Bigg Boss Telugu 6 షాకింగ్ ట్విస్ట్.. ఇనయా-శ్రీహాన్ మధ్య రొమాన్స్.. ఐటమ్ సాంగ్ లో శ్రీసత్య!

అనూహ్య పరిణామాలు, విచిత్రమైన సంఘటనలు, రొమాన్సులు, అరుపులు, ఫ్రెండ్షిప్ వంటి అనేక ఎమోషన్స్ తో మళ్లీ ఎంటర్టైన్ మెంట్ బాటలో పయనిస్తోంది బిగ్ బాస్ తెలగు సీజన్ 6. ఎన్నో అనుమానాలు, అంచనాల మధ్య ప్రారంభమైన ఈ సీజన్ దాదాపుగా పూర్తి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌజ్ లో 8 మంది ఉన్నారు. వీరిలో ఆరుగురు ఎలిమినేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే డైరెక్ట్ ఫినాలేకు వెళ్లేందుకు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. కానీ ఆ టాస్క్ లో గేమ్ ఆడకుండా రొమాన్స్ చేశారు ఇనయా సుల్తానా, శ్రీహాన్. నిజానికి వీళ్లద్దరికి పడదన్న విషయం తెలిసిందే. అలాంటి శ్రీహాన్-ఇనయా ఊహించనివిధంగా కనిపించడంతో ఏం జరుగుతుందా అని మిగతా ఇంటి సభ్యులు అయోమయంలో పడిపోయారు.

13 వారానికి 8 మంది..

13 వారానికి 8 మంది..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 అనూహ్య పరిణామాలతో దూసుకుపోతోంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో వీరి మధ్య పెట్టిన నామినేషన్ల పర్వం వాడివేడీగా జరిగింది. ఈ సీజన్ కి 21 మంది కంటెస్టెంట్లు రాగా ప్రస్తుతం 13వ వారానికి 8 మంది మిగిలారు. 12వారం ఎలిమినేషన్ కింద మోడల్ రాజశేఖర్ బిగ్ బాస్ హౌజ్ వీడి వెళ్లిపోయాడు. ఈ వారం మధ్యలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

నామినేషన్లలో ఆరుగురు..

నామినేషన్లలో ఆరుగురు..

బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ 13వవారం నామినేషన్స్ ప్రక్రియ మరింత వాడీ వేడిగా సాగింది. ఈ వారం నామినేషన్లలో కెప్టెన్ అయినా కారణంగా ఇనయా సుల్తానా, ఎవరు నామినేట్ చేయనందున శ్రీహాన్ సేఫ్ అయ్యాడు. దీంతో మిగతా ఇంటి సభ్యులు అయినా రోహిత్, రేవంత్, ఫైమా, ఆదిరెడ్డి, శ్రీ సత్య, కీర్తి భట్ ఆరుగురు నామినేట్ అయ్యారు. ఇదిలా ఉంటే డైరెక్ట్ ఫినాలేకు వెళ్లేందుకు టికెట్ టు ఫినాలే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.

 నామినేషన్లలో ఆరుగురు..

నామినేషన్లలో ఆరుగురు..

బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ 13వవారం నామినేషన్స్ ప్రక్రియ మరింత వాడీ వేడిగా సాగింది. ఈ వారం నామినేషన్లలో కెప్టెన్ అయినా కారణంగా ఇనయా సుల్తానా, ఎవరు నామినేట్ చేయనందున శ్రీహాన్ సేఫ్ అయ్యాడు. దీంతో మిగతా ఇంటి సభ్యులు అయినా రోహిత్, రేవంత్, ఫైమా, ఆదిరెడ్డి, శ్రీ సత్య, కీర్తి భట్ ఆరుగురు నామినేట్ అయ్యారు. ఇదిలా ఉంటే డైరెక్ట్ ఫినాలేకు వెళ్లేందుకు టికెట్ టు ఫినాలే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.

 ఎవరైనా తీసుకోవచ్చు..

ఎవరైనా తీసుకోవచ్చు..

నవంబర్ 29 మంగళవారం నాటి ఈ ఫినాలే టాస్క్ ఎపిసోడ్ కు సంబంధించి రెండో ప్రోమోను విడుదల చేశారు. ఇందులో పోటీలో ఉన్న ఇంటి సభ్యులు మరొకరి సభ్యుడి స్నో మ్యాన్ పై అటాక్ చేసి వారి స్నో మ్యాన్ ను కట్టుకోవాల్సి ఉంటుందని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. దీంతో ఇప్పుడు అది తీసుకోవచ్చా సంచాలక్ అది అని కీర్తి అంటే తీసుకోవచ్చని శ్రీసత్య చెప్పింది. మీ ఇష్టం ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చని శ్రీసత్య అంది.

బిగ్ బాస్ రూల్ పెట్టలేదు..

బిగ్ బాస్ రూల్ పెట్టలేదు..

విరిగిపోయింది కన్సిడర్ లో లేదు కదా అని రేవంత్ అంటే.. అది సంచాలక్ గా నువ్ పెట్టుకున్నావ్ అని శ్రీసత్య అంది. దానికి నువ్ లేనిది కొత్తది చెప్పొచ్చు కానీ ఉన్నది మార్చే రైట్ లేదు కదా అని రేవంత్ అన్నాడు. బిగ్ బాస్ పెట్టలేదు కదా ఆ రూల్ అని శ్రీసత్య అంది. దీంతో సో ఇప్పుడు నీకు నచ్చినట్లు పెట్టుకుంటున్నావ్ అంతే కదా అని రేవంత్ అన్నాడు. సంచాలక్ గా కొన్ని కొన్ని రూల్స్ డెసిషియన్స్ తీసుకుంటారని అన్నావ్ కదా అని శ్రీసత్య అంటే షాక్ అయి చూశాడు రేవంత్.

ఒకరొకరు లాక్కుంటూ..

అది అటాక్ లా లేదు..

అది అటాక్ లా లేదు..

శ్రీహాన్-ఇనయా అలా చేయడంలో అసలు మీరు ఏం చేస్తున్నారు అని శ్రీసత్య అంది. వాళ్లిద్దరిని చూసి రేవంత్, ఆదిరెడ్డి ముసిముసి నవ్వులు నవ్వారు. తర్వాత ఇనయాను ఏం చేశారని శ్రీసత్య అడిగితే.. అటాక్ చేశా అని ఇనయా అంది. దానికి అది అటాక్ లా లేదు. మీరు టెలీకాస్ట్ లో చూసుకోండి ఎలా ఉందో అని శ్రీసత్య అంది. మీకు అలా అనిపిస్తే మేము ఏం చేయలేమని శ్రీహాన్ అన్నాడు.

ఐటమ్ డ్యాన్సర్ అన్నాడు..

తర్వాత శ్రీహాన్ దగ్గరికి వచ్చిన శ్రీసత్య నువ్ హ్యాపీయే కదా అని నవ్వుకుంటూ అడిగింది. తర్వాత రేవంత్, ఫైమా ఇద్దరు కలిసి ఇనయా-శ్రీహాన్ ఎలా చేశారో చేసి చూపించారు. లాగితే వెనక్కి వస్తుంది. కానీ లాగకుండా అంటూ రొమాంటిక్ గా చేసి చూపించింది శ్రీసత్య. తర్వాత పొద్దున నిన్ను ఐటమ్ డ్యాన్సర్ అన్నాడని ఇనయాతో శ్రీసత్య చెప్పింది. అనంతరం మిత్రవింద నువ్వు (ఇనయా) ఐటమ్ సాంగ్ లో ఈ అమ్మాయి (శ్రీసత్య) అని శ్రీహాన్ చెప్పాడు. దీంతో షాక్ అయి చూసింది శ్రీసత్య.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X