్నిసార్లు ఎంతో ఆసక్తిగా అనిపిస్తోంది కానీ మరికొన్ని సార్లు పరమ చిరాగ్గా అనిపిస్తోంది అని సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక టికెట్ టూ ఫినాలే టాస్క్ లో కంటెస్టెంట్స్ అసలు రంగులు చాలా వరకు బయటపడ్డాయి. ఇందులో ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్ కూడా కొట్లాడుకునే వరకు వెళ్లారు. అయితే మొన్నటి వరకు కూడా చాలా సైలెంట్ గా కూల్ గా కనిపించిన రోహిత్ ఇప్పుడు చివరి దశలో మాత్రం తన ఆగ్రహాన్ని చూపించాడు. అతనుశుక్రవారం ఎపిసోడ్ లో ఒక అమ్మాయిపై చాలా సీరియస్ గా కోపంగా దాదాపు కొట్టడానికి వెళ్లినట్లు వెళ్ళాడు. ఆ వివరాలలోకి వెళితే..

 బిగ్ బాస్ మౌనం

బిగ్ బాస్ మౌనం

బిగ్ బాస్ గతవారం కాస్త ఆసక్తికరంగా అనిపించినప్పటికీ ఈ వారం మాత్రం పూర్తిస్థాయిలో చాలా నీరసంగా కొనసాగుతోంది అనిపిస్తుంది. అసలు కంటెస్టెంట్స్ ఏం మాట్లాడుతున్నారో ఎవరికైనా అర్థమవుతుందా లేదా అనే విధంగా నేటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఏకాభిప్రాయం అని చెబుతున్న బిగ్ బాస్ మౌనంగా ఉండడం ఏమిటో అసలు అర్థం కావడం లేదు. మీలో మీరే తేల్చుకుని కొట్టుకొని చావండి అన్నట్లు బిగ్ బాస్ ప్రవర్తిస్తుండడం అసలు కరెక్టుగా లేదని అనిపిస్తోంది.

అమ్మాయిలు ఒకవైపు

అమ్మాయిలు ఒకవైపు

టికెట్ టూ ఫినాలే టాస్క్ మొదట్లో కాస్త ఆసక్తికరంగా అనిపించినప్పటికీ ఆ తర్వాత మెల్ల మెల్లగా పట్టుకోల్పోతుంది. ఎపిసోడ్ మొత్తానికి కూడా ఇదే కీలకమైన టాస్క్. అయితే బిగ్ బాస్ అసలు తనకేమీ తెలియదు అన్నట్లుగానే ప్రవర్తిస్తున్నాడు. చివరకు అమ్మాయిలందరూ ఒకటి ఆ తర్వాత అబ్బాయిలందరూ మరొకవైపు మారడం కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది.

కన్ఫ్యూజన్ సంచాలక్స్

కన్ఫ్యూజన్ సంచాలక్స్

పాయింట్స్ పట్టికలో టాప్ లో ఉన్న వారిని తదుపరి ఛాలెంజ్ కు పంపించాలనే విషయంలో ఏకాభిప్రాయానికి రావాలి అని అందుకోసం సంచాలకులుగా ఉన్న ఇనయా శ్రీ సత్య కీర్తిలను నియమించారు. అయితే మొదట టాప్ లో ఉన్న కంటెస్టెంట్స్ ను సెలెక్ట్ చేసిన సంచాలక్స్ ఆ తర్వాత మళ్లీ మాట మార్చి తక్కువ స్థాయిలో ఉన్న కంటెస్టెంట్స్ కి తదుపరి ఆట కోసం సెలెక్ట్ చేయడం కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది.

రోహిత్ సీరియస్

రోహిత్ సీరియస్

అయితే ఈ ఆటలో కాస్త గజిబిజిగా అనిపించడంతో రోహిత్ అయితే చాలా సీరియస్ అయిపోయాడు. అసలు మీరు బ్రెయిన్ తో ఆడుతున్నారా లేదా అని ఇనయా పై చాలా సీరియస్ అయిపోయాడు. అసలు ముందు ఒక మాట ఆ తర్వాత మరొక మాట ఎలా మాట్లాడుతారు అని ఇది అసలు కరెక్ట్ కాదు అని తన వివరణ ఇచ్చాడు.

వేలు చూపిస్తూ

వేలు చూపిస్తూ

అయితే ఇనయా సుల్తానా మొదట నిన్ను సెలెక్ట్ చేశామని ఆ తర్వాత మళ్ళీ నువ్వే మరొక విధంగా మాట్లాడావని బెహేవియర్ మార్చుకో అని అతనిని బ్లేమ్ చేసే విధంగా మాట్లాడింది. కానీ రోహిత్ మాత్రం గతంలో ఎప్పుడు లేనివిధంగా ఒక్కసారిగా సీరియస్ అయిపోయాడు. వేలు చూపిస్తూ బెహేవియర్ గురించి మాట్లాడకు అని ఇనయాకు గట్టిగానే హెచ్చరికలు కూడా చేశాడు.

లోపలికి తీసుకువెళ్లి..

లోపలికి తీసుకువెళ్లి..

ఇక ఇనయా సీరియస్ కావడంతో మిగతా అమ్మాయిలు అతన్ని కూల్ చేసేందుకు ప్రయత్నం చేశారు. ముఖ్యంగా శ్రీ సత్య అయితే లోపల బెడ్స్ దగ్గరకు తీసుకువెళ్లి మరి అతనిని బుజ్జగించే ప్రయత్నం చేసింది. కానీ రోహిత్ మాత్రం అసలు వినలేదు. నిజానికి శ్రీ సత్య రోహిత్ కు కరెక్ట్ గా సమాధానం చెప్పలేకపోయింది.

ఆ తర్వాత కీర్తి కూడా వచ్చి మేనేజ్ చేసే ప్రయత్నం చేసింది. కానీ రోహిత్ వినలేదు. ఆ తర్వాత హౌస్ లో అమ్మాయిలు ఒకవైపు ఆ తర్వాత అబ్బాయిలు ఒకవైపు అనే తరహాలో చర్చ కొనసాగింది. ఏదేమైనా కూడా ఈ టాస్క్ మాత్రం చాలా ఘోరంగా నడుస్తోంది. మరి మరుసటి ఎపిసోడ్ లో అయినా బిగ్ బాస్ తన నిర్ణయాలతో ఆటను కొనసాగిస్తాడో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X