Bigg Boss Nominations: 7వ వారం షాకింగ్ నామినేషన్.. ఏకంగా 13 మంది.. ఈ సారి వాళ్లిద్దరే సేఫ్
ఏమాత్రం ఆశలు, అంచనాలు లేకుండానే తెలుగు బుల్లితెరపై ప్రారంభమై భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో, నిజ సంఘటనలు చూపిస్తూ ఆడియెన్స్‌ను గెలుచుకుంటోంది. దీంతో ఇప్పటికే ఏకంగా చాలా సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడీ షోకు సంబంధించిన ఆరో సీజన్ నడుస్తోంది. ఇందులో ఇప్పటికే ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఆరో సీజన్ ఏడో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ లీకైంది. ఇందులో ఎవరు నామినేట్ అయ్యారంటే!

కొత్తవి చూపించినా చూడట్లేదు
తెలుగులో బిగ్ బాస్ షో ఎప్పుడూ వచ్చినా భారీ స్థాయి రేటింగ్‌తో సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. దీంతో ఆరో సీజన్ ఎన్నో అంచనాలతో వచ్చింది. అందుకు అనుగుణంగానే ఇందులో కొత్త కాన్సెప్టులు చూపిస్తున్నారు. కానీ, దీనికి ఆదరణ మాత్రం అంతంత మాత్రంగానే వస్తోంది. ఫలితంగా ఈ సీజన్‌కు రేటింగ్ మాత్రం అస్సలు దక్కట్లేదు. దీనిపై బిగ్ బాస్ యూనిట్ నిరాశగా ఉందని టాక్.

21 మందిలో ఆరుగురు అవుట్
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌లు వచ్చారు. వీరిలో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీపలు ఎలిమినేట్ అయ్యారు.

ఆసక్తికరంగా... రెండు వారాలు
సాధారణంగా సోమవారం బిగ్ బాస్ షోలో జరిగే ఎపిసోడ్‌లోనే నామినేషన్స్ టాస్కును చూపిస్తారు. ఇందులో ఎన్నో గొడవలు కనిపిస్తూ ఉంటాయి. దీంతో దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతుంటుంది. ఆరో సీజన్‌లో కూడా ఇది ఆసక్తికరంగానే సాగుతోంది. ఇక, లాస్ట్ టాస్కులో భాగంగా రోహిత్ ఏడు, ఎనిమిది వారాలకు నేరుగా నామినేట్ అయ్యేందుకు అంగీకరించాడు.

ఏడో వారం... కూర్చోబెట్టి మరీ
బుల్లితెర వర్గాల సమాచారం ప్రకారం.. ఆరో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియను గతంలో మాదిరిగానే నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగానే ప్రతి కంటెస్టెంట్.. సరైన కారణాన్ని చెప్పి నామినేట్ చేసే సభ్యులను కూర్చిలో కూర్చోబెట్టి బురద నీళ్లు పోయాల్సి ఉంటుంది. ఇందులో కెప్టెన్ అయిన సూర్య, ఆల్రెడీ నామినేట్ అయిన రోహిత్‌ను పక్కన పెట్టారు.

వాళ్ల మధ్య గొడవ... రచ్చగానే
మామూలుగానే బిగ్ బాస్ నామినేషన్స్ టాస్కులో గొడవలు జరుగుతూ ఉంటాయి. అందుకు అనుగుణంగానే ఆరో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియలో కొందరు కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరిగినట్లు తెలిసింది. మరీ ముఖ్యంగా రోహిత్ - శ్రీహాన్, ఫైమా - వాసంతి వాదనకు దిగినట్లు తెలిసింది. అలాగే, నామినేట్ చేయడంతో మరికొందరు కూడా గొడవలు పెట్టుకున్నారట.

7వ వారం 13మంది నామినేట్
బిగ్ బాస్ ఆరో సీజన్‌లోని ఏడో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గత రాత్రే ముగిసినట్లు తెలిసింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఏకంగా 13 మంది నామినేట్ అయ్యారట. అందులో ఇనాయా, బాలాదిత్య, ఆది రెడ్డి, అర్జున్, కీర్తి, శ్రీహాన్, శ్రీ సత్య, రేవంత్, ఫైమా, కీర్తి భట్, మెరీనా, రాజశేఖర్, రోహిత్‌లు ఉన్నట్లు ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చేసింది.

వాళ్లిద్దరూ మాత్రమే లేరంట
బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఏకంగా 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఇప్పటికే ఆరుగురు ఎలిమినేట్ అవడంతో 15 మంది మిగిలారు. అలాంటిది ఈ వారం ఏకంగా 13 మంది నామినేషన్‌లోకి వచ్చినట్లు తెలిసింది. అంటే ఈ వారం కెప్టెన్ అయిన కారణంగా సూర్యతో పాటు గీతూ రాయల్ మాత్రమే సేఫ్ అయినట్లు బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసింది.


Click it and Unblock the Notifications











