Bigg Boss Telugu 6: సిరి తీసుకొచ్చిన ఆ బుడ్డోడు ఎవరో తెలుసా.. శ్రీహన్ ను డాడీ అంటూ..

బిగ్ బాస్ తెలుగు ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్రేక్షకుల ఆదరణను మరింత పెంచుకుంటుంది. మొదట్లో కొంత నీరసంగా అనిపించినప్పటికీ ఇప్పుడు మాత్రం కంటెస్టెంట్స్ వారి కుటుంబ సభ్యులు కలుసుకోవడంతో హై ఎమోషనల్ ట్రాక్స్ మొదలవుతున్నాయి. దీంతో కంటెస్టెంట్స్ కూడా మరింత బలంగా ఆటలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే శ్రీహన్ ప్రేయసి సిరి హనుమంతు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టడం కూడా హైలెట్ గా నిలిచింది. అయితే ఆమెతో వచ్చిన ఒక పిల్లవాడు ఎవరు అనే విషయంలో సోషల్ మీడియాలో చేర్చ కొనసాగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

శ్రీహన్ గెలవాలి అని..

శ్రీహన్ గెలవాలి అని..

పలు వెబ్ సిరీస్ లతో మంచి గుర్తింపు అందుకున్న సిరి హనుమంతు శ్రీహాన్ ఇద్దరికీ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక మొదట సిరి బిగ్ బాస్ 5 సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. ఆమె టాప్ 5 లో ఉన్నప్పటికీ కూడా చివరి వరకు వెళ్లలేకపోయింది. అయితే ఇప్పుడు ఎలాగైనా తన ప్రియడు శ్రీహన్ గెలవాలి అని ఆమె కోరుకుంటుంది.

పదేళ్ళుగా చూస్తున్నా..

పదేళ్ళుగా చూస్తున్నా..

ఇక ఇటీవల శ్రీహాన్ కోసం ప్రత్యేకంగా హౌస్ లోకి వచ్చిన కీర్తి అతన్ని చూడగానే చాలా ఎమోషనల్ అయిపోయింది. ఎన్నో విషయాల గురించి చర్చిస్తూ ఇప్పటివరకు బాగానే ఆడావు అని ఇక ముందు కూడా నువ్వు అద్భుతంగా ఆడాలి అని అతనికి సపోర్ట్ చేసింది. అయితే ఎవరు ఏమనుకున్నా నీపై ఎంతమంది ఎన్ని నిందలు వేసిన కూడా నువ్వు ఏమిటో నాకు తెలుసు అని గత పదేళ్ళుగా నేను నిన్ను చూస్తున్నాను అని ఆమె నమ్మకంగా తెలియజేసింది.

 సిరి హనుమంతు బాబు

సిరి హనుమంతు బాబు

అయితే సిరి హనుమంతుతో పాటు ఒక బాబు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. అతను సిరిని మమ్మీ అంటూ శ్రీహన్ ను డాడీ అని పిలిచాడు. అతని అసలు పేరు చైతన్య. గతంలోనే సిరి అతని గురించి చెప్పింది. నాకు పుట్టలేదు కానీ నాకు ఒక బాబు ఉన్నాడు అని అతడే తనకు ఎంతో ఇష్టమని కూడా ఆమె చాలా సందర్భాల్లో తెలియజేసింది.

మొదట్లో అలాంటి కథనాలు

మొదట్లో అలాంటి కథనాలు

అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి రాగానే చైతన్య, డాడీ అంటూ శ్రీహన్ దగ్గరికి వెళ్లిపోయాడు. ఇక శ్రీహన్ కూడా అతన్ని చూస్తూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఒక విధంగా వాళ్ళిద్దరూ తండ్రి కొడుకుల తరహాలోనే కనిపించారు. అయితే చైతన్య గురించి ఇదివరకే కొన్ని కథనాలు వెలుపడ్డాయి. అతను సిరి కుటుంబ సభ్యులకు చెందిన అబ్బాయి అనే అతన్ని ఆమె దత్తతకు తీసుకుంది అని కూడా కామెంట్స్ వినిపించాయి.

సొంత సోదరుడి కొడుకే..

సొంత సోదరుడి కొడుకే..

అయితే ఇంతవరకు వచ్చినా వార్తల్లో మాత్రం ఎలాంటి నిజం లేదు. చైతన్య మరెవరో కాదు స్వయానా సిరి సొంత సోదరుడి కొడుకు. చిన్నప్పటినుంచి అతన్ని ఆమె ఒక తల్లి తరహాలోనే పెంచుకుంటూ వస్తోంది. ఇక సారి హనుమంతు శ్రీహాన్ ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు కూడా ఎక్కువగా వారితోనే చైతు కూడా ఉన్నాడు. అందుకే అతను వారిని మమ్మీ డాడీ అని పిలుస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ లోకి అతను వచ్చి రాగానే ఒక ఫ్యామిలీ మూమెంట్ అయితే కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X