Bigg Boss Telugu 6: డేంజర్ జోన్ లో ఆ నలుగురు.. ఎలిమినేట్ అయిన చైల్డ్ ఆర్టిస్ట్?

తెలుగులో వచ్చిన రియాలిటీ షోలలో అధికంగా పాపులర్ అయింది బిగ్ బాస్. ఎప్పటికప్పుడు కొత్త సీజన్ లు తీసుకొస్తూ ఆద్యంతం బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. రేటింగ్ అంతగా రాకున్న ఎమోషనల్ టాస్క్ లు ఇచ్చి కంటెస్టెంట్లను ఏడిపిస్తున్నాడు బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ఆరో వారం ఇంటి కెప్టెన్ గా ఆర్జే సూర్య ఎంపిక అయ్యాడు. ఇప్పటికి ఐదు ఎలిమినేషన్లు జరిగాయి. ఇప్పుడు ఆరో ఎలిమినేషన్ రాబోతుంది. ఈ ఆరో వారం నామినేషన్లలో 9 మంది ఇంటి సభ్యులు ఉన్నారు. వారిలో నలుగురు డేంజర్ జోన్ లో పడగా సినిమాల్లో చైల్ట్ ఆర్టిస్ట్ గా అలరించిన మరో కంటెస్టెంట్ ఈ వారం ఎలిమినేట్ అవనున్నట్లు తెలుస్తోంది.

కొంతమేర ఆందోళన..

కొంతమేర ఆందోళన..

శని ఆది వారాలు వచ్చిందంటే బిగ్ బాస్ హౌజ్ లో సందడితోపాటు కొంతమేర ఆందోళన కూడా ఉంటుంది. వారంలో కంటెస్టెంట్లందరూ చేసిన చేష్టాలు, పనులపై హోస్ట్ నాగార్జున వచ్చిన రివ్యూ చేస్తాడు. బాగా పర్ఫామ్ చేసినవాళ్లను మెచ్చుకుంటే బాగా ఆడని సభ్యులకు మొట్టికాయలు వేస్తాడు.

మరోవైపు వార్నింగ్ లు..

మరోవైపు వార్నింగ్ లు..

అలాగే ఫన్ టాస్క్ లు ఇచ్చి ఎంటర్టైన్ చేస్తూ మరోవైపు వార్నింగ్ లు ఇస్తాడు. ఇక ఇదే కాకుండా ఇంటి సభ్యులకు ఎవరు వెళతారా అనే టెన్షన్ కూడా పెడతారు. ఎప్పటిలానే ఈ వారం కూడా హౌజ్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు ఎవరు వెళ్తారనే టెన్షన్ అందరిలోనూ ఉంది.

శ్రీహాన్‌కు ఎక్కువ ఓట్లతో..

శ్రీహాన్‌కు ఎక్కువ ఓట్లతో..

ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఆరో సీజన్ ఆరో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రారంభం నుంచే ఎన్నో మలుపులతో సాగిందని టాక్. కానీ, మొదటి రెండు స్థానాల్లో మాత్రం ఇద్దరు కంటెస్టెంట్లు సెటిలైపోయారని సమాచారం. ఇక, ఓటింగ్ ముగిసే సమయానికి శ్రీహాన్‌కు ఎక్కువ ఓట్లతో టాప్‌లో ఉన్నాడని తెలుస్తోంది. రెండో స్థానంలో మాత్రం యూట్యూబర్ ఆది రెడ్డి నిలిచినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

అనూహ్యంగా రాజశేఖర్..

అనూహ్యంగా రాజశేఖర్..

అయితే ఓటింగ్ ముగిసే సమయానికి మాత్రం చాలా మంది స్థానాల్లో మార్పులు కనిపించాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. పోలింగ్ పూర్తయ్యే సమయానికి కీర్తి భట్ మూడో స్థానంలో, చిత్తూరు చిరుత గీతూ రాయల్ నాలుగో స్థానంలో, ఐదో స్థానంలో శ్రీసత్య, అప్పటివకు ఆరో స్థానంలో బాలాదిత్య ఉండగా అనూహ్యంగా రాజశేఖర్ చేరుకున్నాడని బిగ్ బాస్ వర్గాల సమాచారం.

 తొమ్మిదో స్థానంలో సుదీప..

తొమ్మిదో స్థానంలో సుదీప..

ఇక ఏడో స్థానంలో మెరీనా, 8వ స్థానంలో బాలాదిత్య, తొమ్మిదో స్థానంలో సుదీప ఉన్నారని తెలిసింది. అయితే రాజ్, మెరీనా, ఆదిత్య, సుదీప వీళ్లంతా డేంజర్ జోన్ లో ఉన్నారు. వీళ్లందరిలో చివరిలో ఉన్న సుదీప పింకీకి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్లుగా తెలుస్తోంది.

 ఐదుగురు ఎలిమినేట్..

ఐదుగురు ఎలిమినేట్..

ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో ఐదు వారాలకు గాను ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు. వారిలో చలాకీ చంటి, ఆరోహి రావు, నేహా శర్మ, అభినయశ్రీ, షానీ సాల్మన్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇనాయా సుల్తానా, మెరీనా, బాలాదిత్య, శ్రీహాన్, రాజశేఖర్, శ్రీ సత్య, ఆది రెడ్డి, సుదీప పింకీ, గీతూ రాయల్‌ తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. వీరిలో చైల్డ్ ఆర్టిస్ట్ సుదీపనే బయటకు వెళ్లే ఛాన్స్ అధికంగా ఉందని బిగ్ బాస్ వర్గాల సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X