Bigg Boss Telugu 6: ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా జబర్దస్త్ పై టార్గెట్.. బిగ్ ప్లాన్?
బిగ్ బాస్ అనగానే అందులో అన్ని రకాలుగా ఎమోషన్స్ తో కూడిన కంటెస్టెంట్స్ ఉండాలని ఆడియెన్స్ కోరుకుంటారు. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ విషయంలో నిర్వాహకులు ఏ మాత్రం రాజీ పడకుండా కమెడియన్స్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు. అయితే ఈసారి బిగ్ బాస్ నాన్ స్టాప్ ఆ విషయంలో సరైన కంటెస్టెంట్ ను హౌస్ లోకి తీసుకు రాలేకపోయింది. కామెడీ యాంగిల్ లో బిగ్ బాస్ ఏ మాత్రం ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. అయితే సీజన్ 6లో అలాంటి పొరపాటు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుపోవాలని నిర్వాహకులు ముందస్తు ప్రణాళికలు మొదలు పెట్టినట్లు సమాచారం. అందుకోసం జబర్దస్త్ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

సంతృప్తి చెందలేదు
బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ లో బాగానే ఆకట్టుకుంది కానీ కంటెస్టెంట్స్ విషయంలో అయితే ప్రేక్షకులు ఈసారి పెద్దగా సంతృప్తి చెందలేదు. కంటెస్టెంట్ గా పాల్గొనేందుకు ఎవరు రావడం లేకనే మళ్ళీ పాతవాళ్లను తెచ్చినట్లు కామెంట్స్ గట్టిగానే వచ్చాయి. ఇక కామెడీ ఈసారి మిస్సయ్యిందని ఆ యాంగిల్ లో ఎవరు ఆకట్టుకోలేదని కామెంట్స్ కూడా గట్టిగానే వచ్చాయి.

వారి రేంజ్ లో ఆకట్టుకోలేదు
యాంకర్ శివ, నటరాజ్ మాస్టర్ మధ్యలో జరిగిన కొన్ని గొడవలు అలాగే బాబా భాస్కర్ చివరలో కాస్త కామెడీ హైలెట్ చేశారు. కానీ ఓ వర్గం ఆడియెన్స్ మాత్రం ఆ కామెడీకి పెద్దగా ఎట్రాక్ట్ ఏమి అవ్వలేదు. బిగ్ బాస్ లో జబర్దస్త్ అవినాష్ గతంలో ఆడియెన్స్ ఎంతగా ఆకట్టుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లోబో కూడా ఉన్నన్ని రోజులు పరవాలేదు అనిపించాడు. ఇక వీరి రేంజ్ లో అయితే ఈసారి ఎవరి క్లిక్ అవ్వలేదు.

జబర్దస్త్ పై ఫోకస్
ఇక తదుపరి ఆరవ సీజన్ విషయంలో నిర్వాహకులు మరిన్ని జాగ్రత్తలు తీసికోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. టెలివిజన్ లో ప్రసారం కాబోయే బిగ్ బాస్ 6వ సీజన్ లో ఈసారి కామెడీ డోస్ ఎక్కువగా ఉండాలని జబర్దస్త్ పై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఆ ప్రపంచంలో నుంచి ఇద్దరిని తదుపరి ఎపిసోడ్ కోసం కంటెస్టెంట్స్ గా సెలెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు7 తెలుస్తోంది.

అదొక పెద్ద టాస్క్
బిగ్ బాస్ లో పాల్గొనాలి అంటే జబర్దస్త్ కమెడియన్స్ కు పెద్ద టాస్క్ అనే చెప్పాలి. జబర్దస్త్ లో ఒకసారి అగ్రిమెంట్ చేసుకుంటే బయటకు రావడానికి చాలా కష్టం ఉంటుంది. అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసే జబర్దస్త్ నిర్వాహకులు మధ్యలో వేరే షోల కోసం వెళ్లిపోవాల్సి వస్తే 10 లక్షల వరకు డబ్బు కడితేనే NOC ఇస్తారట. ఆ విషయంలో గతంలో అవినాష్ చాలా ఇబ్బంది పడ్డాడు.

మాజీ కంటెస్టెంట్స్ కు అవకాశం?
ఇక ఈసారి అగ్రిమెంట్ తో ఉన్నవారు కాకుండా మరికొందరిపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రచ్చ రవిని తీసుకు రావాలని అనుకుంటున్నారట. అలాగే మాజీ జబర్దస్త్ కంటెస్టెంట్స్ లకు కూడా బిగ్ బాస్ లో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. సమ్మర్ అనంతరం జూలై చివరలో బిగ్ బాస్ 6 పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











