For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: నామినేషన్ లో గీతూ వెటకారం బూతులు.. ఆమెపై ఆదిరెడ్డి ఉగ్రరూపం!

  |

  బిగ్ బాస్ 2 వారాలు పూర్తయ్యేసరికి సరికొత్త ట్రాక్లోకి ఎక్కినట్లు అనిపిస్తోంది. ఈసారి ఎలాంటి స్నేహాలకు తావివ్వకుండా కంటెస్టెంట్స్ అందరూ కూడా శత్రువులుగా మారే నామినేషన్స్ ప్రక్రియ కూడా మొదలైపోయింది. బిగ్ బాస్ ఎలిమినేషన్ రౌండ్ లోనే అసలైన గొడవలను బయటకు తీస్తున్నాడు. ఇక ఈవారం మొత్తంగా పదిమంది నామినేట్ అయ్యారు. ఇక వీరిలో హౌస్ లో నుంచి ఎవరు వెళ్ళిపోతారు అని ఆసక్తికరంగా మారింది. నేడు ప్రసారం కావాల్సిన ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక అందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

  ముచ్చట్ల కోసం వచ్చింది

  ముచ్చట్ల కోసం వచ్చింది

  బిగ్ బాస్ ఇంటి సభ్యులు మీరు నీడలో ఉండకుండా తమ మాటను నిర్భయంగా బయట పెట్టడానికి మరొక అవకాశం ఇస్తున్నారు అంటూ బిగ్ బాస్ వివరణ ఇవ్వడంతో కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎవరికి వారు పలు రకాల వివాదాలతో హైలైట్ అయ్యే ప్రయత్నం చేశారు. ఇనయా అయితే శ్రీ సత్యనా గట్టిగానే తిట్టేసింది. అసలు ఆమెకు గేమ్ ఆడాలని కూడా లేదు అని కూర్చుని ముచ్చట్లు చెప్పడానికి మాత్రమే వచ్చింది అని నామినేట్ చేసింది.

  గీతు నామినేషన్

  గీతు నామినేషన్


  అలాగే ఇనాయకు శ్రీ సత్య కూడా గట్టిగానే మరొక కౌంటర్ ఇచ్చింది. ఇంకా ఎప్పటిలానే ఇది సిల్లి నామినేషన్ అని కూడా ఆమె మరోసారి వివరణ ఇచ్చింది. మరోవైపు గీతూ ఈసారి సుదీపను నామినేట్ చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక అర్థం లేని సిల్లి రీజన్స్ తో నామినేట్ చేసారు అంటూ.. నీ బుద్ధి ఎక్కడుందో అర్థం చేసుకోవచ్చు అంటూ ఆమె గీతుకు కౌంటర్ ఇచ్చింది. ఇక చలాకి చంటి కూడా గీతూనే నామినేట్ చేశాడు. మనం పది మందితో ఉన్నప్పుడు సంస్కారంతో ఉండాలి అని కూడా చంటి ఆమెకు కౌంటర్ ఇచ్చాడు.

  దొబ్బేయ్ అంటూ..

  దొబ్బేయ్ అంటూ..

  ఇక చంటి మాట్లాడుతుండగా నాకు తీట కాదు.. అందరితో చర్చలు పెట్టుకోవడానికి అంటూ గీతు చెప్పిన సమాధానం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఇనాయా మరోసారి గీతూని నామినేట్ చేస్తూ నువ్వు అసలు ఫెయిర్ గేమ్ ఆడట్లేదు అని తన వివరణ ఇచ్చింది. ఇక వీరిద్దరి మధ్యలో మాటలు యుద్ధాలు గట్టిగానే కొనసాగాయి. ముందుగా నేను మాట్లాడతాను అని ఆమె గట్టిగా అరిచేసింది. ఇక ఫస్ట్ ఇక్కడ నుంచి దొబ్బేయ్ అంటూ గీతు కాస్త వెటకారం చేస్తూ మాట్లాడింది.

  ఆదిరెడ్డి ఆగ్రహం

  ఆదిరెడ్డి ఆగ్రహం

  ఆదిరెడ్డి ఇనయా సుల్తానా మధ్యలో మరోసారి మాటల యుద్ధం కొనసాగింది. ఇక ఈ ఇనయాను ఆది నామినేట్ చేయడంతో ఇక్కడ మీరు కూడా అన్ని తెలుసుకొని వచ్చారు అని అనగానే అలాంటి మాట అనడం చాలా తప్పు అంటూ అతను కూడా గట్టిగా నిలదీశాడు. ఇక ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బిగ్ బాస్ అంటే ఏమిటో తెలుసు అని కూడా వివరణ ఇచ్చాడు.

   సుదీప ఎమోషనల్

  సుదీప ఎమోషనల్

  అయితే ఎవరికి ఎంత తెలిసినా మీకే ఎక్కువ తెలుసు అని అంటూ ఇనయా తన మాటను నెగ్గించుకుంది. అంతేకాకుండా నువ్వు స్ట్రాటజీ తో ఇక్కడికి వచ్చావు అని కూడా ఆదిరెడ్డిని రెచ్చగొట్టింది. దీంతో ఆది గిన్నెను ఎత్తేస్తాను అని కూడా గట్టిగా కోపగించుకున్నాడు. సుదీప గీతూ మధ్యలో కూడా మరోసారి ఘాటైన ఏమోషనల్ వార్ జరిగింది. సుదీప చివరలో కాస్త ఎమోషనల్ గా కూడా మాట్లాడింది. మరి ఈ నామినేషన్స్ ప్రక్రియ హౌస్లో ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందో చూడాలి.

  English summary
  Bigg Boss Telugu 6 third week nominations details promo update
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X