Bigg Boss 6 Telugu: హౌస్ లోకి ఎవరు మర్చిపోలేని ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫిక్స్ అయినట్లే!
టెలివిజన్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన హౌస్ సెట్ నిర్మాణం కూడా పూర్తయింది. ప్రస్తుతం కంటెస్టెంట్స్ ను కూడా ఫైనల్ చేసే పనుల్లో నిర్వాహకులు చాలా బిజీగా ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. అతను అన్ని వర్గాల ఆడియన్స్ కి కూడా తెలిసిన కమెడియన్ కావడంతో ఇప్పుడు బిగ్ బాస్ పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇక అతను ఎవరు అనే వివరాల్లోకి వెళ్తే..

మరింత ఎంటర్టైన్మెంట్
బిగ్ బాస్ 6వ సీజన్ ను అసలైతే గత రెండు నెలల క్రితమే మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ అనుకొని కారణాల వలన ఈ షో ఈసారి ఇంకా ఆలస్యమైంది. గత ఐదు సీజన్స్ కంటే కూడా ఈ ఆరవ సీజన్ మరింత డిఫరెంట్ గా సాలీడ్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి అని నిర్వాహకులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇంతకుముందు ఓటీటీ లో కూడా నాన్ స్టాప్ షో గా బిగ్ బాస్ కు మంచి గుర్తింపు అందిన విషయం తెలిసిందే.

విభిన్నమైన కంటెస్టెంట్స్
ఏదేమైనా కూడా బిగ్ బాస్ పై ఈసారి కాస్త అంచనాలు ఎక్కువగానే పెరుగుతున్నాయి. ఎందుకంటే హౌస్ లోకి రాబోయే కంటెస్టెంట్స్ పేర్లు ముందే లీక్ కావడంతో అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ముఖ్యంగా టెలివిజన్ సెలబ్రిటీలు అలాగే యూట్యూబర్స్ ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులు బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. దీంతో 6వ సీజన్ పై మరింత ఆసక్తి పెరుగుతొంది.

లిస్ట్ వైరల్
ఇక బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో మొత్తంగా 18 మంది కంటెస్టెంట్స్ పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది. ఇక ఈ క్రమంలో ఒక లిస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జబర్దస్త్ అప్పారావు, సింగర్ రేవంత్, నేహా చౌదరి, యాంకర్ ప్రత్యూష, సింగర్ మోహన భోగరాజు, అర్జున్ కళ్యాణ్ దీపికాపిళ్ళై, రివ్యూవర్ ఆదిరెడ్డి, చలాకీ చంటి, నేహా చౌదరి, RJ సూర్య, గీతు రాయల్, శ్రీ సత్య, పాండు మాస్టర్ వంటి వారు కూడా హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరో కమెడియన్
అలాగే సీనియర్ యాంకర్ ఉదయభాను కూడా రావచ్చు అని మొదటి నుంచి కూడా ఒక టాక్ వినిపిస్తోంది కానీ ఆమె మళ్ళీ తప్పుకున్నట్లుగా కూడా కొత్త టాక్ వినిపిస్తోంది. ఇక రీసెంట్ గా మరొక సీనియర్ కమెడియన్ కూడా బిగ్ బాస్ లోకి రాబోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. అతను ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి క్రేజ్ అందుకున్నాడు.

కమెడియన్ భారత్
ఆ ప్రముఖ చైల్డ్ ఆర్టిస్ట్ మరెవరో కాదు భరత్ అనే తెలుస్తోంది. భరత్ ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు. ఒకప్పుడు అతను వెంకీ, రెడీ, ఢీ, కింగ్ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కామెడీతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఎక్కువగా శ్రీనువైట్ల సినిమాలలోనే కనిపించేవారు. ఇక మధ్యలో హీరోగా కూడా రానున్నట్లు టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ లోకి వచ్చి తనను తాను సరికొత్తగా ప్రజెంట్ చేసుకోవాలి అని భరత్ డిసైడ్ అయినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే బిగ్ బాస్ షో మొదలయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











