Bigg Boss Telugu 6: హౌజ్ లో శ్రీహన్ బర్త్ డే వేడుకలు.. కలిసిపోయిన బద్ద శత్రువులు, చిచ్చు పెట్టిన బిగ్ బాస్
బిగ్ బాస్ అనే రియాలిటీ షోలో ఎప్పుడు.. ఏం జరుగుతుందో చెప్పలేం. బద్ద శత్రువుల్లా ఉండేవాళ్లు కలిసిపోవచ్చు.. ఎంతో స్నేహంగా మెలిగేవారు బద్ద శత్రువులుగా మారొచ్చు. అందుకు ఉదాహరణే తాజాగా ప్రసారమవుతున్న బిగ్ బాస్ తెలుగు 6 సీజన్. ఈ ఆరో సీజన్ లో శ్రీహాన్, ఇనయా సుల్తానా నామినేషన్లలో ఎప్పుడూ వాదించుకుంటూ, అరుచుకంటూ బద్ద శత్రువుల్లా ఉన్నారు. కానీ ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు వారిద్దరు కలిసిపోయారు. ఎంతలా అంటే శ్రీహాన్ బర్త్ డే వేడుకలకు ఇనయా హడావిడి చేసే అంతగా. ఇప్పుడు దీనికి సంబంధించిన అక్టోబర్ 20 తేది ఎపిసోడ్ తాజా ప్రోమోను విడుదల చేసింది స్టార్ మా. ఆ ప్రోమో వివరాల్లోకి వెళితే..

విసిగిపోయిన బిగ్ బాస్..
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ఇంటి సభ్యులపై బిగ్ బాస్ స్ట్రైక్ చేస్తున్నాడు. వాళ్లు ఇన్ని రోజులుగా చేసిన పర్ఫామెన్స్ తో విసిగిపోయిన బిగ్ బాస్ హౌజ్ మేట్స్ కు పనిష్ మెంట్ ఇస్తున్నాడు. అక్టోబర్ 19న ప్రసారమైన ఎపిసోడ్ లో ఇంట్లో ఉన్న ఫుడ్ మొత్తం తీసుకెళ్లారు. తర్వాత ఆహారం పొందాలంటే రెండు గ్రూపులుగా విడిపోయి పోటీ పడాలని ఆదేశించాడు.

బద్ద శత్రువులు సైతం..
అందులో భాగంగానే కబడ్డీ, థగ్ ఆఫ్ వార్ గేమ్స్ ఆడించాడు బిగ్ బాస్. ఈ క్రమంలో ఓడిపోయిన గీతూ రాయల్.. గెలిచిన ఆదిరెడ్డి ప్లేట్ నుంచి ఆలు ముక్క తీసుకుని పనిష్ మెంట్ కు గురైంది. గీతూతోపాటు ఆదిరెడ్డితో అంట్లు తోమించాడు బిగ్ బాస్. ఇక ఈ బిగ్ బాస్ రియాలిటీ షోలో బద్ద శత్రువులు సైతం కలిసిపోయి మంచి ఫ్రెండ్స్ అవుతారు.

ఇనయా సుల్తానా హడావిడి..
తాజాగా శ్రీహాన్, ఇనయా సుల్తానాల మధ్య అదే జరిగింది. శ్రీహాన్ బర్త్ డే వేడుకలకు ఇనయా సుల్తానా హడావిడి చేసింది. ఆ విషయాన్ని పదే పదే ఇమిటేట్ చేస్తూ ఇంటి సభ్యులు ఆటపట్టించారు. కేకుపై శ్రీహాన్ అని కాకుండా చోటు అని రాయమని చెప్పింది ఇనయా సుల్తానా. ఇక బాగున్నావ్ అని ఇనయాకు శ్రీహాన్ కాంప్లిమెంట్ ఇచ్చాడనని శ్రీసత్య కామెంట్ చేసింది.

అందరికంటే నువ్వే బెటర్..
అంతేకాకుండా అక్టోబర్ 19 బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ లో తనను నామినేట్ చేశాడనే కోపంతోనే శ్రీహాన్ ను నామినేట్ చేశానని, హౌజ్ లో అందరికంటే నువ్వే బెటర్ అంటూ శ్రీహాన్ తో చెప్పుకొచ్చింది ఇనయా సుల్తానా. ఆ తర్వాత ఏదో నామినేషన్లు అనేగానీ, ఇనయాపై పర్సనల్ గా తనకు ఎలాంటి కోపం లేదని ఇంటి సభ్యులందరితో చెప్పాడు శ్రీహాన్.

గొడవే సీజన్ కు హైలెట్..
అయితే వీళ్లద్దరికి హౌజ్ లో ప్లస్ వాళ్లిద్దరు కొట్టుకోవడమే. వాళ్లిద్దరి మధ్య వచ్చే గొడవే సీజన్ కు హైలెట్. ఈ విషయాన్ని గీతూ కూడా చెప్పింది. కానీ తాజాగా విడుదల చేసిన ప్రోమో చూస్తుంటే వాళ్లిద్దరూ కలిసిపోయేలా కనిపిస్తుంది. ఇక శ్రీహాన్ పుట్టినరోజు వేడుకల తర్వాత ఇంట్లో ఉండటానికి అర్హత పోటి పెట్టి ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.

పువ్వుల టాస్క్..
రెండు రోజులు ఆహారం కోసం టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్.. తాజా ఎపిసోడ్ లో ఇంట్లో ఉండేందుకు అర్హత పోటీ పెట్టాడు. ఇందుకోసం పువ్వుల టాస్క్ ఇచ్చాడు. ముఖ ద్వారం నుంచి చిన్న గ్యాప్ ద్వారా ఫ్లవర్స్ వస్తాయి. వాటిని తీసుకుని దూరంగా ఉన్న మట్టిలో పాతి పెట్టాలి. ఈ క్రమంలో ఇంటి సభ్యుల మధ్య గొడవలు తీవ్రమైనట్లు తెలుస్తోంది.
లాగలేదా అంటూ ఫైర్..
అర్జున్ అండ్ రేవంట్ ఇద్దరూ అరుచుకున్నారు. అలాగే రేవంత్-శ్రీసత్య మధ్య చిన్న మాటల యుద్దం జరిగినట్లు తెలుస్తోంది. తర్వాత శ్రీహాన్-అర్జున్ చాలా గట్టిగా అరుచుకున్నారు. మీ టీమ్ లాగలేదా అంటూ ఫైర్ అయ్యాడు శ్రీహాన్. ఇది ఫిజికల్ టాస్క్ అయిందని ఆదిరెడ్డి మాట్లాడాడు.


Click it and Unblock the Notifications











