twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss 6: అసలు ఆమె ఎలా సేవ్ అవుతోంది.. ఇది న్యాయం కాదు బిగ్ బాస్?

    |

    బిగ్ బాస్ లో ఈసారి ఎలిమినేషన్స్ ఓ వర్గం వారిని షాక్ కు గురిచేసాయి అనే చెప్పాలి. మొదట వారం పెద్దగా హడావిడి లేకుండానే బిగ్ బాస్ షో మొదలైంది. అసలు రేటింగ్స్ కూడా చాలా తక్కువగా రావడం నిర్వాహకులను ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. దీంతో రెండో వారం మొత్తం ప్లాన్ చేంజ్ చేశారు. అంతేకాకుండా నాగార్జున కూడా టైం పాస్ చేయడానికి వచ్చారా అంటూ కంటెస్టెంట్ పై గట్టిగానే అరిచేశారు. అంతేకాకుండా గొడవలకు ఆయన శ్రీకారం కూడా చుట్టేసారు.

    దీంతో రెండవ వారం తర్వాత కంటెస్టెంట్స్ అందరూ కూడా సంబంధం లేని విషయాలలో కూడా చాలా వరకు గట్టిగానే నోరు పారేసుకుంటున్నారని కామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే మరి కొందరు మాత్రం ఆటలు న్యాయంగానే కొనసాగిస్తున్నారు. ఎక్కువగా ఆడియన్స్ లో అయితే సింగర్ రేవంత్ కు మొదటి నుంచి కూడా ఒక పాజిటివ్ ఆలోచన అయితే కొనసాగుతోంది. తప్పకుండా అతను బిగ్ బాస్ విన్నర్ అవుతాడు అని కూడా సపోర్ట్ చేస్తున్నారు.

     Bigg Boss telugu 6 this week once again sudeepa escaped from eliminations

    ఇక ఆ తర్వాత శ్రీహన్ కూడా అతనికి పోటీగా ఉన్నాడు మరోవైపు గీతూ రాయల్ కూడా అప్పుడప్పుడు ఓట్లు అందుకోవడంలో నెంబర్ వన్ కు పోటీగానే నిలుస్తోంది. కానీ మధ్యలో అనవసరపు గొడవల వలన ఆమె స్థాయి తగ్గిపోతుంది. అయితే ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఈ వారం సుదీప వెళ్ళిపోతుంది అని అందరూ అనుకున్నారు.

    ఎందుకంటే ఆమెకు మొదటి వారం నుంచి కూడా ఓట్లు అయితే పెద్దగా రావడం లేదు. హౌస్ లో ఆమె వలన ఎలాంటి లాభం లేదు అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. కెప్టెన్సీ టాస్క్ లో కూడా పెద్దగా ప్రభావం చేసే విధంగా కనిపించడం లేదు అని చెబుతున్నారు. ఇక ఈ క్రమంలో ఈవారం ఆరోహి బయటకు వెళ్లిపోవడం దాదాపు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఆమెను పంపకుండా కాస్త ఆమె కంటే ఎక్కువ ఓట్లు అందుకున్న ఆరోహిని బయటకు పంపించడం ఏమాత్రం న్యాయం కాదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అసలు ఆమె ఎలా సేవ్ అవుతుంది అనే కామెంట్స్ కూడా చాలానే వస్తున్నాయి. రెండో వారం బయటికి పంపించేస్తారని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు కూడా ఆమె సేవ్ అవ్వడం పై బిగ్ బాస్ ప్లాన్ ఏమిటో అని విభిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

    English summary
    Bigg Boss telugu 6 this week once again sudeepa escaped from eliminations
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X