Bigg Boss Telugu 6: మెల్లగా క్రేజ్ పెంచుకుంటున్న ఆ లేడి కంటెస్టెంట్.. టాప్ 5లో మరొకరికి పోటీగా..
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా బలంగా పోరాడుతున్నారు. ముఖ్యంగా కెప్టెన్సీ టాస్కులో అయితే వారి శక్తికి మించి పోటీ పడుతూ ఎలిమినేషన్స్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈవారం ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకున్న కంటెస్టెంట్స్ లలో గీతూకి పోటీగా మరొక అమ్మాయి టాప్ లో నిలుస్తోంది. మొన్నటివరకు మొదట్లోనే వెళ్లిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు టాప్ 5 లోకి ఈజీగా వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ తెలివైన టాస్క్
బిగ్ బాస్ లో పరిస్థితులు ఎప్పటికప్పుడు తారుమారవుతున్నాయి. బిగ్ బాస్ కూడా ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అర్ధం అవుతోంది. ఇంతకుముందు టాస్క్ లలో అయితే ఎక్కువగా ఎవరికి వారు పై చేయి సాధించే విధంగా గేమ్ ఆడారు. అయితే ఇటీవల బ్యాటరీ రీఛార్జి టాస్క్ లో మాత్రం ఏ ఒక్కరు తప్పు చేసిన మిగతా వారిపై కూడా ప్రభావం పడేవిధంగా బిగ్ బాస్ ఆడిన గేమ్ బాగా వర్కౌట్ అయింది.

ఒక్కసారిగా డౌన్
అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఎవరు టాప్ 5 లో నిలుస్తారు అనే విషయం కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 6వ వారంలోకి అడుగు పెట్టిన బిగ్ బాస్ షోలో టాప్ కంటెస్టెంట్స్ ను సెలెక్ట్ చేసుకోవడం అంత ఈజీ ఏమీ కాదు. ఎందుకంటే ప్రతివారం కూడా ఎవరో ఒకరు ఊహించని విధంగా పై స్థాయికి చేరుకుంటున్నారు. ఒక వారం టాప్ లో ఉన్నవారు మళ్లీ రెండో వారం ఒక్కసారిగా డౌన్ అవుతున్నారు.

టాప్ 5లో గీతూ
ఇక గీతూ రాయల్ రెండు వారాల తర్వాత క్రేజ్ బాగానే అందుకుంది. ఆమె మొదట్లో అనవసరంగా ఓవరాక్షన్ చేస్తుంది అనే కామెంట్స్ అయితే ఎక్కువగానే అందుకుంది. ఇక రేవంత్ టాప్ లో ఉండడంతో అతనికి పోటీగా నిలవాలని కూడా ఆమె ప్రయత్నాలు చేసింది. అనుకున్నట్లుగానే రెండవ వరం గీతూ రాయలు టాప్ 5 లో ఒక కంటెస్టెంట్ గా కొనసాగింది అని సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ అందుకుంది.

తగ్గిన గీతూ హవా
అయితే నాలుగవ వారం అలాగే ఐదో వారం గీతూ రాయల్ ఆడిన గేమ్ అయితే ఏం మాత్రం వర్కౌట్ కాలేదు. ప్రతి టాస్క్ లో కూడా ఆమె పై చేయి సాధించేందుకు ప్రయత్నం చేసింది కానీ అనవసరమైన వివాదాలతోనే ఓట్ల సంఖ్యను కూడా తగ్గించుకుంది. ఇక టాప్ 5 లో ఉండే అమ్మాయిలలో ఇప్పుడు మాత్రం గీతూ లేదు ఆమె స్థానం మెల్లమెల్లగా తగ్గుతుంది అని అనిపిస్తోంది.

పోటీగా వాసంతి
ఇక ఇప్పుడు గీతూకు పోటీగా టాప్ 5 లో నిలిచేందుకు మరొక అమ్మాయి రంగంలోకి దిగింది. వాసంతి గత వారం అయితే తన స్ట్రాటజీతో బాగానే హైలైట్ అయింది. ఇక ఈ వారం కూడా ప్రతి టాస్క్ లో కూడా శక్తికి మించి పోరాడే ప్రయత్నం చేసింది. బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ లో కూడా ఆమె ఎమోషనల్ గా ఆడియెన్స్ ను తన వైపుకు తిప్పుకుంది. ఇక ఇప్పుడు టాప్ 5 లో రేవంత్ శ్రీరామ్ కీర్తి ఆదిరెడ్డి ఉండగా మరోవైపు గీతూ రాయల్ అలాగే వాసంతి పోటీపడుతున్నారు ఈ వారం కూడా వాసంతి గట్టిగా ప్రయత్నం చేస్తే టాప్ 5 లో ఇంకా పై స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications











