For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: గీతూపై బిగ్ బాస్ ప్రేమ? ఆమెతోనే ఆడుకోండి, చప్పట్లు కొడుతూ నాగార్జునకు శ్రీ సత్య చురకలు!

  |

  ఇది బిగ్ బాస్.. ఇక్కడ ఏమైనా జరగొచ్చు.. అన్నట్లుగానే ఉంది బిగ్ బాస్ తెలుగు 6 మూడో వారం కెప్టెన్సీ టాస్క్. బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ 16వ రోజు ఎపిసోడ్ (సెప్టెంబర్ 20) కూడా అంతకుముందు రోజు జరిగిన నామినేషన్స్ లానే రచ్చ రచ్చగా జరిగింది. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఆడించిన అడవిలో ఆట గేమ్ ను హౌజ్ మేట్స్ ఎవరికీ తోచిన విధంగా వారు ఆడారు. అందులో ముఖ్యంగా చిత్తూరు చిరుత గీతూ రాయల్ తన రూల్స్ పెట్టుకోని ఆడటంతో హౌజ్ మేట్స్ చిరాకు పడ్డారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కు, నాగార్జునకు శ్రీ సత్య చురకలు అంటించినట్లుగా తెలుస్తోంది.

  కెప్టెన్సీ టాస్క్ లోనూ రచ్చ..

  కెప్టెన్సీ టాస్క్ లోనూ రచ్చ..

  బిగ్ బాస్ తెలుగు 6 మూడో వారం నామినేషన్స్ రచ్చ కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఆడిన ఆటలో కూడా కనపడింది. నామినేషన్స్ తర్వాత రేవంత్ కామెంట్స్ కు బాగా హర్ట్ అయింది. ఫెమినిస్ట్ అంటూనే ఆడాళ్లకు పునుగులు, న్యూడిల్స్ అని పేర్లు పెట్టడం ఏంటని ఏడ్చేసింది. తర్వాత ఇనయ సుల్తానా వేస్ట్ అంటూ ఆది రెడ్డి, గీతూ రాయల్ మాటలు, మనీ కోసం, ఫేమ్ కోసం అంటూ శ్రీ సత్య చెప్పడంతోపాటు తనను నామినేట్ చేసిన ఆర్జే సూర్య వద్ద రేవంత్ కన్నీళ్లు పెట్టుకోవడంతో ముగిసింది.

  రెండు బృందాలు..

  రెండు బృందాలు..

  ఆ తర్వాత బిగ్ బాస్ హౌజ్ మేట్స్ కు మూడో వారం కెప్టెన్సీ టాస్క్ ప్రారంభమైంది. అడవిలో ఆట అనే టాస్క్ లో భాగంగా దొంగలు, పోలీసులు అని రెండు టీమ్ లుగా విడిపోవాలి. శ్రీహాన్, రేవంత్, నేహా చౌదరి, ఆరోహి, ఆర్జే సూర్య, సుదీప, వాసంతి, అర్జున్ కల్యాణ్ దొంగలుగా.. బాలాదిత్య, ఫైమా, ఇనయ సుల్తానా, ఆది రెడ్డి, రోహిత్ అండ్ మెరీనా, రాజ్, శ్రీ సత్య, చంటి పోలీసులుగా వ్యవహరించారు.

  ఆట స్టార్ట్ కాకముందే..

  ఆట స్టార్ట్ కాకముందే..

  పోలీసుల హెడ్ గా ఆది రెడ్డి కాగా, దొంగల నాయకుడిగా ఆర్జే సూర్యను సెలెక్ట్ చేశాడు బిగ్ బాస్. ఇక అత్యాశ పడే వ్యాపారస్తురాలుగా గీతూ రాయల్ ను ఎంపిక చేశాడు బిగ్ బాస్. ఇక ఆట మొదలు కాకముందునుంచే గీతూ రాయల్ తన గేమ్ స్ట్రాటజీని ప్లాన్ చేసింది. దొంగ నేనే, పోలీసు నేనే, వ్యాపారస్తురాలిని నేనే.. బొమ్మలు కొనకుండానే.. కొనుక్కున్నా అని చెప్తా.. నువ్ ఏం వీడియో చూపించవ్ కదా.. నా వైపు ఏం తిప్పావ్ గేమ్ బిగ్ బాస్ అంటూ మాట్లాడింది గీతూ రాయల్. అయితే వ్యాపారస్తురాలైన గీతూకు వీఐపీ పాస్ ద్వారా ఎక్కడికైనా వెళ్లే వెసులు బాటు కల్పించాడు బిగ్ బాస్.

   తనవైపు గేమ్ తిప్పాడంటూ..

  తనవైపు గేమ్ తిప్పాడంటూ..

  ఇక వ్యాపారస్తురాలిగా గీతూ.. దొంగలు అమ్మిన వస్తువులను కొనాలి. టాస్క్ అయిపోయే సమయానికి వ్యాపారస్తురాలైన గీతా వద్ద రూ. 15 వేల నగదు, 25 వరకు బొమ్మలు ఉండాలి. దీంతో గేమ్ ప్రారంభం కాకముందే ప్రణాళికలు రచించింది ఈ చిత్తూరు చిరుత. బిగ్ బాస్ తనవైపు గేమ్ తిప్పాడంటూ అనుకుంటూ గేమ్ స్టార్ట్ చేసి.. తను కొన్ని బొమ్మలను దొంగతనం చేసింది. వాటిని పోలీసులు అయిన శ్రీ సత్య, ఆది రెడ్డి తదితరులు చూస్తారు.

  శ్రీ సత్య అసహనం..

  శ్రీ సత్య అసహనం..

  అయితే మార్కెట్ బెల్ మోగినప్పుడే గీతూకు దొంగలు వస్తువులు అమ్మాలి. కానీ ఆ బెల్ మోగకముందే గీతూ రాయల్ వద్ద వస్తువులు కనపడటంతో ఆమెను నిలదీస్తారు. నువ్ బొమ్మలు కొనుక్కోవాలి, దొంగలించకూడదు.. ఇలా అయితే నిన్ను కూడా జైళ్లో పెట్టాల్సివస్తుంది అని వారిస్తారు. కానీ, గీతూ రాయల్ అదేమీ పట్టించుకోకుండా రూల్స్ గురించి మాట్లాడుతుంది. దీంతో అసహనంతో శ్రీ సత్య ఆమె ఇష్టమొచ్చినట్లు చేస్తున్న గీతూను ఏం అనట్లేదేంటీ? ఆమెతోనే గేమ్ ఆడుకోండి బిగ్ బాస్ అని అంటుంది.

  నాగార్జునకు చురకలు?

  నాగార్జునకు చురకలు?

  ఆ తర్వాత తన వద్ద ఉన్న వస్తువులను దొంగ అయిన శ్రీహాన్ దగ్గర కొన్నట్లు చెబుతుంది. దీంతో పోలీసులు, దొంగలుగా ఉన్న సభ్యులతోపాటు శ్రీహాన్ కూడా షాక్ అవుతారు. ఇదంతా చూసి.. అది తన గేమ్ స్ట్రాటజీ.. అలా ఆడితేనే కదా చప్పట్లు కొడతారు.. అంటూ ఇన్ డైరెక్ట్ గా హోస్ట్ నాగార్జునకు చురకలు అంటించినట్లుగా తెలుస్తోంది. చివరికీ ఆది రెడ్డి కూడా ఈ విషయంపై గీతూతో కొద్దిగా వాగ్వాదానికి దిగుతాడు.

  అతి చేయొద్దు గీతూ అక్క..

  అతి చేయొద్దు గీతూ అక్క..

  అలా చేయకూడదు అని ఆది రెడ్డి చెప్పిన గీతూ రాయల్ వినదు. అతి చేయొద్దు గీతూ అక్క అంటూ ఆమెకు చెప్పే ప్రయత్నం చేస్తాడు ఆది రెడ్డి. ఇదిలా ఉంటే హౌజ్ లో ఇంతమంది ఉండగా.. గీతూ రాయల్ నే అత్యాశ గల వ్యాపారస్తురాలిగా సెలెక్ట్ చేయడం, తను ఏం చేసిన వారించకపోవడంతో గీతూపై బిగ్ బాస్ ప్రేమ చూపిస్తున్నాడా? అన్నట్లుగా తోస్తుంది.

  గీతూను వారిస్తాడా?

  గీతూను వారిస్తాడా?

  ఆట ముగిసే సరికి గీతూ రాయల్ వద్ద 13 బొమ్మలు ఉన్నాయి. దీంతో 16వ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. అయితే మరి నేటి ఎపిసోడ్ అంటే 17వ రోజు జరిగే ఎపిసోడ్ లో గీతూ రాయల్ ను బిగ్ బాస్ ఏమైనా వారిస్తాడా? తన స్ట్రాటజీలపై ఏమైనా మాట్లాడాతాడా? అనేది చూడాలి. ఇదిలా ఉంటే మూడో వారం నామినేషన్స్ లో మొత్తంగా తొమ్మిద మంది ఉన్న విషయం తెలిసిందే.

  English summary
  Bigg Boss Contestant Sri Satya Slams Host Nagarjuna And Bigg Boss Indirectly In Bigg Boss Telugu 6 Third Week Captaincy Task.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X