Bigg Boss Telugu 6: అది చూసి చాలా ఏడ్చేశాను.. ఎమోషనల్ గా రేవంత్ భార్య, వీడియో వైరల్

బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ తుది దశకు చేరుకుంటోంది. ఫైనల్స్ కు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉండడంతో ఎవరు కూడా తగ్గకుండా గేమ్ ప్లాన్స్ ను ఫాలో అవుతున్నారు. ఇక ఇవాళ జరిగే ఎపిసోడ్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ పెట్టి ఒకరిని డైరెక్ట్ గా ఫినాలేకు పంపనున్నాడు బిగ్ బాస్. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లోకి టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగాడు సింగర్ రేవంత్.

దీంతో అతనిపై అందరి దృష్టిపడింది. టైటిల్ విన్ అయ్యేందుకు మొదటి నుంచి చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు రేవంత్. ఇక రేవంత్ బిగ్ బాస్ కు వచ్చేముందు అతని భార్య గర్భవతి అని తెలిసిందే. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో రేవంత్ ఆట తీరు, తదితర విషయాలపై ఎమోషనల్ గా మాట్లాడారు అతని భార్య అన్విత.

చివరి కంటెస్టెంట్ గా ఎంట్రీ..

చివరి కంటెస్టెంట్ గా ఎంట్రీ..

టాలీవుడ్​లో సింగర్​గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు రేవంత్. ఎన్నో హిట్ సాంగ్స్ ఆలపించిన రేవంత్​ 2017లో ఇండియన్​ ఐడల్​ 9వ సీజన్ విన్నర్​గా నిలిచిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మనోహారి, అంబదరి, తెలిసినే నా నువ్వే వంటి తదితర చార్ట్​ బస్టర్స్​ అందించాడు. ఇక సింగర్ రేవంత్​ బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లోకి 21వ కంటెస్టెంట్ గా వెళ్లాడు. అతనే అందరికి టైటిల్ ఫేవరేట్ గా నిలిచాడు.

మొదటి నుంచి మంచి సపోర్ట్..

మొదటి నుంచి మంచి సపోర్ట్..

రేవంత్ మొదటి నుంచి కూడా జనాల్లో మంచి సపోర్ట్ తోనే కొనసాగుతున్నాడు. అతను టాస్క్ లలో కొన్నిసార్లు నిరాశపరిచినప్పటికి జనాల్లో సపోర్ట్ ఎక్కువవుతోంది. ఇక అత్యధిక ఓట్లు అందుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లలో అతను నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు అని చెప్పవచ్చు. ఇక అతనికి పోటీగా ఉన్న మిగతా వాళ్లు ఇదివరకే తప్పుల గురించి మాట్లాడినప్పటికి అంతగా మైనస్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం రేవంత్ పై గట్టిగానే ఫోకస్ చేసినట్లు అనిపిస్తోంది.

సంతృప్తి ఇవ్వని వీడియో కాల్..

సంతృప్తి ఇవ్వని వీడియో కాల్..

అయితే బిగ్ బాస్ హౌజ్ లోకి రేవంత్ వెళ్లేముందు అతని భార్య అన్విత 6 నెలల గర్భవతి. రేవంత్ హౌజ్ లో ఉండగా ఆమె సీమంతం జరిగింది. దానికి సంబంధించిన వీడియోను కూడా హౌజ్ లో చూపించారు. దీంతో రేవంత్ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. టైటిల్ కొట్టి అతని బిడ్డకు గిఫ్ట్ గా ఇవ్వాలని తెగ ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల ఫ్యామిలీ వీక్ లో రేవంత్ తన భార్య అన్వితతో కొద్దిసేపు వీడియో కాల్ మాట్లాడాడు. అది రేవంత్ కు అంతగా సంతృప్తిని ఇవ్వలేదు.

ఫ్యామిలీ అంతా ఉంది..

ఫ్యామిలీ అంతా ఉంది..

ఇదిలా ఉంటే తాజగా ఓ ఇంటర్వ్యూలో రేవంత్ భార్య అన్విత పాల్గొన్నారు. దీనికి బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ కంటెస్టెంట్, యాంకర్ స్రవంతి చొకారపు హోస్ట్ గా వ్యవహరించింది. ఇవాళ ఒక బ్యూటిఫుల్ సోల్ ను ఇంటర్వ్యూ చేసేందుకు హైదరాబాద్ నుంచి గుంటూర్ వచ్చామని చెప్పి.. రేవంత్ సతీమణి అన్వితను స్వాగతించింది యాంకర్ స్రవంతి. ఈ సమయంలో ప్రతి ఒక్క ఒక్కరికి తన భర్త పక్కన ఉండాలనిపిస్తుంది అని స్రవంతి అంటే.. తను ఉన్న లేకపోయిన ఫ్యామిలీ అంతా ఉంది అని అన్విత సమాధానమిచ్చారు.

ఆ మూమెంట్ వరకే అది..

ఆ మూమెంట్ వరకే అది..

మీ సీమంతం గ్లింప్స్ ను రేవంత్ కు చూపించారు, తర్వాత ఆ గాజులు పంపించారు అని స్రవంతి అంటే.. అవును రేవంత్ పంపిన గాజులు ఇవే అంటూ చూపించారు అన్విత. ఆ ఎపిసోడ్ చూసినప్పుడు మీకు ఏమనిపించిందన్న ప్రశ్నకు.. ఆ ఎపిసోడ్ చూసినప్పుడు చాలా అంటే చాలా ఏడ్చేశాను అని అన్విత అన్నారు. మీతో ఎలా ఉంటాడు, అంతే కోపం ఉంటుందా.. మీతో, ఇంట్లో వాళ్లతో అన్న ప్రశ్నకు.. ఆ కోపం అనేది ఆ మూమెంట్ వరకే ఉంటుందని సమాధానం ఇచ్చారు అన్విత.

రేవంత్ ఒక్కరికే కాదుగా..

రేవంత్ ఒక్కరికే కాదుగా..

మీ ఫేవరేట్ టాస్క్ ఏంటి రేవంత్ ఆడిన వాటిల్లో అన్న యాంకర్ స్రవంతి ప్రశ్నకు.. అతను ప్రతి టాస్క్ లో తన బెస్ట్ ఇస్తాడు అంతే అని రేవంత్ భార్య అన్విత సమాధానం ఇచ్చారు. లాస్ట్ టూ వీక్స్ నుంచి మరింత ఫిజికల్ అవ్వడంతో గాయాలు అయ్యాయి. అది మీరు ఎలా తీసుకున్నారని అడిగితే.. అది ఆటలో భాగం. రేవంత్ కే కాదు మిగతా వారికి కూడా అయ్యాయి కదా అని అన్విత చెప్పారు.

రేవంత్ కోసం పాట..

రేవంత్ కోసం పాట..

రేవంత్ చాలా ఎమోషనల్ అయ్యాడు. అతనికి ఏం హర్ట్ అయి ఉంటుందని అనుకుంటారు అని స్రవంతి అడగ్గా.. ఆ మాటలు బయట నుంచి ఎప్పుడూ తీసుకోలేదన్నమాట అని అన్విత ఆన్సరిచ్చారు. అందరూ అబ్బా రేవంత్ ఉండకూడదు అని వెనుకాల మాట్లాడుకోవడం జరుగుతోందని అంటే ఇప్పుడు వాళ్ల నుంచి దూరంగా ఉండటం బెటర్ అని అన్విత అన్నారు. ఇప్పటివరు రేవంత్ నోట పాటలు విన్నాం ఒక్కసారి మీరు పాడాలని అంటే 'ప్రియతమా నీవు అచట కుశలమా' అనే పాట పాడారు అన్విత. ప్రస్తతం ఈ ఇంటర్వ్యూ ప్రోమో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X