Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss Telugu 6: ఈ సీజన్ రన్నరప్ కూడా ఫిక్స్ అయినట్లే.. ఊహించని కంటెస్టెంట్!
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ఈసారి అనుకున్నంత స్థాయిలో అయితే రేటింగ్స్ తో రికార్డులను క్రియేట్ చేయలేకపోయింది. ఈసారి షో ప్లాప్ కావడానికి అనేక రకాల కారణాలు అయితే ఉన్నాయి. ఇక మొత్తానికి బిగ్ బాస్ అయితే చివరి దశకు చేరుకుంటున్న కొద్ది ఎంతో కొంత హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈసారి విన్నర్ తో పాటు రన్నరప్ ఎవరు అనే విషయంలో కూడా ముందుగానే కొన్ని లీక్స్ అయితే మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈసారి రన్నరప్ ముందే ఫిక్స్ అయినట్లుగా చెబుతూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే..

ముందుగానే వెనుతిరిగారు
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ మొదట్లోనే కొంత నీరసంగా అనిపించింది ఆ తర్వాత మళ్లీ ట్రాక్ లోకి వచ్చినప్పటికీ కూడా ఈసారి విన్నర్ ఎవరు అనే విషయంలో ఆడియన్స్ అయితే ముందుగానే ఒక క్లారిటీ కి రావడం హాట్ టాపిక్ గా మారిపోయింది. భారీ అంచనాలు పెట్టుకున్న కొంతమంది అయితే ముందుగానే వెనుతిరిగారు. ముఖ్యంగా జబర్దస్త్ ఫేమ్ చలాకీ చంటి సగం లోని వెళ్లిపోగా ఆ తర్వాత మొదట్లో మంచి క్రేజ్ అందుకున్న గలాట గీత కూడా వెళ్లిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

టాప్ 5 లోకి
ఫైనల్స్ వరకు వస్తారు అనుకున్న చాలా మంది కంటెస్టెంట్స్ మధ్యలోనే వెళ్లిపోవడం ఈసారి థ్రిల్లింగ్ గా అనిపించింది. ఏమాత్రం ఓవరాక్షన్ చేసిన కూడా బిగ్ బాస్ నిర్దాక్షిణ్యంగా హౌస్ మేట్స్ ను బయటకు పంపించడం కూడా హైలెట్ గా నిలిచింది. బాలాదిత్య కూడా ఫైనల్స్ లో ఉంటాడు అని అందరూ అనుకున్నారు. ఇక ముందుగానే వెళ్ళిపోతాడు అనుకున్న రోహిత్ ఇనయా సుల్తానా కీర్తి ఇప్పుడు టాప్ 5 ఫైనల్ వరకు ఉండడానికి పోటీ పడుతున్నారు.

ఫైనల్ లో అతను కూడా..
ఇక ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లలో ఎవరు టాప్ 5 లోకి వెళతారు అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఫైనల్స్ లో శ్రీహన్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అతను టిక్కెట్ టూ ఫినాలే టాస్క్ లో గెలిచి ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉన్నాడు. ఇక మిగిలిన వారిలో రేవంత్ తప్పకుండా ఫైనాన్స్ లోకి వెళతాడు అని చెప్పవచ్చు. ఇక అతనికి పోటీగా రోహిత్ కూడా ఉన్నాడు అతను టాస్క్ లో కాస్త వెనుకబడి ఉన్నప్పటికీ కూడా ఫైనల్స్ లో ఉంటాడు అనిపిస్తుంది.

అబ్బాయిలతో పోటీ
ఇక మిగిలిన అమ్మాయిలలో ఈసారైనా ఎవరైనా బిగ్ బాస్ టైటిల్ విన్నార్ గా నిలుస్తారా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే బిగ్ బాస్ నాన్ స్టాప్ లో తప్పితే టెలివిజన్‌లో ప్రసరమైన బిగ్ బాస్ షోలో ఇప్పటివరకు అమ్మాయిలు గెలిచింది లేదు. ఇక ఇప్పుడు పోటీగా కీర్తితో పాటు ఇనయా సుల్తానా, శ్రీ సత్య ముగ్గురు అమ్మాయిలు మాత్రమే బిగ్ బాస్ టైటిల్ కోసం అబ్బాయిలతో పోటీ పడుతున్నారు.

అతనే విన్నర్
ఇక ఫైనల్ విన్నర్ అయితే రేవంత్ అని ఇప్పటికే చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అతనికి అత్యధిక స్థాయిలో ఓట్లు దక్కుతున్నాయి. దానికి తోడు అతను ఆటలో కూడా చాలా బలంగా పోరాడుతున్నాడు. కాబట్టి తప్పకుండా టాప్ 5 లో నుంచి ఫైనల్ పోటీలో కూడా అతను ఉంటాడు అని అందరూ నమ్మకంతో అయితే ఉన్నారు.

రన్నరప్ గా ఆమె..?
అయితే ఈసారి రన్నర్ అప్ గా ఎవరు ఉంటారు అనే విషయంలో కూడా ముందుగానే సోషల్ మీడియాలో ఒక టాక్ అయితే వైరల్ గా మారింది. ఈసారి ఫైనల్ లో అమ్మాయి అబ్బాయి మధ్యలో పోటీ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అందులో ఇనయా సుల్తానా ఉండవచ్చు అని కూడా అభిప్రాయాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇనయా సుల్తానా అయితే పట్టు విడవకుండా ఆటలో కొనసాగుతోంది. ఇక ఆమెకు అలాగే సింగర్ రేవంత్ కు ఫైనల్ స్టేజ్ లో పోటీపడే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.