Bigg Boss Telugu 6: అర్జున్ కు అన్నం తినిపించిన శ్రీ సత్య.. ఆర్జే సూర్య లేడి గెటప్..

బిగ్ బాస్ తెలుగు 6 రియాలిటీ షోలో కంటెంట్ ఇచ్చేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు ఇంటి సభ్యులు. నాలుగో వారం నామినేషన్లలో భాగంగా మరోసారి అరుపులు వినిపించాయి. అయితే ఈసారి ఎప్పుడులేని కీర్తి భట్ రేవంత్ పై అరిచింది. ఇదే కాకుండా హౌజ్ సభ్యులంతా ఇనయా సుల్తానాను టార్గెట్ చేశారా అన్నట్లుగా సగానికిపైగా మంది నామినేట్ చేశారు. ఈ నామినేషన్లను పక్కన పెడితే తాజాగా హౌజ్ మేట్స్ కు బిగ్ బాస్ ఫన్నీ టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 27 మంగళవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఆ వివరాళ్లోకి వెళితే..

కెప్టెన్సీ కంటెండర్ టాస్క్..

కెప్టెన్సీ కంటెండర్ టాస్క్..

బిగ్ బాస్ తెలుగు 6 సెప్టెంబర్ 27 మంగళవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హోటల్ టాస్క్ లో భాగంగా రెండు గ్రూపులుగా విడిపోయి ఆడాల్సిందిగా ఉంది. అందులో కొంతమంది హోటల్ సిబ్బందిగా వ్యవహరించగా.. మరికొంత మంది గెస్టులుగా కనిపించారు. ఈ టాస్క్ లో బాలాదిత్య, గీతూ రాయల్, మెరీనా అండ్ రేవంత్, సుదీప హోటల్ స్టాఫ్ గా కనిపించారు.

 ఫ్రీగా ఇస్తారా..

ఫ్రీగా ఇస్తారా..

ఇక శ్రీహాన్, ఆది రెడ్డి, అర్జున్ కల్యాణ్ అతిథుల్లాగా ఎంట్రీ ఇచ్చారు. ఆది రెడ్డి రాగానే నీళ్లు తాగుతారా అని గీతూ అడిగింది. దానికి ఫ్రీగా ఇస్తారా అని ఆది రెడ్డి అంటే లేదు సార్.. నీళ్లు కూడా అమ్ముతాం అని చెప్పింది గీతూ రాయల్. శ్రీహాన్ వచ్చేసరికి.. భుజంపై చేయి వేయండి సార్ అంటూ రేవంత్ కాక పట్టే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత సిబ్బంది అంతా శ్రీహాన్ చుట్టు గుమిగూడారు.

రూ. 1000 ఇస్తే ఆమ్లెట్ వేసిస్తా..

రూ. 1000 ఇస్తే ఆమ్లెట్ వేసిస్తా..

అర్జున్ కల్యాణ్ ఆమ్లెట్ కావాలని అడిగితే.. నేను వేసిస్తా. రూ. 1000 ఇస్తే ఆమ్లెట్ వేసిస్తానని శ్రీసత్య చెబుతుంది. ఇది మరి టూ మచ్ అని అంటాడు. ఆ తర్వాత అన్నం కలిపి తినిపించాలని అర్జున్ కల్యాణ్ అడగ్గా.. అందుకు ఒప్పుకుంది శ్రీసత్య. ఒప్పుకున్నట్లుగానే అర్జున్ కు ముద్దలు కలిపి మరి అన్నం తనిపించింది శ్రీసత్య. దీని తర్వాతనే ఇదేం ఘోరం అంటూ శ్రీహాన్ అనడం చూపించారు ప్రోమోలో.

మసాజ్ చేసేవాళ్లు కూడా ఇలా పిలవరు..

మసాజ్ చేసేవాళ్లు కూడా ఇలా పిలవరు..


ఇక సూర్య చిన్న పిల్లాడిలా చేస్తూ మమ్మీ ఎత్తుకో.. నాకు మా మమ్మీ కావాలి అంటూ మారాం చేయడం, ఆ తర్వాత లేడి గెటప్ లో రావడం కామెడీగా ఉంది. నేనే మీ మమ్మీని అని శ్రీసత్య అంటే హోటల్ లో కస్టమర్లను తీసుకువచ్చేందుకని ఎవరికీ పడితే వారికి మమ్మీని అని చెప్పకు అంటూ చలాకి చంటి నవ్వు తెప్పించే ప్రయత్నం చేశాడు. అలాగే థాయ్ మసాజ్ అని వాసంతి అరిస్తే నిజంగా మసాజ్ చేసేవాళ్లు కూడా ఇలా పిలవరు అని జోక్ వేశాడు చంటి.

ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే..


ఇలా ఈ రోజు అంతా ఫన్నీ టాస్క్ జరగనున్నట్లు తెలుస్తోంది. గెస్ట్ లను మెప్పించి హోటల్ సిబ్బంది ఎక్కువగా డబ్బులు సంపాందించాలి. చివరికీ ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే వారి గెలిచినట్లుగా ఉంది ఈ టాస్క్. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6 నాలుగో వారం నామినేషన్లలో మొత్తంగా పది మంది ఉన్నారు. వారిలో నేరుగా నామినేట్ అయిన కీర్తి భట్, అర్జున్ కల్యాణ్ తోపాటు ఆరోహి రావు, రేవంత్, గీతూ రాయల్, సుదీప, శ్రీహాన్, ఇనయా సుల్తానా, రాజశేఖర్, ఆర్జే సూర్య ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X