Don't Miss!
- News
నేటి నుండే రేవంత్ రెడ్డి పాదయాత్ర: సమ్మక్క సారలమ్మల ఆశీర్వాదంతో.. షెడ్యూల్ ఇలా!!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss Telugu 6: టిక్కెట్ టు ఫినాలే గండం.. శ్రీహాన్ ఫైనల్ లో గెలిస్తే ఆ రికార్డ్ బ్రేక్ చేసినట్లే!
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ తుది దశకు చేరుకుంటున్న కొద్ది మరింత ఆసక్తికరంగా మారుతొంది. కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ఎలాగైనా ఫైనల్ లోకి అడుగు పెట్టాలని ఆశపడుతున్నారు. అయితే ఇప్పుడున్న వారిలో కేవలం టికెట్ టు ఫినాలే ఆధారంగా శ్రీహాన్ ఒక్కడే ఫైనల్లోకి అడుగు పెట్టాడు.
అయితే బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటివరకు టికెట్ 2 ఫినాలే ద్వారా ఫైనాన్స్ లోకి అడుగు పెట్టిన వారిలో ఒకే ఒక్కరు బిగ్ బాస్ కప్ గెలుచుకున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరెవరు టికెట్ ఫినాలే ద్వారా ఫైనల్లోకి అడుగు పెట్టారు. అలాగే శ్రీహాన్ ఆ రికార్డును బ్రేక్ చేస్తాడా లేదా అనే వివరాల్లోకి వెళితే..

రెండవ సీజన్ లో..
ఇక మొదటి సీజన్లో అయితే టికెట్ టూ ఫినాలే టాస్క్ ను అసలు తీసుకురాలేదు. ఇక రెండో సీజన్ నుంచి ఈ గేమ్ కొనసాగుతోంది. రెండవ సీజన్లో టికెట్ 2 ఫినాలే ద్వారా టాప్ 5 లోకి సామ్రాట్ వెళ్ళాడు. అతను మొదటి నుంచి కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఫైనల్స్ కి వచ్చాడనే చెప్పాలి. కానీ ఫైనల్ లో మాత్రం అతను గెలవలేకపోయాడు. ఆ సీజన్ కు కౌశల్ మండా విజేతగా నిలిచాడు.

మూడవ సీజన్
ఇక మూడో సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ మొదటి నుంచి కూడా ఫాన్స్ ఓట్ల ద్వారానే చివరి వరకు నిలుస్తూ వచ్చాడు. అయితే ఒక దశలో మాత్రం అతనికి పోటీగా శ్రీముఖి ఉండడంతో గెలవడేమో అని అందరూ అనుకున్నారు. కానీ రాహుల్ సిప్లిగంజ్ టికెట్ టూ ఫినాలే ద్వారా ఫైనల్ లోకి అడుగుపెట్టి చివరి దశలో ఆటను తన వైపుకు తిప్పుకున్నాడు. దీంతో ఫైనల్లో అతను గెలిచి తానేంటో నిరూపించుకున్నాడు. రన్నరప్ గా శ్రీముఖి నిలిచింది.

నాలుగవ సీజన్
ఇక నాలుగవ సీజన్లో అఖిల్ సార్ధక్ కూడా టికెట్ టూ ఫినాలే ద్వారా ఫైనల్ లోకి వెళ్లిన విషయం తెలిసిందే. అసలు అతను ఫైనల్స్ వరకు వెళతాడు అని ఎవరు అనుకోలేదు. చివరి దశలోనే ఎలిమినేట్ అవుతాడు అనుకున్న టైంలో టాస్క్ గెలిచి అదృష్టవశాత్తు టికెట్ 2 ఫినలే గేమ్ ద్వారా ఫైనల్ లోకి అడుగు పెట్టాడు. కానీ అతను మాత్రం బిగ్ బాస్ కప్పు గెలవలేకపోయాడు. నాలుగో సీజన్లో అభిషేక్ గెలిచిన విషయం తెలిసిందే.

ఐదవ సీజన్
ఇక ఐదో సీజన్లో శ్రీరామచంద్ర టికెట్ టూ ఫినాలే టాస్కులు గెలిచి ఫైనల్ లోకి అడుగు పెట్టాడు. తప్పకుండా అతను చివరిలో కప్ గెలుస్తాడు అని కూడా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా సన్నీ కి చివరలో ఫ్యాన్స్ నుంచి బాగా సపోర్ట్ వచ్చింది. దీంతో అతను బిగ్ బాస్ టైటిల్ విన్నారర్ గా నిలిచాడు. శ్రీ రామచంద్ర కప్ గెలవకపోయినప్పటికీ కూడా అతనికి మంచి గుర్తింపు లభించింది.

బిగ్ బాస్ ఓటీటీ
ఇక ఓటీటీ లో కూడా బిగ్ బాస్ ఊహించిన విధంగా ట్విస్ట్ లను క్రియేట్ చేశాడు టికెట్ ఫినాలే టాస్క్ లో అదృష్టవశాత్తు బాబా భాస్కర్ గెలిచాడు. అతను వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక చివరిలో టికెట్ టూ ఫినాలే టాస్క్ లో కూడా గెలిచి ఫైనల్ లోకి అడుగుపెట్టాడు. కానీ బిందు మాధవి అప్పటికే డామినేట్ చేయడంతో అతని కృషి ఫలించలేదు.
|
6వ సీజన్
ఇక ఇప్పుడు 6వ సీజన్లో శ్రీహాన్ టికెట్ టూ ఫినాలే ద్వారా టాప్ 5 లోకే అడుగు పెట్టాడు. ఫైనల్స్ లో అతను ఎంతవరకు నిలదొక్కుకుంటాడు అనేది కొంత ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో ప్రేక్షకుల మద్దతు అయితే సింగర్ రేవంత్ వైపే ఉంది. అలాగే అతనికి పోటీగా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలో టికెట్ టూ ఫినాలే ద్వారా ఫైనల్ లోకి వెళ్లిన కంటెస్టెంట్లలో కేవలం రాహుల్ సిప్లిగంజ్ మాత్రమే గెలిచాడు. మరి ఆ రికార్డును శ్రీహన్ కూడా అందుకుంటాడో లేదో చూడాలి.