Bigg Boss Telugu 6: హౌజ్ లో తన ఎంగేజ్ మెంట్, బ్రేకప్ పై శ్రీసత్య.. స్టేజిపైనే అలా చేశాడని షాకింగ్ గా

తెలుగు రియాలిటీ షోలలో ఎక్కువగా పాపులర్ అయినదాంట్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది బిగ్ బాస్. ఎప్పటికప్పుడు కొత్త సీజన్ లు తీసుకొస్తూ ఆద్యంతం బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది ఈ బిగ్ బాస్ రియాలిటీ షో. ఫుడ్ టాస్క్, ఎలిజిబిలటీ టాస్క్, డిజాస్టర్ టాస్క్ లతో ఇంటి సభ్యులను హోరెత్తిచ్చిన బిగ్ బాస్ తాజాగా నామినేషన్ల ద్వారా మంట పెట్టాడు. ఫన్ డే గా శని, ఆదివారాల తర్వాత సోమవారం నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతుందన్న విషయం తెలిసిందే. అలాగే బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ఎనిమిదో వారం నామినేషన్ల ప్రక్రియ రంజుగా సాగింది. అయితే నామినేషన్ల కన్నా ముందు తన బ్రేకప్ గురించి ఓపెన్ గా చెప్పింది శ్రీ సత్య.

తెలుగులో ఆరో సీజన్..

తెలుగులో ఆరో సీజన్..

బిగ్ బ్రదర్ పేరుతో అమెరికాలో ప్రారంభమైన ఈ షోను బిగ్ బాస్ గా ముందుగా హిందీలో ప్రారంభించారు. ఆ తర్వాత వివిధ ప్రాంతీయ భాషల్లోకి తీసుకొచ్చి మోస్ట్ పాపులర్ రియాలిటీ షోగా గుర్తింపు పొందింది. హిందీలో ప్రస్తుతం 16వ సీజన్ కంటిన్యూ కాగా తెలుగులో ఆరో సీజన్ కొనసాగుతోంది. ఈ బిగ్ బాస్ తెలుగు షోకి మూడో సీజన్ నుంచి ఇప్పటివరకు నాగార్జున హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే.

రొమాన్సులు, లవ్ ట్రాక్ లు కామన్..

రొమాన్సులు, లవ్ ట్రాక్ లు కామన్..

ఇక ఈ బిగ్ బాస్ షోలో హగ్గులు, ముద్దులు, రొమాన్సులు, లవ్ ట్రాక్ లు, శత్రుత్వాలు చాలా కామన్. అలాగే మొన్నటివరకు కంటెస్టెంట్ల మధ్య జరిగే లవ్ ట్రాక్ లు ఆడియెన్స్ ను ఎక్కుగా అట్రాక్ట్ చేసేవి. కానీ ఐదో సీజన్ లో షణ్ముఖ్ జశ్వంత్, సిరిలు ఫ్రెండ్ షిప్ పేరుతో చేసిన పనులు ప్రేక్షకులకు రోత పుట్టించాయి. ఆ తర్వాత వచ్చిన ఓటీటీ సీజన్ లో ఈ లవ్ ట్రాక్ ను ఎక్కువగా ఉపయోగించలేదు.

అబాసుపాలైన అర్జున్ కల్యాణ్..

అబాసుపాలైన అర్జున్ కల్యాణ్..

కానీ ప్రస్తుతం ప్రసారమవుతున్న ఆరో సీజన్ లో మరోసారి లవ్ ట్రాక్ వచ్చింది. బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ఏడో వారం ఎలిమినేట్ అయిన అర్జున్ కల్యాణ్ తన కాన్సంట్రేషన్ ను గేమ్ పై కన్నా ఎక్కువగా శ్రీ సత్యపై పెట్టి అబాసుపాలయ్యాడు. ఎలాగోలా ఆరు వారాలు నెట్టుకొచ్చిన అర్జున్ కల్యాణ్ ఏడో వారం అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు.

టైటిల్ గెలిచినప్పుడు చెబుదామని..

టైటిల్ గెలిచినప్పుడు చెబుదామని..

అర్జున్ కల్యాణ్ బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో కాలు మోపినప్పటి నుంచి గేమ్ ఆడటం కన్నా ఎక్కువగా శ్రీ సత్యపైనే ఫోకస్ చేశాడు. ఎలిమినేట్ అయి స్టేజిపై ఉన్నప్పుడు తను బిగ్ బాస్ కు రావడం ప్రధాన కారణం శ్రీ సత్యే అని చెప్పాడు. అయితే గేమ్ విన్ అయినప్పుడో, ఫైనల్స్ అప్పుడే ఆ విషయం చెబుదామని, అలా జరగకపోయేసరికి ఇప్పుడు చెబుతున్నట్లు తెలిపాడు.

అంతకుముందే ఒక రిలేషన్ షిప్ లో..

అంతకుముందే ఒక రిలేషన్ షిప్ లో..

అయితే శ్రీసత్యకు అంతకుముందే ఒక రిలేషన్ షిప్ లో ఉందన్న విషయం తెలిసిందే. ఆ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రీసత్య ఎంగేజ్ మెంట్ వరకు కూడా వెళ్లింది. అయితే అది మధ్యలోనే ఆగిపోయింది. అందుకు కారణాలను తాజాగా బిగ్ బాస్ తెలుగు 6 తాజాగా అక్టోబర్ 24 తేదినాటి 51వ ఎపిసోడ్ లో శ్రీహాన్ తో పంచుకుంది శ్రీసత్య.

ఎలాగు నిన్నేగా పెళ్లి చేసుకునేది..

ఎలాగు నిన్నేగా పెళ్లి చేసుకునేది..

''నా రిలేషన్ షిప్ గురించే మూడో రోజే మా ఇంట్లో వాళ్లకు చెప్పేసా. అసలు అతని గురించి నాకు పూర్తిగా తెలియకుండానే అమ్మా వాళ్లకు చెప్పా. కొందరు ఉంటారుగా, ఎలాగు నిన్నేగా పెళ్లి చేసుకునేది. అదంతా టైమ్ పాస్ అని. ప్రతి ఒక్కరూ వచ్చి నాకు అమ్మాయిల స్క్రీన్ షాట్స్ చూపించేవారు. అలా చూపిస్తే వద్దనే దాన్ని. ఎందుకంటే వాళ్లు అలా చెబుతుంటే నాకు వాళ్లు శత్రువులుగా కనిపిస్తున్నారు.

పూర్తిగా అమ్మాయిలా మారిపోయాను..

పూర్తిగా అమ్మాయిలా మారిపోయాను..

నా లైఫ్ లో అది నా ఫస్ట్ ఫంక్షన్. ఎంతో ఇష్టంతో చేసుకున్నానో. రిలేషన్ షిప్ లోకి వెళ్లాకా పూర్తిగా అమ్మాయిలా మారిపోయాను. పక్కవాళ్ల ఇష్టమే నా ఇష్టంగా మారిపోయింది. కానీ ఎంగేజ్ మెంట్ రోజు స్టేజీ మీదే తిట్టాడు. తర్వాత చాలా జరిగాయి. మా అమ్మ ఆస్పత్రిపాలవడంతో మళ్లీ పాత సత్య తిరిగి వచ్చింది'' అని శ్రీహాన్ తో చెప్పుకొచ్చింది శ్రీసత్య.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X