Bigg Boss Telugu 6: మరీ ఇంత దారుణంగానా.. ఎలిమినేషన్స్ లో ఇది మోసమే!

బిగ్ బాస్ 6వ సీజన్ గ్రాండ్ గా మొదలైనప్పటికీ ఆ తర్వాత మాత్రం చాలా నీరసంగా కొనసాగుతోంది అనే కామెంట్లు అయితే చాలా ఎక్కువగానే వస్తున్నాయి. ఇక మొదటి వారం ఎలిమినేషన్ లేకుండా కొనసాగిన బిగ్ బాస్ షోలో రెండో వారం మాత్రం ఊహించిన విధంగా డబుల్ ఎలిమినేషన్ ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఈ క్రమంలో శనివారం రోజు బిగ్ బాస్ షోలో ఎలిమినేషన్ ప్రక్రియ విధానం తీవ్రస్థాయిలో విమర్శలకు దారితీస్తోంది. షాని ఎలిమినేషన్ విషయంలో అసలు ఒక పద్ధతి ప్రకారం జరగలేదు అని ఇది చాలా మోసమే అంటూ నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఆ విషయంలోనే..

ఆ విషయంలోనే..


బిగ్ బాస్ 6వ సీజన్ ఈసారి అంతకుమించి అనేలా ఉంటుంది అని ప్రేక్షకుల్లో ఒక మంచి అంచనాలు అయితే ముందుగానే ఏర్పడ్డాయి. కానీ బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం అందుకు భిన్నంగా స్టార్ట్ చేశారు కంటెస్టెంట్స్ ను సెలెక్ట్ చేసుకోవడంతోనే ఈసారి బిగ్ బాస్ పై తీవ్రంగా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అసలు కొంత ఫేమ్ ఉన్న సెలబ్రిటీలను ఆయన తీసుకురావాల్సింది అని.. ఈసారి వచ్చిన వారిలో చాలామంది జనాలకు పెద్దగా తెలియదు అని కూడా నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి.

 ఎవరు స్ట్రాంగ్ గా లేరు

ఎవరు స్ట్రాంగ్ గా లేరు

బిగ్ బాస్ మొదటివారం క్యాప్టెన్సీ టాస్క్ కూడా అంత ఆసక్తిగా ఏమీ జరగలేదు అని ఇక ఎలిమినేషన్స్ లో కూడా అర్థవంతంగా ఎవరు కూడా మాట్లాడలేదు అని కూడా అభిప్రాయాలు వస్తున్నాయి. ముఖ్యంగా నామినేషన్స్ చేసేటప్పుడు కంటెస్టెంట్స్ అసలు వారు అనుకున్న పాయింట్ విధానంలో కూడా స్ట్రాంగ్ గా లేరు. ఈసారి బిగ్ బాస్ హౌస్ లో గట్టిగా ఒక ఐదు ఇద్దరు ముగ్గురు కంటే బలమైన కంటెస్టెంట్స్ ఎవరూ కనిపించడం లేదు అని అంటున్నారు.

ఎలిమినేషన్స్

ఎలిమినేషన్స్


బిగ్ బాస్ చరిత్రలోనే మొదటి సారి ఎక్కువ మంది సెలబ్రిటీలను తీసుకువచ్చారు. ఇక అందులో మొదటి వారం ఎలిమినేషన్ చేయకుండా బాగానే నెట్టుకొచ్చారు. కానీ అసలు టాస్క్ విషయంలోనూ ఎవరు కూడా పెద్దగా పట్టు సాధించడం లేదని అనిపిస్తోంది. ఇక రెండవ వారం డబుల్ ఎలిమినేషన్ లో షాని సల్మాన్ వెళ్లిపోగా ఆ తరువాత అభినయశ్రీ హౌస్ లో నుంచి వెళ్లిపోయింది.

షానీ విషయంలో..

షానీ విషయంలో..


అయితే శాని సల్మాన్ వెళ్ళిపోవడంపై సోషల్ మీడియాలో తీవ్రంగా నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. కావాలనే అతన్ని హౌస్ నుంచి పంపించారు అని ఇది చాలా పెద్ద మోసమని కూడా అంటున్నారు. అసలు షానీ హౌస్ లో ఏం చేశాడు అనే విషయాలను కూడా అతను వెళ్ళిపోయేటప్పుడు చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. సాధారణంగా ప్రతిసారి హౌస్ లో నుంచి ఎవరైనా వెళ్ళిపోతే వారి గురించి తప్పకుండా ఒక ఏవి కూడా వేస్తారు. కానీ షానికి పెద్దగా అభిప్రాయాలు కూడా చెప్పే అవకాశాన్ని ఇవ్వలేదు.

 ఇది మోసమే అంటూ..

ఇది మోసమే అంటూ..

శనివారం హౌస్లో నాగార్జున అందరిపై సీరియస్ అవడం కూడా హైలెట్గా నిలిచింది. ఎవరెవరు ఎలా ఉంటున్నారు అనే విషయంలో ఆయన హైలెట్ చేసి మాట్లాడినప్పటికీ షానీని పంపించేటప్పుడు మాత్రం అతనికి కనీసం మాట్లాడే అవకాశం పెద్దగా ఇవ్వలేదు. కేవలం ఏదో రెండు మాటలు మాట్లాడి బయటకు పంపించేశారు. ఈ విషయంలో అతని ఫాన్స్ మాత్రం సీరియస్ గానే ఉన్నారు. షానీ కంటే ఇతర కంటెస్టెంట్స్ అసలు ఏమాత్రం హౌస్ లో ఉండేందుకు అర్హులు కాదు అని అతన్ని అనవసరంగా పంపించారు అని ఇది మోసమే అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X