Bigg Boss Telugu 6: ఆ వీడియో చూపించి రేవంత్ ను ఏడిపించిన బిగ్ బాస్.. మొదలైన పాలిటిక్స్!

బిగ్ బాస్ తెలుగు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఒకరోజు కంటెస్టెంట్స్ అందరూ కూడా సీరియస్ అవుతుంటే. మరొక రోజు ఎమోషనల్ అయ్యేలా బిగ్ బాస్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక అప్పుడే కొన్ని రాజకీయాలు కూడా మరో లెవెల్ కు వెళ్లబోతున్నట్లు అర్థమవుతుంది. ఇటీవల మొదలు పెట్టిన హోటల్ టాస్క్ అయితే కంటెస్టెంట్స్ మధ్యలో చాలా విభేదాలు క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు గ్రూపులో కూడా మళ్లీ గొడవలు మొదలవుతున్నాయి. నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఆరోహి సూర్య ట్రాక్

ఆరోహి సూర్య ట్రాక్

ఆరోహి సూర్య మధ్యలో ప్రస్తుతం జరుగుతున్న ఎమోషనల్ డ్రామా రోజురోజుకు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఇక సూర్య భోజనం చేస్తూ ఉండగా పక్కనే వచ్చి కూర్చున్న ఆరోహి ఏదో చెప్పడానికి ట్రై చేసింది. ఇక అతను ఇరిటేట్ గా ఉంది అని చెప్పడంతో ఆమె కోపంతో లేచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సూర్య తన ప్లేట్లో ఫుడ్ డస్ట్ బిన్ లో పడేసాడు.

రాజుగాడే హ్యాండిచ్చాడు

రాజుగాడే హ్యాండిచ్చాడు

ఇక రాజశేఖర్ తీసుకున్న ఆలోచనకు బిగ్ బాస్ లో అమ్మాయిలు డిస్టర్బ్ అయిపోయారు ముఖ్యంగా అతన్ని ఎంతగానో నమ్మిన గీతూ కూడా ఇప్పుడు మోసపోయే పరిస్థితి ఏర్పడింది. అతను గేమ్ లో భాగంగా వంద రూపాయలు ఇస్తే బాగుండేది అని ఒక ఎమోషన్ పెట్టుకున్నప్పుడు.. సపోర్ట్ చేస్తే ఉంటే బాగుండేది అని కంటతడి పెట్టుకుంది. ఆ తర్వాత గీతూ పరిస్థితి తెలుసుకొని ఇనయా కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ పిల్లకి చాలా మంది హ్యాండిచ్చారు.. అని ముఖ్యంగా రాజుగాడే హ్యాండిచ్చాడు.. ఎదవ.. అని మెరినా, రోహిత్ లతో చెప్పిందే.

 వంద ఇవ్వడానికి ఇష్టపడలేదు

వంద ఇవ్వడానికి ఇష్టపడలేదు

ఇక తర్వాత గీతూ ఫైమా ఇద్దరు కూడా రాజ్ చేసిన మోసం గురించి మాట్లాడుకున్నారు. అతను మనోడే కదా అయినా కూడా వంద ఇవ్వడానికి ఇష్టపడలేదు అని మాట్లాడుకున్నారు. అసలు పక్కనోళ్ళు ఇచ్చిన దానికి బాధ కాదు అసలు నేను గుర్తు రాకుండా అతను ఇచ్చినందుకు కొంచెం బాధగా ఉంది అని గీటెజో చెప్పుకుంటూ కంటతడి పెట్టుకుంది. ఇక రేవంత్ శ్రీహన్ మాట్లాడుకుంటూ రాత్రి కొంచెం నిరస పడినట్లు ఉన్నాము అని చెప్పుకొచ్చాడు

ఏడ్చిన రేవంత్

ఇక మరోవైపు బిగ్ బాస్ రేవంత్ కు ఎమోషనల్ టచ్ ఇచ్చేశాడు. అతని భార్య సీమంతం వేడుక గతవారం జరిగింది అని ఆ మధుర క్షణాలను బిగ్ బాస్ మీకు చూపించాలని అనుకుంటున్నట్లు చెబుతూ సీమంతం వీడియోను టీవీలో చూపించాడు. దీంతో రేవంత్ ప్రేమతో ఒక్కసారిగా ఏడ్చేసాడు. ఇక ఆ తర్వాత అందరిని పిలిచాడు. టీవీలో బొట్టు పెట్టిన రేవంత్ తన భార్యకు ముద్దు పెడుతున్నట్లు ఫీల్ అయ్యాడు. ఇక అందరూ కూడా అతనికి శుభాకాంక్షలు తెలియజేశారు. మరి ఈ పరిణామాలతో బిగ్ బాస్ ఇంట్లో ఎలాంటి వాతావరణం క్రియేట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X