Bigg Boss Telugu 6: చంటికి ఆ అమ్మాయి కిస్సులు.. గీతూ వర్సెస్ రేవంత్ ఫైట్ మామూలుగా లేదు

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ అనేది ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మొదటి వారం నామినేషన్ అంతా కూడా బూటకం అని తేలిపోయింది. ఇక రెండోవారం మాత్రం తప్పనిసరిగా ఎవరో ఒకరు హౌస్ లో నుంచి వెళ్లిపోతారు అని బిగ్ బాస్ వివరణ ఇచ్చాడు. ఇక నామినేషన్ లో ఉన్నవారు మరింత బలంగా నిలబడాలి అని ఫిక్స్ అయ్యారు. ఇక నామినేషన్ ప్రక్రియలో మాటల యుద్ధాలు కూడా గట్టిగానే జరిగాయి. ఇక లేటెస్ట్ గా విడుదల చేసిన ప్రోమో వివరాల్లోకి వెళితే..

ఎవరి వలన ఇబ్బంది..?

ఎవరి వలన ఇబ్బంది..?

ముందుగా బాలాదిత్యా మాట్లాడుతూ.. నామినేషన్ కు కారణం బిగ్ బాస్ చెప్పింది ఏమిటంటే.. ఎవరి వలన ఇబ్బంది అవుతుంది అని మొదట గీతును నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. చలాకీ చంటి కూడా గీతూ ని నామినేట్ చేశాడు. ఇక రేవంత్ అయితే గీతుకు కౌంటర్ పడే విధంగా ముందుగానే మెల్లగా మాట్లాడుదామా? గట్టిగా మాట్లాడుకుందమా? అని స్టార్ట్ చేశాడు. నీకు నచ్చినట్లు మాట్లాడు అని గీతు కూడా గట్టిగానే ఆన్సర్ ఇచ్చింది.

గీతూ ఫ్లయింగ్ కిస్

గీతూ ఫ్లయింగ్ కిస్

పొద్దున్నే గీతు ఎలా ఉన్నావు అని అడిగే వాడి దగ్గర నుంచి.. గీతూకు ఏదైనా ఇబ్బంది అయితే దగ్గరికి వెళితే మంచి చెప్పొచ్చు కదా అని ఆలోచించే వాడి వరకు.. అందరూ ఒకటే అనుకుంటున్నారు. మంచిగా మాట్లాడితే ఇది కాంపిటీషన్ అంటుకుంటుందేమో అని ఎందుకు నేను వెళ్లి చెప్పడం అని అనుకుంటున్నారు అని చంటి చెప్పగా.. అందుకు గీతూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. చంటి ఏం మాట్లాడాలో తెలియక అలా మౌనంగా నిగ్రహం ఆపుకున్నాడు.

ఎగస్ట్రాలు వద్దు

ఎగస్ట్రాలు వద్దు

ఇక బాలాదిత్య మరోసారి పెదరాయుడు టైపులోనే మాట్లాడాడు. ఇక్కడ గెలవడం కచ్చితంగా ముఖ్యం కానీ ఎలా గెలిచాము అనేది కూడా చాలా ముఖ్యం. అని బాలాదిత్య తన వివరణ ఇచ్చాడు. ఇక సింగర్ రేవంత్ అయితే మీకు ఎథిక్స్ లేవేమో కానీ నాకు ఎథిక్స్ ఉన్నాయి అంటూ తన ప్రత్యర్థులకు సమాధానం ఇచ్చాడు. ఇక గీతుకు గుడ్ అనే అనగానే ఎగస్ట్రాలు వద్దు అని కౌంటర్ ఇచ్చాడు. అందుకు గీతూ నేను ఎగస్ట్రాలు మాత్రమే మాట్లాడతాను మరింత ఆవేశంగా తెలిపింది.

ఆవేశం మంచిది కాదు

ఆవేశం మంచిది కాదు

ఇక రేవంత్ కు అయితే ఆవేశం మంచిది కాదు అని బాలాజీత్యా కూడా క్లాస్ పీకాడు. ఇక కీర్తి అయితే శాని ఎక్కడ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అంటూ నామినేట్ చేసింది. ఇక శాని మంచితనం కూడా నటన అనుకునే స్థాయికి ఇక్కడ పరిస్థితులు ఉన్నాయని బాలాదిత్యా తెలియజేసాడు.

కోపం తెప్పించండి

కోపం తెప్పించండి

ఇక చివరికి షాని అయితే మీకేదైనా ఆప్షన్ ఉంటే నాకు కోపం తెప్పించే పని చేయండి అంటూ దయచేసి నన్ను సతాయించండి అంటూ అప్పుడు నేను కోపం పెట్టుకుంటాను అంటూ నవ్వుతూ రిక్వెస్ట్ చేశాడు. ఇక ఈ హౌస్ లో 15 వీక్స్ లో ప్రతిరోజు నామినిట్ అయిన అస్సలు నిన్ను కేర్ చేయను అంటూ ఇనయాకు ఆదిరెడ్డి కౌంటర్ ఇచ్చాడు మరి వీరి మధ్యలో మాటలు యుద్ధం హౌస్ లో ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X