For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: ఫైమాలానే తప్పు చేసిన ఆ ముగ్గురు బ్యూటీలు.. బిగ్ బాస్ షాకింగ్ నిర్ణయం!

  |

  బిగ్ బ్రదర్ అనే పేరుతో అమెరికాలో ప్రారంభమైన రియాలిటీ షో ఎల్లలు దాటి ఇండియాలోకి బిగ్ బాస్ గా వచ్చింది. రావడమే కాకుండా అశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. దీంతో ముందుగా హిందీలో ప్రారంభమైన ఈ రియాలిటీ షోను క్రమేణా మిగతా భాషల్లోకి సైతం తీసుకొచ్చారు. ఇక తెలుగులో 2017లో అనేక అనుమానాల నడుమ ప్రారంభమైన ఈ రియాలిటీ షో వరుస సీజన్లతో దూసుకుపోతూ ప్రస్తుతం ఆరో సీజన్ నడుస్తోంది. ఇప్పటికీ 94 రోజులు 95 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్ లో గత వారం ఎలిమినేట్ అయిన ఫైమా చేసిన తప్పును ప్రస్తుతం హౌజ్ లో ఉన్న ముగ్గురు బ్యూటీలు చేశారు. అదేంటనే విషయంలోకి వెళితే..

  నామినేషన్లలో ఆరుగురు..

  నామినేషన్లలో ఆరుగురు..

  బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో ప్రస్తుతం ఏడుగురు ఇంటి సభ్యులు ఉన్నారు. ఈ 14వ వారం నామినేషన్ల ప్రక్రియ జరగలేదన్న విషయం తెలిసిందే. ఇంటి సభ్యులను నేరుగా బిగ్ బాస్ నామినేట్ చేశాడు. టికెట్ టు ఫినాలే టాస్క్ లో గెలిచి ఫినాలేకు వెళ్లిన మొదటి కంటెస్టెంట్ గా నిలిచిన శ్రీహాన్ ను తప్పా మిగతా ఇంటి సభ్యులందరిని బిగ్ బాస్ నామినేట్ చేశాడు. అంటే ఈ 14వ వారం నామినేషన్లలో రేవంత్, రోహిత్, ఆదిరెడ్డి, ఇనయా సుల్తానా, శ్రీసత్య, కీర్తి భట్ ఆరుగురు ఉన్నారు.

  ఫిజికల్ టాస్కుల్లో గట్టి పోటీ..

  ఫిజికల్ టాస్కుల్లో గట్టి పోటీ..

  ఈ ఆరో సీజన్ లో గత వారం (13వ వారం) జబర్దస్త్ కమెడియన్ ఫైమా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. తనదైన కామెడీ, గేమ్స్ లో పోటీ ఇవ్వడంతో అందరి దృష్టిని ఆకర్షించింది ఫైమా. చూడటానికి సన్నగా ఉన్న ఫిజికల్ టాస్కుల్లో సైతం మిగతా వారికి గట్టి పోటీ ఇచ్చి మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అనిపించుకుంది. ఆమె ఆటతీరును హోస్ట్ నాగార్జున ఎన్నోసార్లు ప్రశంసించారు. అలాగే ఎలిమినేట్ అయిన రోజు కూడా హీరో అడవి శేష్.. ఆమె లైఫ్ స్టోరీ తెలుసని, అది ఆయన్ను ఇన్స్ఫైర్ చేసిందని తెలిపారు.

  ఆ మాటలకు నెగెటివిటీ..

  ఆ మాటలకు నెగెటివిటీ..

  అయితే అందరినీ ఎంటర్టైన్ చేసిన ఫైమాకు కూడా కొన్ని మైనస్ లు ఉన్నాయి. నామినేషన్స్ సమయంలో సుదీప పింకీ, బాలాదిత్య, మెరీనాలతో వెటకారంగా మాట్లడటం ప్రేక్షకులకు నచ్చలేదు. మెరీనాతో పాయింట్స్ గురించి మాట్లాడుతూ ముందు పెట్టుకో, వెనుక పెట్టుకో అని అనడం ఆమెకు విపరీతమైన నెగెటివిటీని తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే ఫైమా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు గార్డెన్ ఏరియాలో ఉన్న మట్టి తిన్న విషయం తెలిసిందే.

  అదనంగా 4 కోడిగుడ్లు..

  అదనంగా 4 కోడిగుడ్లు..

  ఫైమా మట్టి తినడాన్ని చూసిన బిగ్ బాస్ ఆమెను వారించాడు. మట్టి అంతా బాగుందా, మీ రేషన్ మీరు ఎంచుకున్నందుకు ఈ వారం ఆమె రేషన్ కట్ చేస్తున్నట్లు తెలిపాడు బిగ్ బాస్. తర్వాత ఆరోజు జరిగిన విషయాన్ని అర్థం కానీ ఇంగ్లీషు భాషలో రాసింది. దీంతో ఫైమాకు నాలుగు కోడిగుడ్లను అదనంగా పంపించిన బిగ్ బాస్.. ఆయన కామెడీని ఫైమా అర్థం చేసుకోలేకపోయిందని తెలిపారు.

  శ్రీహాన్-కీర్తి మధ్య వాల్ బ్రేకర్ టాస్క్..

  శ్రీహాన్-కీర్తి మధ్య వాల్ బ్రేకర్ టాస్క్..

  తాజాగా జరిగిన బుధవారం నాటి 95వ ఎపిసోడ్ లో పలు ఛాలెంజ్ లు జరిగాయి. బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కోల్పోయిన డబ్బును తిరిగి పొందేందుకు ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఛాలేంజ్ లు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీహాన్, కీర్తి భట్ మధ్య ఆరో ఛాలేంజ్ గా వాల్ బ్రేకర్ టాస్క్ జరిగింది. ఇందులో గోడలు బ్రేక్ చేసి వాటి ముందు ఉన్న కుండను పగులగొట్టాలి.

  ముగ్గురు బ్యూటీలను పిలిచి..

  ముగ్గురు బ్యూటీలను పిలిచి..

  శ్రీహాన్ ముందుగా కుండను బ్రేక్ చేసి విన్నర్ అయ్యాడు. అలాగే అతనే గెలుస్తాడని హౌజ్ మేట్స్ ఓట్ వేయడంతో రూ. 2 లక్షలు తిరిగి పొందారు ఇంటి సభ్యులు. ఈ ఛాలేంజ్ తర్వాత ఆ మట్టి కుండల చిన్న చిన్న ముక్కలను శ్రీసత్య, కీర్తి, ఇనయా ముగ్గురు తిన్నారు. టేస్ట్ బాగుంది అంటూ కూర్చుని టేస్ట్ చూశారు. దీంతో బిగ్ బాస్ వారిని వారించాడు. ఈ ముగ్గురు బ్యూటీలను పిలిచి కుండల టేస్ట్ అంతా బాగుందా అని అడిగారు.

  ఫైమాలాగా అలా చేయకుండా..

  ఫైమాలాగా అలా చేయకుండా..

  తర్వాత ఈవారం రేషన్ మీరు సంపాందించుకున్నందున ఈ వారం మీకు రేషన్ కట్ చేస్తున్నట్లు బిగ్ బాస్ షాకింగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. దీంతో వాళ్లు ముగ్గురు బిగ్ బాస్ కు సారీ చెప్పారు. తిన్లేదని, ఏదో అలా టేస్ట్ చేశానని ఇనయా అంది. తర్వాత వాళ్లు కోడిగుడ్లు పంపిస్తారని అలా చేశారు బిగ్ బాస్ అని ఆదిరెడ్డి అన్నాడు. అయితే ఫైమాలాగా ఈ ముగ్గురికి అలా కోడిగుడ్లు ఏం పంపించకుండా కుండ ముక్కలు తినడంపై కామెడీ చేసినట్లు తెలుస్తోంది.

  English summary
  Bigg Boss Telugu 6: Sri Satya Keerthi Inaya Doing Like Eliminated Contestant Faima And Bigg Boss Cut Their Ration. December 7 Day 94 Episode 95 Highlights
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X