For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6 ఫైమా ఫ్రీ ఎవిక్షన్ పాస్ తో నాగార్జున సస్పెన్స్.. ఎవరికి వాడనుంది?

  |

  తెలుగులో అతి పెద్ద రియాలిటీ షోగా దూసుకుపోతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 చివరి అంకానికి చేరుకుంది. 21 మంది కంటెస్టెంట్లు హౌజ్ లోకి అడుగుపెట్టగా.. 11 వారాల్లో 12 మంది ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ మిగిలారు. అయితే ఈ వారం నామినేషన్లలో ఏడుగురు ఉండగా.. శనివారం ఎపిసోడ్ లో ముగ్గురు సేవ్ అయ్యారు. ఇంకా నామినేషన్లో నలుగురు ఉన్నారు. ఇప్పుడు వీరిలో ఈ 12వ వారానికి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఆ వివరాళ్లోకి వెళితే..

  ఆ నలుగురు నామినేషన్లలో..

  ఆ నలుగురు నామినేషన్లలో..

  బిగ్ బాస్ రియాలిటీ షోలో ప్రతి శని, ఆదివారాల్లో హోస్ట్ వచ్చి ఎంటర్టైన్, రివ్యూస్, సలహాలు, వార్నింగ్స్ ఇస్తారన్న విషయం తెలిసిందే. ఈ శనివారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ తోపాటు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు, విన్నర్స్, సినీ సెలబ్రిటీలను తీసుకొచ్చి సందడి చేయించారు. అలాగే వారితో కంటెస్టెంట్లు సేఫ్ లేదా అన్ సేఫ్ అని చూపించారు. ఈ క్రమంలో శ్రీహాన్, ఇనయా సుల్తానా, శ్రీసత్యసేవ్ అయ్యారు. ఇంకా నామినేషన్లలో ఆదిరెడ్డి, ఫైమా, రోహిత్, రాజ్ ఉన్నారు.

   పాట గెస్ చేయాలి..

  పాట గెస్ చేయాలి..

  ఆదివారానికి సంబంధించిన ఎపిసోడ్ రెండో ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఎలిమినేషన్, ఫైమా ఫ్రీ ఎవిక్షన్ పాస్ వాడుకోవడం గురించి చూపించారు. ప్రోమో మొదట్లో ఇంటి సభ్యుల మధ్య ఫన్నీ గేమ్స్ ఆడించారు హోస్ట్ నాగార్జున. ఇందులో భాగంగానే గమ్ వంటి చాక్లెట్స్ ఏవో కంటెస్టెంట్లకు ఇచ్చి నోట్లో పెట్టుకోమన్నారు. తర్వాత వాళ్లకు వచ్చిన పాటను పాడి చూపిస్తే వాళ్ల టీమ్ సభ్యులు ఆ సాంగ్ ఏదో చెప్పాలి.

  అందుకు ఇంకో రౌండ్ ఉంది..

  అందుకు ఇంకో రౌండ్ ఉంది..


  ముందుగా రాజ శేఖర్ వచ్చి పాట పాడే ప్రయత్నం చేశాడు. కానీ అది ఎవరికీ అర్థం కాలేదు. అయితే ఈ క్రమంలో రాజ్ ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ నవ్వు తెప్పించాయి. తర్వాత వచ్చిన ఆదిరెడ్డి ఒక ఫన్నీ రియాక్షన్ ఇచ్చాడు. అనంతరం వచ్చిన కీర్తి భట్ పాడేందుకు ట్రై చేసింది. ఆమె ఇంటి సభ్యులు ఆ పాటను కరెక్ట్ గా గెస్ చేశారు. దీంతో ఆదిరెడ్డి టీమ్ గెలిచిందని నాగార్జున తెలిపారు. అందుకు హమ్మయ్యా స్వీట్స్ వస్తాయిని ఆదిరెడ్డి అంటే.. స్వీట్స్ రావాలంటే ఇంకో రౌండ్ ఉందని షాక్ ఇచ్చాడు. దీంతో ఆదిరెడ్డి, శ్రీహాన్ నిరాశపడ్డారు.

  బాల్స్ తో ఫన్నీ గేమ్..

  బాల్స్ తో ఫన్నీ గేమ్..


  నిరాశ చెందిన శ్రీహాన్ ని రేవంత్ ఎగతాళి చేశాడు. ఆ తర్వాత మరో గేమ్ ఇచ్చారు. చుట్టూ సర్కిల్ వేసి అందులో చిన్న చిన్న బాల్స్ వేశారు. వాటిని ఒక టీమ్ సభ్యుడు బుట్టలో వేసుకోవాలి. అదే సమయంలో ఆ సర్కిల్ సెంటర్ లో ఒక కంటెస్టెంట్ కళ్లకు గంతలు కట్టి ఉండగా బాల్స్ తీసుకుంటున్న వాళ్లను పెద్ద బాల్ తో కొట్టాలి. ఇది గేమ్ కొంచెం ఫన్నీగా అనిపించేలా ఉంది. ఆదిరెడ్డి కొడుతుంటే ఫైమా బాల్స్ తీసుకునేందుకు ట్రై చేసింది.

  ఫ్రీ ఎవిక్షన్ పాస్ తో సస్పెన్స్..

  ఈ గేమ్స్ తర్వాత నామినేషన్లలో చివరిగా మిగిలిన ఫైమా అండ్ రాజశేఖర్ ని నిల్చోమ్మని హోస్ట్ నాగార్జున చెప్పాడు. ఫైమా దగ్గర ఉన్న ఫ్రీ ఎవిక్షన్ పాస్ ను నీకోసం వాడుకోవచ్చు.. లేదా రాజ్ కోసం వాడుకోవచ్చు.. ఏ నిర్ణయం తీసుకుంటావో అని నాగార్జున అడిగారు. దీంతో ఆలోచనలో పడిపోయింది ఫైమా. దీంతో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య బిగ్ బాస్ ఫిట్టింగ్ పెట్టినట్లయింది. ఇదిలా ఉంటే ఈ 12వ వారం రాజ్ ఎలిమినేట్ అయినట్లు ఇదివరకే బీబీ వర్గాల నుంచి సమాచారం వచ్చినట్లు తెలిసిందే.

  English summary
  Bigg Boss Telugu 6: Free Eviction Pass Suspense Between Faima And Model Rajashekar In November 27 Episode Promo.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X