twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6 అక్కడ టాటూ వేయించుకున్న సిరి హన్మంతు.. షాక్ లో శ్రీహాన్!

    |

    బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ తో ఎమోషనల్ గా సాగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ ఇంటిలోకి ఆదిరెడ్డి భార్య కవిత, అతను పాప అద్విత వచ్చి సందడి చేశారు. హౌజ్ గార్డెన్ లో ఆదిరెడ్డి పాప మొదటి పుట్టినరోజు సెలబ్రేషన్స్ నిర్వహించారు. అనంతరం రాజశేఖర్ అమ్మ ఉమారాణి, రోహిత్ మదర్, శ్రీసత్య తల్లితండ్రులు, ఫైమా తల్లి వచ్చి ఇంటి సభ్యులందరిచేత సరదాగా ముచ్చటించారు. తాజాగా బిగ్ బాస్ తెలుగు 6 నవంబర్ 24 గురువారం నాటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది స్టార్ మా. ఈ ఎపిసోడ్ లో శ్రీహాన్ ప్రేయసీ, మాజీ కంటెస్టెంట్ సిరి హన్మంతు, అతని కొడుకు వచ్చి అలరించారు.

    హౌజ్ లో ఫ్యామీలీ వీక్..

    హౌజ్ లో ఫ్యామీలీ వీక్..

    బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో 12వ వారం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. ప్రస్తుతం హౌజ్ లో 9 మంది ఉండగా.. ఈ వారం కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా ఒక్కో రోజు వచ్చి సందడి చేస్తున్నారు. దీంతో ఈ వీక్ అంతా కంటెస్టెంట్స్ కు చాలా సంతోషంగా, ఎమోషనల్ గా గడుస్తోంది. ఫ్యామిలీ వీక్ లో భాగంగా మొదట మంగళవారం ఎపిసోడ్ లో ఆదిరెడ్డి భార్య, అతని పాప హౌజ్ లో సందడి చేశారు. ఇప్పుడు హౌజ్ లోకి శ్రీహాన్ లవర్ సిరి హన్మంతు ఎంట్రీ ఇచ్చింది.

    సిరిని చూసి శ్రీహాన్ ఎమోషనల్..

    సిరిని చూసి శ్రీహాన్ ఎమోషనల్..

    బిగ్ బాస్ హౌజ్ లోకి సిరి హన్మంతు ఎంట్రీ ఇవ్వగానే అది చూసి శ్రీహాన్ ఎమోషనల్ అయ్యాడు. అది చూసి ఎందుకు ఏడుస్తున్నావని సిరి అడిగింది. దీనికి కన్ను కొడుతూ ప్రేమ చూపించాడు శ్రీహాన్. శ్రీహాన్ ను ముద్దు పెట్టుకుని హగ్ చేసుకుంది సిరి. అప్పుడు సిరి ఫ్రీజ్ అని బిగ్ బాస్ చెప్పాడు. పాత పరిచయాలు బిగ్ బాస్ కు నీకు అని శ్రీహాన్ అంటే.. ఐ లవ్యూ బిగ్ బాస్ అని సిరి హన్మంతు చెప్పింది.

    సత్యకు చెప్పావని సిరి కౌంటర్..

    సత్యకు చెప్పావని సిరి కౌంటర్..

    సిరి, శ్రీహాన్ ఒకరినొకరు హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నారు. అనంతరం ఇంటి సభ్యులతో సిరి ముచ్చటించింది. ఎన్ని సార్లు నిన్ను చింకీ ఫేస్ అన్నాడో అని రేవంత్ అంటే.. కోపంగా చూసింది సిరి. దాని తర్వాత క్యూట్ గా కూడా ఉంటుందని చెప్పాగా అని శ్రీహాన్ అన్నాడు. నాకు చెప్పలేదు.. సత్యకు చెప్పావ్ అని సిరి అంది. దీంతో ఇంటి సభ్యులందరూ తెగ నవ్వేశారు. ఇనయా.. ఏంటీ ఈ మధ్య మావోడి మీద కాన్సన్ ట్రేట్ చేయట్లేదని అడిగింది సిరి.

    శ్రీహాన్ కు సిరి సర్ ప్రైజ్..

    శ్రీహాన్ కు సిరి సర్ ప్రైజ్..

    పాపం శ్రీహాన్ ను ఏడిపిస్తున్నా.. ఏం అనుకోకు అని శ్రీసత్య అంటే.. అనుకుంటా.. ఏడిపించకు అని కౌంటర్ వేసింది సిరి. దీంతో షాక్ అయి అలా చూసింది శ్రీసత్య. తర్వాత బిగ్ బాస్ బెడ్ రూమ్ లు ఉన్న చోట శ్రీహాన్, సిరి ఇద్దరే ఉన్నారు. శ్రీహాన్ ను కళ్లు మూసుకోమ్మని.. నీకో సర్ ప్రైజ్ అని చెప్పింది సిరి. అప్పుడు శ్రీహాన్ ముందుకు వెళ్లి తన హెయిర్ పక్కకు జరిపి.. మెడపై ఉన్న టాటూ చూపించింది సిరి.

    క్యూట్ గా శ్రీహాన్ కొడుకు..

    క్యూట్ గా శ్రీహాన్ కొడుకు..

    సిరి మెడపై టాటూ చూసిన శ్రీహాన్ ఒక్కసారిగా షాక్ అయి తెగ సంతోషించాడు. శ్రీహాన్ అనే పేరుతో రెండు లవ్ సింబల్స్ ను టాటూగా వేయించుకుంది సిరి. అది చూసిన శ్రీహాన్ ఆనందంతో సిరిని వెనుక నుంచి హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత డాడీ అంటూ ఎంట్రీ ఇచ్చాడు శ్రీహాన్ కొడుకు. దీంతో పరుగెత్తుకుంటూ వెళ్లి తన కొడుకును ఎత్తుకున్నాడు శ్రీహాన్. అరెయ్ ఎప్పుడు వచ్చావురా నువ్ అంటే.. అప్పుడే అని క్యూట్ గా సమాధానం ఇచ్చాడు.

    ఐలవ్యూ కవిత అంటూ సిరి కొడుకు..

    శ్రీహాన్ బిగ్ బాస్ ను ఎలా పిలుస్తాడో అదే స్టైల్ లో చెప్పి నవ్వించాడు సిరి కుమారుడు. నేను ఇలాగే ఉంటానని రేవంత్ అంటాడని చెప్పాడు. ఇనయాతో డాడ్ కి గొడవ అయింది కదా అప్పుడు ఏమన్నాడు అని సిరి అడిగితే.. వాడు వీడు ఏంటి అనే డైలాగ్ పలికి పలకేలక చెప్పాడు. కవిత ఐలవ్యూ అని ఆదిరెడ్డి డైలాగ్ చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత గార్డెన్ లో సిరిని ఎత్తుకుని అటు ఇటు తిప్పాడు శ్రీహాన్. సిరి నుదిటిపై శ్రీహాన్ ముద్దుపెట్టాడు. ఆ తర్వాత తమ కొడుకుకి శ్రీహాన్, సిరి ముద్దు పెట్టడంతో ప్రోమో ఎండ్ అయింది.

    English summary
    Bigg Boss Telugu 6: Siri Hanumanth And Her Son Entry In Bigg Boss House Over Family Week November 24 Episode Promo.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X