Bigg Boss Telugu 6 గేమ్ గురించి శ్రీహాన్ కి సిరి హన్మంతు హింట్స్?.. ముద్దులతో ఆ సీక్రెట్ రివీల్!

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ఫ్యామిలీ వీక్ తో సరదాగా, ఎమోషనల్ గా, సంతోషంగా సాగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ ఇంటిలోకి ఆదిరెడ్డి భార్య కవిత, అతను పాప అద్విత వచ్చి సందడి చేశారు. హౌజ్ గార్డెన్ లో ఆదిరెడ్డి పాప మొదటి పుట్టినరోజు సెలబ్రేషన్స్ నిర్వహించారు. అనంతరం రాజశేఖర్ అమ్మ ఉమారాణి, రోహిత్ మదర్, శ్రీసత్య తల్లితండ్రులు, ఫైమా తల్లి వచ్చి ఇంటి సభ్యులందరిచేత సరదాగా ముచ్చటించారు. ఇక నిన్నటి గురువారం నాటి 81వ రోజు 82వ ఎపిసోడ్ లో శ్రీహాన్ లవర్, బిగ్ బాస్ ఐదో సీజన్ కంటెస్టెంట్ సిరి హన్మంతు వచ్చి సందడి చేసింది. ఈ క్రమంలో బిగ్ బాస్ గేమ్ లో అతని స్థానం, మిగతా ఇంటి సభ్యులపై బయట రెస్పాన్స్ పై పలు హింట్స్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

 హౌజ్ లో 9 మంది..

హౌజ్ లో 9 మంది..

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్‌లోకి 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. అయితే, ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేసి.. రెండో వారంలో డబుల్ నామినేషన్ పెట్టారు. ఆ తర్వాత ఒక్కొక్కరినే పంపించి.. మళ్లీ పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ చేశారు. ఇలా ఇప్పటికే షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి, మెరీనాలు వెళ్లిపోయారు. 11 వారాలకు 12 మంది వెళ్లిపోగా.. ప్రస్తుతం హౌజ్ లో 9 మంది ఉన్నారు.

 ఫైమా వద్ద ఫ్రీ ఎవిక్షన్ పాస్..

ఫైమా వద్ద ఫ్రీ ఎవిక్షన్ పాస్..

ఇక 12వ వారం నామినేషన్స్ లో కెప్టెన్ రేవంత్, కీర్తి భట్ మినహా మిగతా ఏడుగురు ఉన్నారు. అంటే ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 6 ఈవారం నామినేషన్లలో శ్రీహాన్, శ్రీసత్య, రోహిత్, ఆదిరెడ్డి, రాజశేఖర్, ఫైమా, ఇనయా సుల్తానా ఉన్నారు. అయితే వీరిలో ఫ్రీ ఎవిక్షన్ పాస్ ఫైమా వద్ద ఉంది. ఒకవేళ ఆమె ఈ వారం ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వచ్చినా ఆ పాస్ ద్వారా ఫైమా సేఫ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

 కంటెస్టెంట్ల కుటుంబ సభ్యుల ఎంట్రీ..

కంటెస్టెంట్ల కుటుంబ సభ్యుల ఎంట్రీ..

అయితే ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో 12వ వారం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. ప్రస్తుతం హౌజ్ లో 9 మంది ఉండగా.. ఈ వారం కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా ఒక్కో రోజు వచ్చి సందడి చేస్తున్నారు. దీంతో ఈ వీక్ అంతా కంటెస్టెంట్స్ కు చాలా సంతోషంగా, ఎమోషనల్ గా గడుస్తోంది. ఫ్యామిలీ వీక్ లో భాగంగా మొదట మంగళవారం ఎపిసోడ్ లో ఆదిరెడ్డి భార్య, అతని పాప, తర్వాత రాజ్, రోహిత్, ఫైమా మదర్ తో పాటు శ్రీసత్య తల్లిదండ్రులు ఇద్దరు హౌజ్ లో సందడి చేశారు.

మూడు ముద్దులతో ఆ విషయం..

మూడు ముద్దులతో ఆ విషయం..

తాజాగా గురువారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌజ్ లోకి శ్రీహాన్ లవర్ సిరి హన్మంతుతో పాటు అతని కొడుకు చైతన్య, కీర్తి భట్ కోసం మనసిచ్చి చూడు నటుడు మహేశ్ బాబు కాళిదాసు, ఇనయా తల్లి ఎంట్రీ ఇచ్చారు. అయితే సిరి రావడంతోనే ఎమోషనల్ అయ్యాడు శ్రీహాన్. ఎందుకు ఏడుస్తున్నావ్ అంటూ అడిగిన సిరి.. తర్వాత శ్రీహాన్ కు మూడు ముద్దులు ఇచ్చింది. దాని అర్థం శ్రీహాన్ టాప్ 3లో ఉన్నట్లు సిరి హింట్ ఇచ్చిందని టాక్ వినిపిస్తోంది.

ఇనయా లేడి టైగర్..

ఇనయా లేడి టైగర్..

అలాగే ఇనయా సుల్తానాను ఎపిసోడ్ మొత్తంలో ఎక్కువగా లేడి టైగర్.. లేడి టైగర్ అంటూ ఆమెకు బయట ఉన్న క్రేజ్ ను చెప్పకనే చెప్పింది. ఇక కీర్తి భట్ ను హగ్ చేసుకుంటూ తను నా ఫ్రెండ్ అని శ్రీహాన్ కు చెప్పింది. అంటే కీర్తితో ఎక్కువగా గొడవపడకూడదని అలా చెప్పినట్లు నెటిజన్లు అంచనా వేస్తున్నారు. శ్రీహాన్ కు, కీర్తికి మొదటి నుంచి ఏదో రకంగా గొడవ అవుతున్న విషయం తెలిసిందే.

మీ ఇద్దరిది బ్రోమాన్స్?

మీ ఇద్దరిది బ్రోమాన్స్?

అయితే కీర్తి భట్ కోసం సీరియల్ నటుడు మహేశ్ బాబు కాళీదాస్ వచ్చి వెళ్లాకా.. కీర్తికి శ్రీహాన్ సారీ చెప్పాడు. సిరి ఇచ్చిన హింట్ తోనే అలా చేశాడా అని నెటిజన్ ఆడియెన్స్ చర్చించుకుంటున్నారు. ఇక రేవంత్ తో శ్రీహాన్ ఫ్రెండ్ షిప్ గురించి మాట్లాడుతూ "ఏంటీ మీ ఇద్దరిది బ్రోమాన్సా..? బాగుంది మీ ఫ్రెండ్ షిప్" అని అంది. అంటే మీరు ఇలాగే ఫ్రెండ్ షిప్ కంటిన్యూ చేయండి ప్రేక్షకులకు నచ్చిందని హింట్ ఇచ్చిందని అంటున్నారు.

ఒక్కడివే ఆడు.. అదే నచ్చుతుంది..

ఒక్కడివే ఆడు.. అదే నచ్చుతుంది..

ఇక శ్రీహాన్, సిరి హన్మంతు ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకున్నారు. "గేమ్ పరంగా మాత్రం ఒక్కడివే ఆడు. అలానే ప్రేక్షకులకు నచ్చుతుంది. కేవలం గేమ్ మాత్రమే ఫోకస్ చేయి. దేని గురించి ఆలోచించకు. నిన్ను పదేళ్ల నుంచి చూస్తున్నాను. నువ్వేంటో నాకు తెలుసు. నీకు ఎలా అనిపిస్తే అది చేయి.. గేమ్ లో ఎమోషన్స్ రానివ్వకు. నీకోసం మాత్రమే ఆడు" అని చాలా గట్టిగా చెప్పింది సిరి. శ్రీసత్యకు దూరంగా ఉండమని హింట్ కూడా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X