Bigg Boss Telugu 6: ట్రెండింగ్ లో శ్రీహాన్ ఏజ్.. బుడ్డోడు కాదు పెద్దోడు.. ఆమె కుంటే అన్నేళ్లు పెద్దనా!

బిగ్ బాస్ తెలుగు 6 రియాలిటీ షో ప్రస్తుతం రంజుగానే సాగుతోంది. అరుపులు, కేకలు, గొడవలు, అలకలు, ప్రేమయణాలు తదితర ఆసక్తిర సంఘటనలతో జోరుగానే ఉందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ రియాలిటీ షోలో జరిగే సంఘటనలు కొన్నిసార్లు విచిత్రంగా ఉంటాయి. అందులో కంటెస్టెంట్లు మాట్లాడే, చెప్పే విషయాల్లో ఎంత నిజం ఉంటుందో తెలియదు గానీ, అవి మాత్రం బాగానే వైరల్ అవుతాయి. వాటిలో నిజమెంతో తెలుసుకోవాలనే ఉత్సుకత నెటిజన్లలో ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటి గురించి వెతికే పనిలో పడతారు. అప్పుడు వారికి తెలిసిన, అనిపించినా వాటి ప్రకారం స్పందిస్తుంటారు. దీంతో ఆ విషయాలు ట్రెండింగ్ లోకి వస్తుంటాయి. తాజాగా బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో తను చిన్నవాడిని అని చెప్పడంతో అతని ఏజ్ ట్రెండింగ్ లోకి వచ్చింది.

చేతులు బ్రిక్స్ కి తగలడంతో..

చేతులు బ్రిక్స్ కి తగలడంతో..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో మూడో వారం కెప్టెన్సీ ఎంపికలో భాగంగా గీతూ రాయల్, శ్రీ సత్య, ఆది రెడ్డి, ఫైమా, శ్రీహాన్ కెప్టెన్సీ పోటీదారులుగా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక వీరికి రెండు లెవెల్స్ లో బ్రిక్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. బ్రిక్స్ ను పేర్చడం.. ఆ తర్వాత మిగతా కంటెస్టెంట్స్ వాటిని కూల్చే ప్రయత్నం చేస్తే కాపాడుకోవడం వంటి రెండు దశలు ఉన్నాయి. బ్రిక్స్ ను కాపాడుకునే క్రమంలో ఫైమా చేతులు బ్రిక్స్ కి తగలడంతో ఆమెను డిస్ క్వాలిఫై చేశాడు రేవంత్.

 శ్రీహాన్ చేయి కూడా..

శ్రీహాన్ చేయి కూడా..

ఈ విషయంలో కొద్దిసేపు మాటల వారే జరిగింది. అది కాపాడుకునే ప్రయత్నంలో బ్రిక్స్ కు చేయి తగిలిందని ఫైమా.. చేత్తో బ్రిక్స్ ను జరిపావని రేవంత్ వాదించుకున్నారు. అలా కాపాడుకునేటప్పుడు నీకు తప్పా ఇంకెవరికీ అలా జరగలేదని రేవంత్ అన్నాడు. దీంతో ఇనయ సుల్తానా వచ్చి శ్రీహాన్ చేయి కూడా బ్రిక్స్ కు తగిలిందని సంచాలక్ అయిన రేవంత్ కు చెబుతుంది.

 ఏ పిట్ట.. ఏం కూసిన..

ఏ పిట్ట.. ఏం కూసిన..

అయితే ఇంతలోనే వచ్చిన శ్రీహాన్.. 'ఏ పిట్ట నీ దగ్గరికి వచ్చి ఏం కూసిన సంచాలక్ గా నీ నిర్ణయం నువ్ తీసుకో' అని అన్నాడు. పిట్ట అని మాట విన్న ఇనయ.. తెగ రచ్చ చేసేసింది. పిట్ట అని ఎలా అంటావ్.. అంటూ శ్రీహాన పై ఫైర్ అయింది. తర్వాత శ్రీహాన్ కూడా 'నేను నిన్ను అనలేదు.. నీ పేరు పెట్టలేదు' అంటూ గట్టిగానే వాదనకు దిగుతాడు. ఈ విషయం సద్దుమణిగాక ఆ తర్వాత శనివారం వచ్చిన నాగార్జున ఈ విషయం గురించి మాట్లాడిన విషయం తెలిసిందే.

 నేను చిన్నవాన్ని..

నేను చిన్నవాన్ని..

ఈ క్రమంలోనే శ్రీహాన్ ను వాడు అన్ని విషయం గురించి చెబుతూ ఇద్దరం ఒకే ఏజ్ గ్రూప్ కదా అని అలా అన్నానని ఇనయ చెబితే షాకింగ్ గా చూస్తూ 'నేను చిన్నవాన్ని' అని శ్రీహాన్ సమాధానమిస్తాడు. ఈ చర్చ తర్వాత బిగ్ బాస్ నాలుగో వారం నామినేషన్లలో మళ్లీ పిట్ట టాపిక్ తీసుకొస్తాడు శ్రీహాన్. 'నేను వాడు అంటే తీసుకోలేకపోయావు నన్ను పిట్టా ఎలా అంటాడు' అని ఇనయా మాట్లాడిన విధానాన్ని చెబుతూ ఆమెను నామినేట్ చేశాడు శ్రీహాన్.

 నా ఏజ్ గురించి నువ్ ఎలా చెప్తావ్ ..

నా ఏజ్ గురించి నువ్ ఎలా చెప్తావ్ ..

ఆ తర్వాత వచ్చిన ఇనయా కూడా శ్రీహాన్ ను నామినేట్ చేస్తుంది. నా వయసు తక్కువ అని అన్నావ్.. నా వయసు నీకు తెలుసా.. నా ఏజ్ గురించి నువ్ ఎలా చెప్తావ్ అని ఇనయ అడిగితే నా నోటితో చెప్పా అని వెకటకారంగా శ్రీహన్ సమాధానం ఇచ్చాడు. నీకంటే అనలేదు.. నా ఏజ్ తక్కువ అని చెప్పా అని శ్రీహాన్ అన్నాడు. దీంతో నా ఏజ్ ఎంత అనుకుంటున్నావో చెప్పు.. నా ఏజ్ గురించి నువ్ ఎలా మాట్లాడుతావ్.

నీకంటే భారీగా కనిపిస్తున్నాను..

నీకంటే భారీగా కనిపిస్తున్నాను..

నా ఏజ్ ఏమైనా పెద్దనా.. నేను లావుగా ఉన్నాను.. నీకంటే భారీగా కనిపిస్తున్నాను.. హైట్ వెయిట్ లో నీకంటే పెద్దగా ఉన్నాని ఏజ్ ఎక్కువ అని డిసైడ్ చేసేస్తావా.. ఇద్దరం అక్కడ ఉన్నాం.. నీ ఏజ్ తక్కువ అని అన్నావ్.. అంటే నా వయసు ఎక్కువ అని అన్నట్టే కదా.. అని ఇనయ అడుగుతుంది. దీంతో అక్కడ పెద్ద గొడవే జరుగుతుంది. దీంతో ఈ ఏజ్ టాపిక్ ఆసక్తికరంగా అనిపించింది.

 సుమారు ఆరెళ్లు పెద్ద..

సుమారు ఆరెళ్లు పెద్ద..

అందరూ శ్రీహాన్ వయసు ఎంతో తెలుసుకోవాలని గూగుల్ తల్లిని అడగడం మొదలెట్టేశారు. దీంతో ఇనయా సుల్తానా కంటే శ్రీహాన్ సుమారు ఆరెళ్లు పెద్ద అని తెలుస్తోంది. గూగుల్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఇనయా సుల్తానాకు 27 ఏళ్లు. 1995 ఆగస్టు 25న ఇనయా సుల్తానా పుట్టగా.. శ్రీహాన్ 1988 అక్టోబర్ 19న జన్మించాడు. అంటే ఇప్పుడు శ్రీహాన్ వయసు 33 ఏళ్లు. అంటే దాదాపుగా ఇనయా సుల్తానా కంటే శ్రీహాన్ ఆరెళ్లు పెద్ద అని తెలుస్తోంది. కానీ హౌజ్ లో మాత్రం ఏజ్ తక్కువ అని చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X