Bigg boss Telugu 6: నలుగురు అమ్మాయిలు.. ఒక్క రికార్డు.. చరిత్ర సృష్టిస్తారా?
బిగ్ బాస్ లో ఎప్పటికప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతున్నాయి. అసలు ఈసారి టాప్ కంటెస్టెంట్ గా ఎవరు నిలుస్తారు అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. ఇక బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ చరిత్రలో ఇప్పటివరకు అమ్మాయిలు టైటిల్ విన్నర్ గా నిలిచింది లేదు. ఇక ఈసారి ఆ రికార్డును ఎవరైనా అందుకుంటారా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఇక ఇప్పుడు ఉన్న నలుగురు అమ్మాయిలతో ఎవరికి ఆ అర్హత ఎక్కువ ఉంది అనే వివరాల్లోకి వెళితే..

రెండు సార్లు షాక్
బిగ్ బాస్ 6వ సీజన్ లో ఈసారి మొత్తం అత్యధికంగా 21 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టారు. ఇక వారిలో పవర్ఫుల్ అనుకున్న వారు చాలా తొందరగా వెళ్లిపోయారు. బిగ్ బాస్ ఈసారి డబుల్ ఎలిమినేషన్స్ తో రెండు సార్లు షాక్ ఇచ్చాడు. ఇక ఇప్పటివరకు వైల్డ్ కార్డ్ ద్వారా ఎవరు కూడా ఎంట్రీ ఇవ్వలేదు. ఆ రూట్లో బిగ్ బాస్ కొందరిని తీసుకు రావాలి అనుకున్నప్పటికి వర్కౌట్ కాలేదు.

ఆ రికార్డును బ్రేక్ చేస్తారా
ఇక ప్రస్తుతం బిగ్ బాస్ 6వ సీజన్ లో మొత్తంగా 9 మంది మిగిలారు. ఇక వారిలో అబ్బాయిలు 5 మంది అమ్మాయిలు నలుగురు ఉన్నారు. అయితే ప్రతీ బిగ్ బాస్ సీజన్ లో అబ్బాయిలు మాత్రమే గెలుస్తున్నారు. ఓటీటీ నాన్ స్టాప్ షో తప్పితే టెలివిజన్ బిగ్ బాస్ లో మాత్రం అమ్మాయిలు టైటిల్ విన్నర్ గా నిలవలేదు. దీంతో ఇప్పుడున్న నలుగురిలో ఎవరైనా ఆ రికార్డును బ్రేక్ చేస్తారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.

విన్నర్స్ గా అబ్బాయిలు
బిగ్ బాస్ వరుస సీజన్స్ లో శివ బాలాజీ, ఆ తరువాత కౌశల్ మండా, రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్, సన్నీ గెలుచుకుంటు వచ్చారు. ఇక ఫైనల్ స్టేజ్ వరకు రన్నరప్ గా అమ్మాయిలలో అయితే రెండవ సీజన్ లో గీత మాధురి, మూడవ సీజన్ లో శ్రీముఖి మాత్రమే నిలిచారు. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ లో ప్రసారం కాగా బిందుమాధవి టైటిల్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ఆ నలుగురు
అయితే ఇప్పుడు టెలివిజన్ బిగ్ బాస్ 6వ సీజన్ లో నలుగురు అమ్మాయిలలో ఎవరైనా బిగ్ బాస్ టైటిల్ అందుకుంటారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఫైమా, శ్రీ సత్య, ఇనయా సుల్తానా, కీర్తి మాత్రమే ఉన్నారు. ఇక వీరి కంటే గతంలో కాస్త ఎక్కువగా హడావుడి చేసిన గీతూ రాయల్ టైటిల్ విన్నర్ అవుతుందని అనుకుంటే ఆమె ఊహించని విధంగా ఏలిమినేట్ అయ్యింది.

ఇద్దరు మాత్రమే టాప్ 5లోకి
ఇక బిగ్ బాస్ చరిత్రలో ఇప్పుడు నలుగురు అమ్మాయిలో ఇద్దరు మాత్రమే టాప్ 5లోకి వెళ్లే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే అబ్బయిలలో రేవంత్ తప్పకుండా ఫైనల్ స్టేజ్ వరకు వెళతాడు అనిపిస్తోంది. ఇక శ్రీహన్ కూడా టాప్ 5 లో ఉంటాడు. ఇక రాజశేఖర్, రోహిత్, ఆదిరెడ్డి మధ్యలో మరొక పోటీ అయితే గట్టిగానే జరగనుంది. ఇక వీరిలో ఎవరో ఒకరు టాప్ 5 లో ఉంటారు కాబట్టి మిగిలిన రెండు స్థానాలను అమ్మాయిల మధ్యలో తీవ్రమైన పోటీ జరగనుంది.

చరిత్ర సృష్టించేది ఎవరు?
ఇక ప్రస్తుతం ఓట్ల లెక్కల ప్రకారం ఇనయా సుల్తానా టాప్ 5 లోకి వెళ్లే ఛాన్స్ అయితే ఉంది. ఇక ఆమె తరువాత శ్రీ సత్య కూడా మంచి క్రేజ్ అందుకుంటోంది. తోడుగా శ్రీహన్ ఉండడంతో ఆమెకు కొంత సపోర్ట్ దొరికే ఛాన్స్ ఉంది. ఇక ఫైమా ఆడియెన్స్ నుంచి పాజిటివ్ సపోర్ట్ ఇంకాస్త ఎక్కువ రావాల్సి ఉంది. వీరి నలుగురిలో కీర్తి పరిస్థితి మాత్రమే క్లిష్టంగానే ఉంది. ఆమె టాప్ 5 లో ఉండకపోవచ్చని టాక్. మరి ఈ అమ్మాయిలతో ఉహాలకందని విధంగా ఎవరు బిగ్ బాస్ టైటిల్ అందుకుని చరిత్ర సృష్టిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











