Bigg Boss Telugu 6: అతి తెలివితో గీతూ దొంగ వేషాలు.. కుక్కతో పోల్చిన కీర్తి.. రేవంత్ మరో కౌంటర్!
చేపల చెరువు టాస్క్ ను బిగ్ బాస్ చాలా ఆసక్తికరంగా కొనసాగేలా చేస్తున్నాడు. ఈ క్రమంలో గార్డెన్ ఏరియాలో చేపల వర్షం కురుస్తున్నప్పుడు కంటెస్టెంట్స్ అందరూ కూడా పోటాపోటీగా వాటిని దక్కించుకునేందుకు ఎంతగానో ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక హౌస్ మెంట్స్ లో గీతూ ఇప్పటికే తను చేసిన పొరపాటు కారణంగా కెప్టెన్సీ టాస్క్ నుంచి నిష్క్రమించింది. ఇక ఆమె తను అంటే పడని వాళ్ళను టార్గెట్ చేయడం స్టార్ట్ చేసింది. నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కూడా ఆసక్తికరమైన ట్విస్ట్ లతో కొనసాగబోతోంది. అందుకు సంబంధించిన హైలెట్స్ లోకి వెళితే..

గీతూ దొంగ వేషాలు
గీతూకి ఈ మధ్య బ్యాక్ టూ బ్యాక్ షాక్ లు తగులుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ అయితే ఆమెకు పోటీగా నిలుస్తున్నాడు. వీరిద్దరికి ప్రతీ సారి ఎదో ఒక గొడవ అవుతూనే ఉంది. రేవంత్ పడుకొని ఉండగా అర్ధరాత్రి అతని నుంచి చేపలను దొంగిలించాలని గీతూ ప్రయత్నం చేసింది. ఇక ఆమెను కనిపెట్టిన మెరినా నిజం చెప్పే ప్రయత్నం చేసింది. నేను ఏదో చేస్తే మీకెందుకు అన్నట్లు గీతూ వారిని ప్రశ్నిచింది. ఇక నువ్వు ఆడలేవు ఆడేవాళ్లను అడనివ్వవు అంటూ గీతూ అనడంతో నువ్వు ఫ్రస్ట్రేషన్ లో అలా అంటున్నావు అని మెరినా కౌంటర్ ఇచ్చింది. నేను గెలిచినా కూడా ఇలానే ఆడతాను అని గీతు చెప్పింది.

కుక్కతో పోల్చిన కీర్తి
ఇక ఆ తరువాత గీతూ ఒకే మనిషిని బాగా టార్గెట్ చేస్తుంది అని మెరినా మిగతా వాళ్ళకు చెప్పుకొచ్చింది. ఇక కీర్తి కూడా గీతూని కుక్కతో పోల్చినట్లు సామెత చెప్పింది. ఇక ట్విస్ట్ వచ్చింది అంటూ గీతూ ఆదిరెడ్డి ఇద్దరు కూడా సంచాలకులిగా ఉంటారని రేవంత్ బిగ్ బాస్ నోటీస్ గురించి చెప్పాడు. ఆ తరువాత చేపల వర్షం పడుతున్నప్పుడు అందరూ కూడా బాడీతో బాస్కెట్ ను కవర్ చేసుకోవద్దని కేవలం చేతులతోనే డిఫెండ్ చేసుకోవాలని చెప్పుకొచ్చింది.

అతి తెలివి ఉపయోగించకు
ఇక అతి తెలివి ఉపయోగించకు అని రేవంత్ గీతూకు కౌంటర్ ఇచ్చాడు. సంచాలకులు రూల్స్ చెప్పాలని కూడా లేదని అన్నారు. ఇక ఆది రెడ్డి మాత్రం అలా చెప్పడం గేమ్ కాదని కూడా అన్నాడు. ఇక గేమ్ కొనసాగుతుండగా గీతూ చేపలను పట్టుకోవడానికి ప్రయత్నం చేయగా సంచాలకుడిగా ఉన్నప్పుడు అలా చేయవద్దని ఆదిరెడ్డి చెప్పాడు. కానీ నేను పట్టుకుంటాను అంటూ గీతు మొండిగా ప్రవర్తించింది.
ఆట ఆడలేదు, నేను ఆడిస్తున్నాను
ఇక గీతూ తనంటే పడని వాళ్లపై కోపంగానే ప్రవర్తించింది. ఇక ఆదిరెడ్డి ఆమెను ప్రశ్నించగా నా గేమ్ డిస్టర్బ్ చేయకు అని మాట్లాడింది. అందుకు ఆది రెడ్డి సంచాలక్ గేమ్ లో అడడం ఇప్పటివరకు జరిగిందా అని అన్నాడు. ఇక ఆట ఆడలేదు నేను ఆడిస్తున్నాను అని గీతూ ఓవర్ గా మాట్లాడింది. బ్యాట్స్ మెన్ బాల్ ను కొట్టినప్పుడు అంపైర్ బాల్ పట్టుకున్నట్లు ఉందని బాలాదిత్య కూడా కౌంటర్ ఇచ్చాడు. మరి ఈ తరహా గొడవలు హౌస్ లో ఎలాంటి ట్విస్ట్ లను క్రియేట్ చేస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











