For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: కొత్త కెప్టెన్ కోసం ఆఖరి సమరం.. అతనిపై ఫైమా రొమాంటిక్ సెటైర్..

  |

  బిగ్ బాస్ నాలుగో వారంలో కొత్త క్యాప్టెన్ ఎవరు అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పోటీల్లో ఉన్న కొంతమంది ప్రముఖ కంటెస్టెంట్స్ కెప్టెన్సీ టాస్క్ టాస్క్ లో దారుణంగా విఫలమయ్యారు. ఇక ఇప్పుడు లిస్టులో ఉన్న మరి కొంత మంది ఎలాగైనా కెప్టెన్ కావడం కోసం గెలవాలి అని చూస్తున్నారు. ఇక సెకండ్ లెవెల్ లో బిగ్ బాస్ పంచ్ పడు అని ఒక టాస్క్ మొదలుపెట్టారు. ఇందులో ఒక్కొక్క విధంగా వారి అభిప్రాయాన్ని చెబుతూ పోటీగా ఉన్న వారిని పక్కకు తప్పుకునేలా చేస్తున్నారు. నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ఒక ప్రోమో కూడా విడుదల అయింది. ఆ వివరాలలోకి వెళితే..

  అది నాకు నచ్చలేదు

  అది నాకు నచ్చలేదు

  ఇక శ్రీహాన్ అయితే తన ఫోటోను చూసుకుంటూ ఈరోజు జాగ్రత్తగా ఉండు అంటూ కామెంట్ చేసుకున్నాడు. ఇక మిగతా వారి ఫోటోలను కూడా చూస్తే శ్రీహాన్ పంచులు వేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా శ్రీ సత్యను అయితే నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను అంటూ ఇమిటేట్ చేశాడు. ఇక తర్వాత అర్జున్ ఫోటో చూస్తూ మీరు నా ముక్కు మీద గుద్దారు అది నాకు నచ్చలేదు అని అన్నాడు.

  నీకు నాకు ఏమైనా ఉంది అని అనుకుంటే..

  నీకు నాకు ఏమైనా ఉంది అని అనుకుంటే..

  ఇక మరోసారి అర్జున్ ఫైమా మధ్యలో కామెడీ ట్రాక్ నడిచింది. ఫైమా ఇలా రండి అంటే సరిపోతుంది కదా అలాంటిది పక్కకి రా అంటూ ఇలా చేతితో అనడం ఏమిటి అని ఫైమా అర్జున్ ని ఇమిటేట్ చేసింది. అంతేకాకుండా చూసేవాళ్ళు నీకు నాకు ఏమైనా ఉంది అని అనుకుంటే ఏంటి పరిస్థితి అని ఫైమా మాట్లాడిన విధానం అక్కడ కామెడీ ని క్రియేట్ చేసింది. అంతేకాకుండా నేను నా గోల్ కోసం వచ్చాను అంటూ పంచ్ వేసింది.

  బ్యాడ్ స్మెల్ సెటైర్

  బ్యాడ్ స్మెల్ సెటైర్

  ఇక పక్కనే ఉన్న చలాకి చంటి కూడా వీరిద్దరి కామెడీ పై తనదైన శైలిలో పంచ్ వేశాడు. ఎక్కడైనా వెళుతుంటే పక్కనుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటే ఓకే అనుకోవచ్చు. కానీ అదే బ్యాడ్ స్మెల్ కారులో 25 కిలోమీటర్లు ట్రావెల్ అయితే ఎలా ఉంటుంది నువ్వు ఉండగలవా అని ప్రశ్నిస్తూ అంతా నీచమైన పంచ్ నీది అని అర్జున్ పై సెటైర్ వేశాడు.

  ఎందుకు కెప్టెన్ అవ్వాలని అనుకుంటున్నారు

  ఎందుకు కెప్టెన్ అవ్వాలని అనుకుంటున్నారు

  ఇక తర్వాత ఇనయా కెప్టెన్సీ టాస్క్ పంచ్ పడు లెవెల్లో ఒక అవకాశాన్ని అందుకుంది. ఎవరు కెప్టెన్సీ ఫోటీలో ఎవరిని తప్పించాలని అనుకుంటున్నారు అనే ఆప్షన్ ను ఆమె ఊహించని విధంగా వాడుకుంది. మీరు ఎందుకు కెప్టెన్ అవ్వాలని అనుకుంటున్నారు అలాగే నేను ఎందుకు కొట్టకూడదు మీరు చెప్పండి అని ప్రశ్నించడంతో అందుకు శ్రీహాన్ కెప్టెన్సీకి ఉండాల్సిన క్వాలిటీస్ దృష్టిలో పెట్టుకుని అందరూ చెప్పిన పనులు చేస్తున్నామా లేమా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆలోచించి నేను డిజర్వ్ అనుకుంటే ఓకే చేయండి అని చెప్పాడు.

  వాళ్ళకు ఈజి అవుతుందని..

  ఒక బెస్ట్ కెప్టెన్ గా ఉండాలని అనుకుంటున్నాను మీకు నమ్మకం అనిపిస్తే సపోర్ట్ చేయండి అంటూ శ్రీ సత్య చెప్పడంతో ఒక అమ్మాయి కెప్టెన్ కావాలి అనుకుంటున్నాను అంటూ ఇనయా సుల్తానా శ్రీ సత్యకు సపోర్ట్ చేసింది. ఇక మరోవైపు శ్రీహాన్ రాజశేఖర్ పోటీలో నుంచి తప్పించాడు. పోటీలో నేను వెళ్ళిపోయాను ఇప్పుడు మరొకరు వెళ్లిపోతే వాళ్లకు ఈజీ అవుతుంది అని ఆలోచించినట్లు చెప్పాడు. ఇక రాజశేఖర్ రాగానే ఆరోహిపై ఫోకస్ పెట్టాడు. ఒక హౌస్ మేట్ గా ఉన్నప్పుడు కెప్టెన్ కి సరైన రెస్పెక్ట్ ఇవ్వలేదు అని చెప్పాడు. అందుకు ఆరోహి నేను ఇప్పుడు ఒకే తరహా స్టాండ్ లో ఉంటానని తప్పు చేయలేదు అని కూడా దిమాగా చెప్పింది. మరి వీరి మధ్య పోరు ఇలాంటి వివాదాలకు దారి తీస్తుంది అలాగే ఈ వారం కెప్టెన్ ఎవరు అవుతారు అనేది చూడాలి.

  English summary
  Bigg Boss Telugu 6 this week new captaincy task and romantic comedy track viral
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X