Bigg Boss Telugu 6: కెప్టెన్ కోసం ఆ ముగ్గురి మధ్యలో ఫైట్.. నన్ను పంపేయండి అంటూ రేవంత్ అసహనం!
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ మొత్తానికి ఎమోషనల్ ట్రాక్ ఎక్కేసింది. కంటెస్టెంట్స్ మధ్యలో గొడవలు విభేదాలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. రెండవ రోజు నుంచే స్నేహితుల మధ్యలో గొడవలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలో హౌస్ లో మొదటి కెప్టెన్ కావడం కోసం కూడా దాదాపు అందరూ ఫైట్ చేశారు. అయితే ఇప్పుడు ఫైనల్ గా ముగ్గురు మాత్రమే కెప్టెన్ కావడం కోసం బరిలో నిలిచారు. ఇక హౌస్ లో టాప్ కంటెస్టెంట్ గా నిలుస్తాడు అనుకున్న రేవంత్ అయితే నన్ను పంపేయండి బాబోయ్ అంటూ అసహనం వ్యక్తం చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ వివరాల్లోకి వెళితే..

చంటి క్లాస్
నిన్న జరిగిన ఎపిసోడ్ లో మొదటగా చంటి గలాట గీతూ మధ్యలో కొంత రసబస కొనసాగింది. నీ అమ్మ బాగుందా? అమ్మ బాగుందా? అనే దానికి చాలా తేడా ఉంది అని నువ్వు అనుకున్న పాయింట్ మాత్రమే కరెక్ట్ అంటూ గీతూ కు చంటి కుంట క్లాస్ అయితే పీకాడు. అంతేకాకుండా తక్కువ మాట్లాడు ఎక్కువ విను.. అందుకే దేవుడు నోరు చెవులు ఇచ్చాడు. నువ్వు ఒక పాయింట్ తో ఉన్నప్పుడు నేను ఏం చెప్పినా కూడా నీకు అర్థం కాదు అని చురకలు అంటించాడు.

బాడీ షేమింగ్
ఇక బాడీ షేమింగ్ గురించి కూడా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఒక చర్చ అయితే కొనసాగుతోంది. ముఖ్యంగా మెరీనా అయితే తనను బాడీ షేమింగ్ చేశారు అని నామినేషన్ లో గట్టిగానే చెప్పింది. అలాగే మరోసారి ఆరోహి విషయంలో వివరణ ఇవ్వడంతో పెదరాయుడిలా వచ్చిన బాలదిత్యా వారిద్దరి మధ్య ఒక సంభాషణ అయితే కొనసాగేలా చేసాడు. ఇక ఆ విషయం కూడా క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత మెరినా తన భర్తతో చేసిన డ్రామా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

కెప్టెన్ పోటీ దారులు
ఇక అసలైన కెప్టెన్ పోస్ట్ కోసం హౌస్ లో ఉన్నవాళ్లు చాలా గట్టిగానే పోరాడుతున్నారు. ఇక అందరి అభిప్రాయాలు అడగడంతో ఒక్కొక్క విధంగా వారి వివరణ ఇచ్చారు. శ్రీహన్ అయితే బాలదిత్యా రేవంత్ సుదీప్ చెప్పాడు. ఇక తర్వాత రేవంత్ కాస్త అసహనంతో ఉన్నప్పటికీ కూడా ఆరోహి సూర్య బాలాదిత్య - మెరీనా రోహిత్ పేర్లు చెప్పాడు.

వీరి ముగ్గురిలో
ఇక ఆ తర్వాత రాజశేఖర్ అయితే ఆర్ జె సూర్య బాలాదిత్యలను నామినేట్ చేయగా వాసంతి, సూర్యకు కెప్టెన్ గా ఓటేసిందే. ఇక ఫైనల్ కెప్టెన్ గా అయ్యే పోటీదారులలో ముగ్గురు నిలిచారు. ఆర్జే సూర్య, మెరీనా రోహిత్, బాలాదిత్య.. వీరిలో ఎవరో ఒకరు కెప్టెన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక వీరి ముగ్గురిలో ఎవరు కెప్టెన్ అవుతారు అనేది చూడాలి.

రేవంత్ అసహనం
నామినేషన్ లో అత్యధిక ఓట్లు అందుకున్న రేవంత్ అయితే చాలా డల్ గా కనిపించాడు. అంతేకాకుండా జరుగుతున్న పరిణామాలు కూడా అతనికి చిరాకు తెప్పించాయి. ఇక గీతూ గలాటా అయితే అతన్ని ఎక్కువగా ఫోకస్ చేసింది. అంత పెద్ద సింగర్ ఇలా చేస్తున్నాడు ఏంటి అని వాబోయింది. ఇక రేవంత్ అయితే అందరూ అలా కామెంట్ చేయడంతో అంత చిరాకుగా ఉంటే తనను బయటకు పంపించేయండి అని ఇప్పుడే వెళ్లిపోతాను అని కూడా తెగేసి చెప్పాడు. మరి ఎలిమినేషన్ లో రేవంత్ సేఫ్ అవుతాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











