Bigg Boss Telugu 6: రెండోవారం నామినేషన్స్ లో మొత్తం 8 మంది.. మరో టార్గెట్ ఫిక్స్!

మొత్తానికి బిగ్ బాస్ తొలి వారంలో ఎలిమినేషన్స్ ఉంటుంది అని బాగానే హైలెట్ చేసినప్పటికీ వారం చివరలో మాత్రం ఈసారి 3ఎలిమినేషన్స్ లేవు అని ట్విస్ట్ ఇచ్చారు. దీంతో డేంజర్ జోన్ లో ఉన్న ఆరోహి అభినయ శ్రీ ఇద్దరు కూడా సేఫ్ గా బయటపడ్డారు. కానీ రెండవ వారం మాత్రం తప్పనిసరిగా ఎలిమినేషన్ అయితే ఉంటుంది అని బిగ్ బాస్ చెప్పారు. దీంతో కంటెస్టెంట్స్ అందరూ కూడా మళ్లీ రెండవసారి రిస్క్ లో పడకూడదు అని గట్టిగానే పోరాడుతున్నారు. ఇక ఫైనల్ గా ఈ వారం మొత్తం 8 మంది నామినెట్ అయినట్లు లైవ్ టెలికాస్ట్ లో క్లారిటీ వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

రెండోవారంలో..

రెండోవారంలో..

మొదటి వారంలో తప్పకుండా ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అని అందరూ ఊహించారు. కానీ బిగ్ బాస్ మాత్రం ఊహలకు అందని విధంగా ఈ వారం ఎలిమినేషన్ లేదు అని ట్యూస్ ఇవ్వడంతో రెండో వారంలో ఎవరు వెళ్లిపోతారు అనేది మరింత ఆసక్తితంగా మారింది. అయితే మొదటి వారం ఎలిమినేషన్ లేదు కాబట్టి రెండవ వారం ఇద్దరు ఎలిమినేట్ కావచ్చు టాక్ వైరల్ అవుతోంది. కానీ ఒక్కరిని మాత్రమే బిగ్ బాస్ హౌస్ నుంచి రెండోవారం బయటకు పంపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

 కుండను బావిలో పడేసి

కుండను బావిలో పడేసి

కంటెస్టెంట్స్ మధ్యలో రెండో వారం నామినేషన్స్ అయితే గొడవలతో మరింత ఆసక్తికరంగా మారాయి. బిగ్ బాస్ కుండలకు ఫోటోలను అతికించి వాటిని బావిలో బయటపడేసి కంటెస్టెంట్స్ ను నామినేట్ చేయాలి అని వివరణ ఇచ్చాడు. దీంతో కొంతమంది అయితే సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు.

 ఫస్ట్ వీక్ సేఫ్ అయినా..

ఫస్ట్ వీక్ సేఫ్ అయినా..

మొదటి వారంలో మొత్తం నలుగురు నామినేషన్స్ లోకి వెళ్లగా ఇందులో ఆరోహి అభినయ ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్లిపోవచ్చు అని అనుకున్నారు. ఇక వాళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ చివరి నిమిషంలో సేఫ్ అంటూ నాగర్జున ప్రకటించారు. ఇక రెండోవారం మాత్రం తప్పకుండా ఎవరో ఒకరు వెళ్లిపోయే అవకాశం అయితే ఉంది. ఇక సెకండ్ వీక్ నామినేషన్ లో మళ్ళీ అభినయ నిలిచింది.

మొత్తం 8 మంది

మొత్తం 8 మంది

రెండవ వారం మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయినట్లుగా తెలుస్తోంది. ఈసారి బిగ్ బాస్ అందరికి ఒక్కొక్కరిని నామినేట్ చేసే హక్కు మాత్రమే ఇచ్చారు. ఇక అందులో భాగంగా గలాట గీతుకి ఎక్కువగా ఓట్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక నామినేషన్స్ లో ఉన్న వారిలో మెరీనా రోహిత్, రేవంత్, ఆదిరెడ్డి, రాజశేఖర్, అభినయశ్రీ, ఫైమా, షాని సల్మాన్ ఎక్కువగా ఓట్లతో ఎలిమినేషన్స్ లో నిలిచారు.

 వాడివేడిగా నామినేషన్ ప్రక్రియ

వాడివేడిగా నామినేషన్ ప్రక్రియ

గలాట గీతుకు సంబంధించిన వివాదాలను బయటకు తీసి ఎక్కువమంది ఆమెని నామినేట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎక్కువగా ఆమెతోనే వాదోపవాదాలు నడిచాయి. ఇక ఆరోహి ఆదిరెడ్డి ఇద్దరి మధ్యలో కూడా మాటల యుద్ధం గట్టిగానే కొనసాగింది. సింగర్ రేవంత్ కూడా కీర్తి మీద మళ్లీ అరిచేసాడు. దీంతో నీతో ఉన్న ప్రాబ్లమే ఇది అంటూ అతన్ని మరింత రెచ్చగొట్టడంతో రేవంత్ సీరియస్ గా చూశాడు. మొత్తం ఈరోజు నామినేషన్ ప్రక్రియ ఎపిసోడ్ లో మాత్రం వేడివేడిగా కొనసాగబోతున్నట్లు అర్థమవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X