twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: అమ్మాయిలా చీర కట్టుకుని పువ్వులతో శ్రీహన్.. బిగ్ బాస్ ను భయపెట్టిన అర్జున్

    |

    బిగ్ బాస్ తెలుగు 6 ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఐదో వారం కూడా ఇంటి సభ్యులందరూ విభిన్న రీతిలో బిగ్ బాస్ ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు బిగ్ బాస్ పుట్టినరోజు కావడంతో స్పెషల్ ఎంటర్టైన్మెంట్ కూడా ప్లాన్ చేసినట్లు అర్థమవుతుంది. ఇక ప్రత్యేకంగా ఫైమాకు ఒక సీక్రెట్ టాస్క్ కూడా ఇచ్చారు. ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఒకటి విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

    అమ్మాయి గెటప్ లో శ్రీహన్

    అమ్మాయి గెటప్ లో శ్రీహన్

    శ్రీహన్ మొదటిసారి అమ్మాయిల రెడీ అయ్యాడు. ఇక అతన్ని బిగ్ బాస్ లోని ఇతర అమ్మాయిలు రెడీ చేసిన విధానం కూడా నవ్వులు తెప్పించింది. చీర కట్టుకొని పువ్వులు పెట్టుకున్న శ్రీహాన్ అమ్మాయిలా హావభావాలు చూపించాడు. ఇక వాసంతి అయితే శ్రీహాన్ ను చూసి పగలబడి నవ్వి కింద పడిపోయింది. ఇక అర్జున్ వచ్చి అదిరిపోయావు అని ఆన్సర్ ఇచ్చాడు. ఏం అదిరిపోయాను మొహం చూసి మాట్లాడు అని సమాధానం ఇచ్చాడు.

    సుదీప, ఇనయా

    సుదీప, ఇనయా

    ఇక బిగ్ బాస్ అయితే సుదీప కు ఒక టాస్క్ ఇచ్చాడు. తడుముకోకుండా తొమ్మిదవ ఎక్కం చెప్పాలి అని అనడంతో సుదీప పూర్తిస్థాయిలో చెప్పలేకపోయింది. ఇక మా పిల్లలు చూస్తే ఏంటి పరిస్థితి అని ఆమె వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇనయ సుల్తానా తో రెండు నిమిషాల పాటు ఎంటర్టైన్మెంట్ చేయాలి అని బిగ్ బాస్ చెప్పాడు. ఇక మీ వాయిస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అని చెప్పడంతో బిగ్ బాస్ గురుకుల పెట్టి నిద్రపోయాడు.

    భయపడిన బిగ్ బాస్

    ఇక అందరూ నెత్తిపై గిన్నెలు పెట్టుకొని నడుస్తూ ఉండగా బిగ్ బాస్ నిద్రపోతున్నట్లు సౌండ్ ఇచ్చాడు. అయితే రాజశేఖర్ పళ్లెం పడిపోయింది. ఇక నా నిద్ర చెడగొట్టినందుకు మీరు నిద్రపుచ్చేందుకు ఒక పాట పాడాలి అని కూడా బిగ్ బాస్ చెప్పడంతో రాజశేఖర్ పాట పాడే ప్రయత్నం చేశాడు. లాలీ లాలీ అంటూ అనగానే మీ అద్భుతమైన గానం విన్న తర్వాత బిగ్ బాస్ కు నిద్ర అంటేనే భయం చేస్తుంది అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో అందరూ కూడా నవ్వేశారు.

    సీక్రెట్ టాస్క్

    సీక్రెట్ టాస్క్

    ఇక ఫైమాను సీక్రెట్ రూమ్ లోకి పిలిచిన బిగ్ బాస్ ఒక సీక్రెట్ టాస్క్ కూడా ఇచ్చినట్లు చెప్పాడు. ఇక అర్జున్ చంటి సుదీప పక్కనే కూర్చుని ఉండగా వేస్ట్ అన్న ఎవరిని నమ్మకకూడదు అని చంటితో ఫైమా చెప్పడం చూస్తూ ఉంటే ఏదో గొడవను మొదలుపెట్టబోతున్నట్లు అర్థమవుతుంది. అందుకే గీతు చెప్పినట్లు ఫ్యామిలీ అనుకోవద్దు ఫ్రెండ్స్ అనుకోవద్దు అని హఠాత్తుగా అందరి దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయింది. మరి ఫైమాకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏమిటి అసలు ఆమె మాట్లాడిన విధానం హౌస్ లో ఎలాంటి వాతావరణ క్రియేట్ చేసింది అనేది ఈ రోజు ఎపిసోడ్లో చూడాలి.

    English summary
    Bigg Boss telugu 6 shreehan lady getup and and bigg boss sleeping..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X