Bigg Boss Telugu 6: నామినేషన్ లో రేవంత్ తగ్గేదే లే.. ఏం పీకావ్ అంటూ ఇనయాతో మాటల యుద్ధం
ఈ వారం నామినేషన్స్ గొడవ మరింత హీటెక్కబోతున్నట్లు అర్థమవుతోంది. బిగ్ బాస్ ఊహించిన విధంగా నామినేట్ చేయాలనుకున్న వారిపై బురద పడే విధంగా ఒక గేమ్ మొదలు పెట్టాడు. ఈ తరుణంలో కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక్కసారిగా వారి కోపాన్ని బయటకు చూపిస్తున్నారు. సోమవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ హైలెట్స్ పై ఒక లుక్కేస్తే..

రేవంత్ vs శ్రీసత్య
మొదట రేవంత్ అయితే తన ఫస్ట్ నామినేషన్ సత్య అంటూ నేను టీ బాటిల్ ఓపెన్ చేస్తున్నప్పుడు మీరు కొంచెం గట్టిగా మాట్లాడారు అని కారణం చెప్పాడు. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అని సత్య అడగడంతో రేవంత్ కూడా ఆఫ్ట్రాల్ టీ గురించి నాకెందుకు వచ్చిన గొడవ అని ఓ మాట అనేసాడు. దీంతో ఇక ఫుడ్ ని ఆఫ్ట్రాల్ అనకూడదు అంటూ శ్రీ సత్య వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.

ఒక చిన్న బాధ
ఆ తరువాత సూర్య వివరణ ఇస్తూ నామినేషన్స్ లో ఉన్నవారికి మొదటి అవకాశం ఇద్దాం అనుకున్నా బాలదిత్యా అన్న వెనకాల ఇంకా 9 మంది ఉన్నారే అని ఆలోచించ లేకపోయాడా అనేది ఒక చిన్న బాధ అని సూర్య బాలాదిత్యను నామినేట్ చేశాడు. ఇక తర్వాత ఇనయా కూడా బాలదిత్యా ను నామినేట్ చేయడంతో చెప్పావు కదా వెళ్ళిపో అని ఆదిత్య కోపగించుకున్నాడు.

ఏం పీకావ్ అంటూ
ఆ తర్వాత శ్రీహన్ వర్సెస్ ఇనయా మరింత తీవ్రంగా మాట్లాడుకున్నట్లు అనిపిస్తోంది. ఇక నీకు నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో డైరెక్ట్ గా చెప్పవచ్చు అని ఇనయా శ్రీహాన్ కు చెప్పింది. దీంతో అతను నువ్వు ఎవరు నాకు చెప్పడానికి అని ప్రశ్నించాడు. నన్ను చూసి భయపడుతున్నావా అని కూడా ఆమె కామెంట్ చేసింది. ఇక హఠాత్తుగా శ్రీహన్ ఎ అనడంతో.. ఏ అంటే భయపడాలా అని కూడా ఆమె కౌంటర్ ఇచ్చింది. ఇక ఏ అంటేనే నీకు అంత పెద్ద తప్పు అనిపిస్తే ఏం పీకావ్ అని అన్నప్పుడు తప్పు అనిపించలేదా అని శ్రీహన్ ప్రశ్నించాడు.

8 వారాలు కూడా ఇదే రిపీట్
ఆ తర్వాత గీతూ.. సప్ప మేటర్ మీద నన్ను నామినేట్ చేయడం కరెక్ట్ కాదు అని వాసంతికి క్లాస్ ఇస్తూ హర్ట్ అయినట్లు చెప్పింది. ఆ తర్వాత అర్జున్ వర్సెస్ ఆదిరెడ్డి మధ్యలో కూడా గొడవ గట్టిగానే ముదిరింది. ఇక తను నాపై ఒక కామెంట్ అనకూడదు అని అర్జున్ అనగానే.. ఎవరు బ్రో చెప్పింది అంటూ ఆది రెడ్డి గట్టిగా అరిచాడు. ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది అని అర్జున్ కంప్లైంట్ చేయగా ఇంకొక 8 వారాలు కూడా ఇదే రిపీట్ అవుతుంది అని ఆదిరెడ్డి మళ్ళీ కౌంటర్ ఇచ్చాడు.

రేవంత్ పుష్ప స్టైల్
ఇక నువ్వు నిజంగానే నామినేషన్స్ కు భయపడుతున్నావు అంటూ రాజశేఖర్, వాసంతి గురించి చెప్పాడు. నేను అలా భయపడితే హెయిర్ ఇలా కట్ చేసుకొను.. నామినేషన్స్ అనేది నాకు నథింగ్.. ఇది నా లైఫ్ అని తన హెయిర్ ని చూపించింది. ఇక తర్వాత రేవంత్ అలాగే రాజశేఖర్ షర్టు విప్పేసి బురద పడే పైపు కింద కూర్చున్నారు. ఇక రేవంత్ అయితే తగ్గేదే లే అంటూ పుష్ప స్టైల్ ను చూపించాడు. మరి ఈ గొడవలతో హౌస్ లో పరిస్థితులు ఇంకా ఏ విధంగా మారుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











