Don't Miss!
- Sports
IND vs NZ:పాపం పృథ్వీ షా.. హార్దిక్ పాండ్యా రాజకీయాలకు బలి! ఫ్యాన్స్ ఫైర్!
- News
Lady: విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న భర్త, కవల పిల్లలను హత్య చేసి ఆత్మహత్య చేసుకుంది, రాత్రి !
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Bigg Boss Telugu 6: పరమ రొటీన్ గా ర్యాంక్స్.. ఇచ్చి పుచ్చుకుంటున్న కంటెస్టెంట్స్!
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ఎంత నీరసంగా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలు చివరి దశకు చేరుకుంటే ప్రతి మూమెంట్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉండాలి. కానీ బిగ్ బాస్ మాత్రం తనకి ఏమి సంబంధం లేదు అన్నట్లుగానే మీరు మీరే కొట్టుకుని తేల్చుకోండి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా ర్యాంక్స్ విషయంలో అయితే బిగ్ బాస్ పెద్దగా కండిషన్స్ పెట్టకుండా చాలా ఫ్రీగా వదిలేస్తున్నాడు.
ఇక హౌస్లో రాజకీయాలు అయితే గట్టిగానే నడుస్తున్నాయి. ఈరోజు ప్రచారం కాబోయే ఎపిసోడ్ లోని కొన్ని హైలెట్స్ లోకి వెళితే.. ముఖ్యంగా ర్యాంక్స్ విషయంలో అయితే బిగ్ బాస్ కొనసాగిస్తున్న తీరు పరమ రొటీన్ గా ఉంది అని అనిపిస్తుంది. ఎవరెవరు ఏ స్థానంలో ఉండవచ్చు అని అనుకుంటున్నారానే అభిప్రాయం నుంచి హౌస్ మెంట్స్ ర్యాంక్స్ ఇచ్చుకున్నారు. ఒక విధంగా వారు ఎవరికి వారు ఊహలకు తగ్గట్టుగానే ర్యాంక్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు.

ఇక రేవంత్ మొదటి స్థానానికి పర్ఫెక్ట్ అని ఎంతమంది అనుకుంటున్నారు అని అన్నప్పుడు ఐదు ఓట్లు రావడంతో అతనే మొదటి స్థానంలో ఉన్నాడు అని క్లారిటీ వచ్చింది. ఇక శ్రీహన్ రెండవ స్థానంలో ఉన్నట్లు కూడా ఆదిరెడ్డి వివరణ ఇచ్చాడు. ఇక ఆదిరెడ్డి మూడో స్థానంలో ఉన్నట్టు తనకు తానే చెప్పేసుకున్నాడు. అతనికి మూడు ఓట్లు రావడంతో మూడో స్థానంలో నిలిచాడు.
ఇక ఇనయా నాలుగో ర్యాంక్ అని ఎంతమంది ఓటు వేస్తారు అని అన్నప్పుడు ఇద్దరు తప్పితే ఎవరూ ఓటు వేయలేదు. మొత్తానికి అయితే ఆమె నాలుగో స్థానంలో నిలిచిందని చెప్పుకొచ్చారు. ఇక 5వ స్థానంలో శ్రీసత్య కీర్తి ఏడో స్థానంలో రోహిత్ 6వ అంటూ ఆదిరెడ్డి తేల్చేశారు. మొత్తంగా ఇప్పుడు బిగ్ బాస్ లో ఒకటి నుంచి ఏడవ ర్యాంక్స్ గమనిస్తే మొదటి స్థానంలో రోహిత్ ఉండగా రెండవ స్థానంలో శ్రీహాను ఉన్నాడు.
ఇక మూడో స్థానంలో ఆదిరెడ్డి నాలుగో స్థానంలో ఇనయా సుల్తానా 5వ స్థానంలో శ్రీ సత్య 6వ స్థానంలో రోహిత్ ఏడవ స్థానంలో కీర్తి ఉన్నట్లుగా హౌస్ మెన్స్ వారి అభిప్రాయాల ప్రకారం ర్యాంకింగ్ ఆర్డర్స్ వేసుకున్నారు. ఇక ఏడవ స్థానంలో అయితే నేను డిజర్వ్ కాదు అంటూ కీర్తి చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటికే బిగ్ బాస్ విన్నర్ రెవబెత్ అని బయట జనాలకు ఒక క్లారిటీ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ విధంగా ముందే హౌస్ మెంట్స్ వారి ర్యాంక్స్ గురించి తేల్చేస్తే కిక్కేమి ఉంటుందో బిగ్ బాస్ కే తెలియాలి.