twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: హారర్ రూమ్ లో శ్రీసత్య గోల గోల.. భయాన్ని చూపించిన దెయ్యం!

    |

    బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న కొద్ది కూడా ఎంతో ఆసక్తికరంగా మారుతుంది. గతంలో కంటే ఈసారి బిగ్ బాస్ హారర్ రూమ్ క్రియేట్ చేసి ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే క్రియేట్ చేస్తున్నాడు. అందరు కూడా ఎంతో ధైర్యంగా వెళుతున్నప్పటికీ కూడా హారర్ రూమ్లో మాత్రం భయంతో వణికిపోతున్నారు. ఊహించని విధంగా బిగ్ బాస్ ఆట పట్టిస్తున్నాడు. ఇక శుక్రవారం బిగ్ బాస్ 96వ రోజు హైలెట్స్ లోకి వెళ్తే..

    ప్రైజ్ మనీకి లింక్ పెట్టేసి

    ప్రైజ్ మనీకి లింక్ పెట్టేసి

    కన్ఫెషన్ రూమ్ ని హారర్ రూమ్ గా మార్చేసిన బిగ్ బాస్ అందులో ఏదో ఒక వస్తువులు పెట్టి దాన్ని వెతికి తీసుకువెళ్లాలి అనే టాస్కులు ఇస్తున్నాడు. ఇక ఆ వస్తువులపై ప్రైజ్ మనీ కూడా ఉండడంతో టోటల్ ప్రైజ్ మనీ సంఖ్య పెరిగే విధంగా ప్లాన్ చేశాడు. దీంతో కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒకటిగా ఆడుతూ ప్రైజ్ మనీని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

    ఈసారి శ్రీసత్య

    ఈసారి శ్రీసత్య

    అయితే ఇదివరకే ఒకసారి శ్రీ సత్యను హారర్ రూమ్ లోకి పంపించారు. కానీ ఆమె డోర్ దగ్గరే భయపడుతూ మళ్లీ వెనక్కి వచ్చేసింది. దీంతో ఆమె కారణంగా బిగ్ బాస్ ప్రైజ్ మనీలో కొంత డబ్బును కూడా తగ్గించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ ఆమెకు అవకాశం ఇచ్చాడు. ఈసారి తప్పనిసరిగా వెళ్లాల్సిందే అని కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆమెను ముందుకు తోసే ప్రయత్నం చేశారు.

    ఆమెకు తోడుగా కీర్తి

    ఆమెకు తోడుగా కీర్తి

    శ్రీ సత్య అలా వెళుతూ ఉండడంతో అందరూ కూడా చాలా నవ్వుతూ కనిపించారు. కానీ శ్రీ సత్య మాత్రం డోర్ దగ్గరే ఉండి నా వల్ల అవ్వదు బిగ్ బాస్ అని చెప్పింది. ఇక కంటెస్టెంట్స్ ముందుకు తోసేయడంతో బిగ్ బాస్ డోర్ కూడా లాక్ చేసేసాడు. అయితే శ్రీ సత్య ఆలస్యం చేస్తూ ఉండడంతో ఆమెకు తోడుగా కీర్తిని రావాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశాలు జారీ చేశారు.

    రేవంత్ ఎంజాయ్

    రేవంత్ ఎంజాయ్

    అయితే మరోవైపు రేవంత్, బిగ్ బాస్ వాళ్ళకు నరకం చూపించాలి అని చెప్పాడు. ముఖ్యంగా వాళ్లు భయపడుతూ ఉంటే రేవంత్ చాలా ఎంజాయ్ చేసినట్లు అనిపించింది. పైకి ఏదో మాట్లాడుతారు కానీ లోపల మొత్తం బెబ్బే అంటూ రేవంత్ కూడా వారిపై సెటైర్ వేశాడు. ఇక నెత్తికి ఏదో తగలడంతో శ్రీ సత్య మాత్రం దారుణంగా భయపడిపోయింది. కీర్తిని పట్టుకుని ఆమె కళ్ళు మూసుకుని ఉండిపోయింది.

    హారర్ రూమ్ కు అందరు రావాలి

    హారర్ రూమ్ కు అందరు రావాలి

    ఇక శ్రీ సత్య ని చూసి కీర్తి కూడా భయపడిపోయింది ముందుకు తన జుట్టును వేసుకోవడంతో నువ్వే దెయ్యంలా కనిపిస్తున్నావు అని చెప్పిందే. లోపల దెయ్యం వచ్చినట్లుగా బిగ్ బాస్ భయపెట్టాడు. ఆ సౌండ్ కు శ్రీ సత్య కీర్తి ఇద్దరు వణికిపోయారు. ఇక బిగ్ బాస్ ఆ తర్వాత అందరినీ హారర్ రూమ్ లోకి రమ్మని చెప్పాడు. ఇక అందరినీ కూడా బిగ్ బాస్ భయపెట్టే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా శ్రీహన్ గట్టిగా అరిచేశాడు. శ్రీ సత్య నన్ను బతికించుకుంటూ మరొక అమ్మాయి అరుపులు వినిపించడంతో ఆమె మరింత భయపడింది. మొత్తానికి హారర్ రూమ్ అయితే హౌస్ మెంట్స్ అందరికీ కూడా భయపెట్టేసింది. మరి పూర్తి ఎపిసోడ్లో ఇంకా ఇలాంటి సన్నివేశాలు చోటుచేసుకున్నాయో చూడాలి.

    English summary
    Bigg boss telugu 6 sri satya horror room scared promo viral day 96,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X