Bigg Boss Telugu 6 నాన్న గురించి అబద్ధం చెప్పా.. పుట్టింటి వారి వల్ల అంటూ రేవంత్ తల్లి ఎమోషనల్ గా!

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ అంతిమ దశకు సిద్ధమైంది. టైటిల్ విన్నర్ ను ప్రకటించడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. తాజాగా 15వ వారం మిడ్ వీక్ ఎవిక్షన్ ప్రాసెస్ లో భాగంగా శ్రీసత్య ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ ను వీడింది. ప్రస్తుతం హౌజ్ లో ఐదుగురు మాత్రమే ఉన్నారు. ఇక వీరిలో మొదటి నుంచి బిగ్ బాస్ తెలుగు 6 టైటిల్ ఫేవరెట్ గా నిలిచాడు సింగర్ రేవంత్. అతనికి పోటీగా రోహిత్, శ్రీహాన్ ఉన్నప్పటికీ రేవంత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ టైటిల్ విన్నర్ ను చేయనుందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా రేవంత్ తండ్రి గురించి చెబుతూ అతని తల్లి సీతా సుబ్బలక్ష్మీ ఎమోషనల్ అయ్యారు.

ఫైనల్ కంటెస్టెంట్ గా ఎంట్రీ..

ఫైనల్ కంటెస్టెంట్ గా ఎంట్రీ..

టాలీవుడ్​లో సింగర్​గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు రేవంత్. అనేకమైన హిట్ సాంగ్స్ ఆలపించిన రేవంత్​ 2017లో ఇండియన్​ ఐడల్​ 9వ సీజన్ విన్నర్​గా నిలిచిన విషయం తెలిసిందే. అంతేకాకుండా బాహుబలి సినిమాలోని మనోహారి, బద్రీనాథ్ చిత్రంలోని అంబదరి, అర్జున్ రెడ్డిలోని తెలిసెనే నా నువ్వే వంటి తదితర చార్ట్​ బస్టర్స్​ అందించాడు. ఇక సింగర్ రేవంత్​ బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లోకి 21వ కంటెస్టెంట్ గా వెళ్లాడు. అతనే అందరికి టైటిల్ ఫేవరేట్ గా నిలిచాడు.

ఇటీవల కాస్తా మైనస్..

ఇటీవల కాస్తా మైనస్..

రేవంత్ మొదటి నుంచి కూడా జనాల్లో మంచి సపోర్ట్ తోనే కొనసాగుతున్నాడు. ఫిజికల్ టాస్క్ ల్లో రేవంత్ ను కొట్టే వారు లేరు. దీంతో రేవంత్ కు జనాల్లో విపరీతమైన సపోర్ట్ వచ్చింది. అలాగే ప్రతిసారి నామినేషన్లలో రేవంత్ ఎప్పుడూ నెంబర్ వన్ స్థానంలో ఉంటూ వచ్చాడు. ఇక అతనికి పోటీగా ఉన్న మిగతా వాళ్లు ఇదివరకే తప్పుల గురించి మాట్లాడినప్పటికి మొదట్లో అంతగా మైనస్ కాలేదు. కానీ చివరి వారాల్లో మాత్రం రేవంత్ తన అగ్రెషన్ తో కొంతవరకు నెగెటివిటీని మూటగట్టుకున్నాడు.

 విషాదకర విషయాలు..

విషాదకర విషయాలు..

ఇదిలా ఉంటే ఫ్యామిలీ వీక్ లో రేవంత్ తల్లి సీతా సుబ్బలక్ష్మీ వచ్చిన విషయం తెలిసిందే. హౌజ్ లో అందరినీ చాలా బాగా పలకరించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె రేవంత్ తండ్రికి సంబంధించిన పలు విషయాలపై ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు. ఆమె కుటుంబానికి సంబంధించిన పలు విషాదకర విషాయలను ఆమె పంచుకున్నారు. సీతా సుబ్బలక్ష్మీకి ఇద్దరు సంతానం. వారిలో రేవంత్ చిన్న కొడుకు.

 తండ్రి విదేశాల్లో ఉన్నాడని..

తండ్రి విదేశాల్లో ఉన్నాడని..

రేవంత్ కడుపులో ఉన్నప్పుడే అతని తండ్రి చనిపోయాడట. తండ్రి చనిపోయిన విషయం రేవంత్ పుట్టిన తర్వాత చెప్పలేదని సీతా సుబ్బలక్ష్మీ తెలిపారు. కొడుక్కి ఈ విషయం చెబితే అదే మనసులో పెట్టుకుని కుంగిపోతాడని, అందుకే చెప్పలేదని సీతా సుబ్బలక్ష్మీ వివరించారు. రేవంత్ వాళ్ల నాన్న విదేశాల్లో ఉన్నాడని అబద్ధం చెప్పి పెంచానని, రేవంత్ కు కనీసం తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలియదని ఎమోషనల్ అయ్యారు సీతా సుబ్బలక్ష్మీ.

 పాపకు గిఫ్ట్ గా ఇవ్వాలంటూ..

పాపకు గిఫ్ట్ గా ఇవ్వాలంటూ..

తన పుట్టింటి వార సాయంతో పిల్లల్ని పెంచి పెద్ద చేశానని చెప్పుకొచ్చారు రేవంత్ తల్లి. తన బిడ్డలే తనకు వరం అని, రేవంత్ కు కోపం ఎక్కువే కానీ, అది పాల పొంగులాంటిదని వివరించారు సీతా సుబ్బలక్ష్మీ. ఇదిలా ఉంటే సీజన్ ప్రారంభం నుంచి టైటిల్ ఫేవరెట్ గా సింగర్ రేవంత్ బరిలోకి దిగాడు. హౌజ్ లోకి అడుగుపెట్టడానికి ముందే ఎన్ని అడ్డుంకులు ఎదురైనా పోరాడి కప్పు గెలుచుకుని వస్తా అని ఎమోషనల్ గా పోస్ట్ పెట్టాడు. హౌజ్ లో కూడా చాలాసార్లు కప్పు కొట్టాక అది మా పాపకు గిఫ్ట్ ఇవ్వాలి అంటూ మాట్లాడేవాడు.

విన్నర్ రేసులో మిస్టర్ పర్ఫెక్ట్..

విన్నర్ రేసులో మిస్టర్ పర్ఫెక్ట్..

రేవంత్ మాటలు చూసి ముందే టైటిల్ విన్నర్ ఫిక్స్ అయ్యారా అనే అనుమానాలు తలెత్తాయి. కానీ, తర్వాత అలా ప్రతీసారి అంటే గెలుస్తానన్న నమ్మకంతో అలా అంటానని రేవంత్ అన్నాడు. ఇక హౌజ్ లో, బయట ప్రేక్షకులు అందరూ రేవంతే టైటిల్ విన్నర్ అని భావిస్తున్నారు. అయితే టైటిల్ విన్నర్ రేసులో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న రోహిత్ కూడా ఉన్నాడు. తన వ్యక్తిత్వంతో అనేక మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు రోహిత్. మరి వీళ్లిద్దరిలో ఎవరు టైటిల్ కొడతారనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X