Bigg Boss Telugu 6: ఆదివారం స్పెషల్ సెలబ్రెటీ గెస్ట్.. నా సీనియర్ అంటూ కెమెరా ముందుకు బాలాదిత్యా!
బిగ్ బాస్ లో ఆదివారం రాగానే నాగార్జున ఫన్ డే అంటూ కంటెస్టెంట్స్ అందరినీ కూడా ఎంత ఉల్లాసంగా కనిపించేలా చేస్తారు. అయితే ఈ క్రమంలో ప్రతి ఆదివారం కూడా ఎవరో గెస్ట్ కూడా వస్తున్నారు. ఈసారి అక్కినేని నాగార్జున దేవి శ్రీ ప్రసాద్ ను రంగంలోకి దింపారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ వచ్చి రాగానే నాగార్జునను మన్మధుడు సినిమాలోని అందమైన భామలు సాంగ్ పాడి ఆయనకు ఎంట్రీ ఇప్పించారు. అందుకు సంబంధించిన ప్రోమో కూడా వైరల్ గా మారింది. ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ హైలైట్స్ లోకి వెళితే..

స్పెషల్ గెస్ట్ గా దేవి
ఇక ఆ పాట పాడడంతో రియల్ లైఫ్ లో ఎవరైనా కోసమైనా ఆ పాట పాడావా అని నాగార్జున అడగడంతో అందుకు దేవి తన మనసులోనే పడుకున్నాను అని చెప్పాడు. ఇక నాగార్జున మొదట దేవిశ్రీప్రసాద్ ను చూపించకుండా మిమ్మల్ని ఈరోజు ఆడించేందుకు అలాగే పాటలు పాడించేందుకు ఎంటర్టైన్ చేసేందుకు ఒక గెస్ట్ వచ్చారు అని.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కనిపెట్టాలని అన్నారు.. దీంతో హౌస్ మెంట్స్ అందరూ కూడా దేవిశ్రీప్రసాద్ అని చెప్పేశారు.
దేవిశ్రీప్రసాద్ వాయిస్ ల్ మిమిక్రి
ఇక తర్వాత నాగార్జున బోర్డుపై బొమ్మను గీస్తే అందులోని పాట గురించి చెప్పాలి అని ఒక టాస్క్ ఇచ్చారు. ఇక మొదట ఆర్ జె సూర్య పాటకు అర్థం వచ్చేలా బొమ్మల గీశాడు. కానీ ఆ తర్వాత ఎవరు కూడా దాన్ని సాల్వ్ చేయలేకపోయారు. ఇక దేవిశ్రీప్రసాద్ పాట చేయడం కంటే గీయడం చాలా కష్టమని అన్నాడు. తర్వాత ఆర్ జె సూర్య దేవిశ్రీప్రసాద్ వాయిస్ ను మిమిక్రి చేశాడు. అంతేకాకుండా ఆర్జే సూర్య అల్లు అర్జున్ మాటలతో కూడా దేవిశ్రీప్రసాద్ ను పొగిడారు. అందుకు దేవి కూడా సూపర్ అంటూ పొంగిపోయాడు.

మీ స్కూల్ జూనియర్
ఇక తర్వాత చంటి రంగంలోకి దిగి నే చిక్కు చిక్కు బండినిరో అనే పాటకు అర్థం వచ్చేలా బొమ్మలను గీశాడు. ఆ తర్వాత ఇంట్లోని కంటెస్టెంట్స్ అందరూ కూడా పాటకు డాన్స్ చేశారు. తర్వాత బాలదిత్యా కెమెరా ముందుకు వచ్చి దేవిశ్రీప్రసాద్ కు హాయ్ చెప్పాడు. సార్ నేను మీ స్కూల్లో ఉన్నప్పుడు మీ జూనియర్ అని అన్నాడు. దీంతో నాగార్జున షాక్ అయ్యాడు. ఏంటి అతను నీ జూనియరా అని.. అలాగే ఆ స్కూల్లో ఉన్న కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి అని కూడా నాగార్జున అన్నారు.

నాగార్జున సెటైర్
ఇక ఆ తర్వాత దేవిశ్రీప్రసాద్ మీరు మరొక గేమ్ కొనసాగించండి అంటూ నాకు ఇంట్రెస్ట్ పోయింది అని సరదాగా కామెంట్ చేశాడు. ఇక తర్వాత బాలదిత్యా ఆ టాస్క్ లో సరిగా ఆడలేకపోయాడు. ఆ తర్వాత అతను వివరించిన విధానంతో నాగార్జున సెటైర్ కూడా వేశాడు. మీ స్కూల్ లో అందరూ ఇంతేనా అని అన్నాడు. ఆ తర్వాత గీతూ టైం వచ్చేసరికి చీటీలో ఉన్న పేరును పాటగా చూపించడం కష్టమని.. ఏంది చెప్పేది సామీ.. అంటూ తన భాషతోనే ఆకట్టుకుంది. నాగార్జున దేవిశ్రీప్రసాద్ ఇద్దరినీ కూడా సామి అంటూ తన స్లాంగ్ లో మాట్లాడింది. మరి ఫుల్ ఎపిసోడ్లో వీరి హడావిడి ఇంకా ఏ స్థాయిలో హైలెట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











