Bigg Boss Telugu 6: సుదీప ఎలిమినేషన్ కు కారణాలు.. మొత్తం రెమ్యునరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ మొదట కాస్త నీరసంగా కొనసాగినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారిగా ట్రాక్ లోకి వచ్చేసింది. గతంలో ఎప్పుడు లేనివిధంగా సరికొత్త టాస్క్ లను కూడా ఇటీవల స్టార్ట్ చేశారు. దీంతో కంటెస్టెంట్స్ అందరూ కూడా వారి శక్తికి మించి పోరాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మొత్తానికి 6వ వారం అయితే ఎవరు వెళ్ళిపోతున్నారు అనే విషయంలో ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఆమె వెళ్లి పోవడానికి ప్రధాన కారణం ఏమిటి అలాగే ఆమె ఈ ఆరువారాలకు ఏ స్థాయిలో పారితోషికం అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..

ముందుగానే..

ముందుగానే..


బిగ్ బాస్ లో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. నాగార్జున కూడా కంటెస్టెంట్స్ అందరినీ కూడా సీరియస్ గా గేమ్ ఆడాలి అని ఇదివరకే హెచ్చరిక కూడా చేశాడు. అప్పటినుంచి అందరూ కూడా ప్రతి టాస్క్ లో వారి ఆ బలాన్ని చూపిస్తున్నారు. అయితే ఈ క్రమంలో కొందరు తొందరపడి తప్పులు కూడా చేస్తున్నారు. కొన్ని వారాలపాటు ఉంటారని అనుకున్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ముందుగానే వెళ్ళిపోతూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

చివరి వరకు

చివరి వరకు

బిగ్ బాస్ లో గతవారం జబర్దస్త్ చలాకి చంటి వెళ్ళిపోవడం షాక్ అనే చెప్పాలి. ఇక ఇప్పుడు సుదీప ఎలిమినేట్ అవుతూ ఉన్నట్లు తెలుస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒకప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును అందుకున్న సుదీప బిగ్ బాస్ లో తప్పకుండా చివరి వరకు నిలుస్తుంది అని కూడా అనుకున్నారు. కానీ ఆమె చేసిన కొన్ని మిస్టేక్స్ కారణంగా ఓట్లు కూడా సరిగ్గా పడలేదు. దీంతో ఇప్పుడు ఆరో వారంలోనే ఎలిమినేట్ అయ్యింది.

అనవసరమైన వివాదాలు

అనవసరమైన వివాదాలు

నిజానికి సుదీప మొదటివారం నుంచి కూడా ఆటలో సీరియస్ గా కొనసాగలేదు అనే కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి. అనవసరంగానే సింగర్ రేవంత్ తో పాటు గీతూతో కొన్ని వివాదాలకు వెళ్లడం మరో అతిపెద్ద మైనస్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా దొంగా పోలీస్ ఆటలో ఏమాత్రం పెద్దగా తన టాలెంట్ ను ఉపయోగించలేదు. తర్వాత చిన్న చిన్న చాలెంజెస్ లో కూడా తన మాటలతోనే ఆకట్టుకోవాలని అనుకుంది కానీ మైండ్ గేమ్ ఆడలేక పోయింది.

 గతవరమే ఎలిమినేట్?

గతవరమే ఎలిమినేట్?


ముఖ్యంగా ఎలిమినేషన్స్ లో అయితే సుదీప చెప్పిన పాయింట్స్ అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు అనే విధంగా కూడా కామెంట్స్ వినిపించాయి. ఇక ఆమెకు ఓట్లు కూడా చాలా వరకు తగ్గుతూ వచ్చాయి. ఆమె ఎలిమినేషన్ లో ఉన్న ప్రతిసారి కూడా అందరికంటే తక్కువ ఓట్లు అందుకుంటూ వచ్చింది. అసలైతే గత వారంలోనే ఎలిమినేట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అదృష్టవశాత్తు సేఫ్ అయింది.

 రెమ్యునరేషన్ ఎంతంటే?

రెమ్యునరేషన్ ఎంతంటే?

ఇక ఈ వరం కూడా ఆమెకు లక్ కలిసి వస్తుందేమో అని అందరు అనుకున్నారు. కానీ బిగ్ బాస్ ఈసారి ఆమెను కనికరించలేదు. ఇక మొత్తానికి బయటకు వస్తున్న సుదీప రెమ్యునరేషన్ పరంగా అయితే బాగానే లాభ పడినట్లు తెలుస్తోంది. ఒక వారానికి ఆమె 25 వేల రూపాయలు తీసుకుంటున్నట్లు టాక్. ఇక మొత్తం ఆరువారాలకు 1 లక్ష 50 వేలు అందుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X