Bigg Boss Telugu 6: ఒక్క రోజులోనే ఆమె రేంజ్ మారిపోయింది.. ఈసారైనా అమ్మాయి గెలుస్తుందా?
బిగ్ బాస్ లో ప్రతివారం కూడా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతున్నాయి. మొదట్లో కాస్త రేటింగ్ తక్కువగా వచ్చింది అని నిర్వాహకులు కొంత నిరాశ చెందారు. ఆఖరికి బిగ్ బాస్ కూడా కంటెస్టెంట్స్ అందరిపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక నాగార్జున హెచ్చరికలు చేసిన తర్వాత కంటెస్టెంట్స్ అందరూ కూడా బిగ్ బాస్ లో చాలా బలంగా పోరాడుతున్నారు. అయితే ఈ క్రమంలో ప్రతిసారి బిగ్ బాస్ లో అబ్బాయిలు మాత్రమే గెలుస్తున్నారు ఇక ఈసారైనా అమ్మాయిలు చివరి వరకు నిలుస్తారా లేదా అనేది మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఒక అమ్మాయి మాత్రం తప్పకుండా టాప్ ఫైనల్ వరకు కొనసాగే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

గీతూ ప్రతీ ఆటలో
పాజిటివ్ నెగిటివ్ అని తేడా లేకుండా ఫైట్ చేయడమే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అసలు లక్ష్యం అని అందరికీ ఒక క్లారిటీ వచ్చినట్లు అనిపిస్తోంది. ఇక ఎమోషనల్ గా కొందరు అప్పుడప్పుడు డ్రామా ప్లే చేస్తున్నారు. ఇక గీతూ అయితే ప్రతి ఆటలో కూడా తానే హైలెట్ అవ్వాలి అని ప్రయత్నాలు చేస్తోంది. ఆమె సంచాలక్ గా ఉన్నప్పుడు కూడా గేమ్ ఆడుతోంది అంటే బిగ్ బాస్ ఎంత ఫ్రీడమ్ ఇచ్చాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటు తిరిగి ఆటను ఆసక్తిగా కొనసాగించాలి.. ఆడియన్స్ కూడా బోర్ కొట్టకుండా బిగ్ బాస్ ను చూస్తూ ఉండాలి అనేదే అసలు టార్గెట్.

బలంగా పోరాడేందుకు
గీతు రాయల్ న్యాయం అన్యాయం అనే విషయాలను పెద్దగా పట్టించుకోకుండా బిగ్ బాస్ లో చాలా బలంగా పోరాడేందుకు ప్రయత్నం చేస్తుంది. ఆమెపై నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వస్తున్నప్పటికీ కూడా రేటింగ్స్ బాగానే వస్తున్నాయి అని బిగ్ బాస్ ఆమెను అలానే కొనసాగిస్తున్నాడు అని అనిపిస్తోంది. ఇక ఇప్పుడు జనాల నుంచి ఓట్లు అయితే గీతూ కు పెద్దగా పడటం లేదు.

ఇనయా టాప్ లోకి..
అయితే ఇప్పుడున్న మహిళలో గీతూ కంటే ఎక్కువగా క్రేజ్ అందుకున్న వారిలో ఇనయా సుల్తానా అని చెప్పవచ్చు. అసలైతే ఆమె మొదటి రెండు మూడు వారాల్లోనే హౌస్ లో నుంచి వెళ్ళిపోతుంది అని అనుకున్నారు. కానీ మెల్లగా తన స్థాయిని పెంచుకుంటూ ఇప్పుడు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ కు పోటీ ఇచ్చేవరకు వచ్చింది. ఏ మాత్రం తగ్గకుండా ప్రతి టాస్క్ లో కూడా బలంగా పోరాడుతోంది.

అమ్మాయిలు గెలవాలి..
అయితే టెలివిజన్ బిగ్ బాస్ షోలో ఇప్పటివరకు అమ్మాయిలు గెలవలేదు. అప్పట్లో గీతామాధురి ఫైనల్ వరకు వచ్చినప్పటికి సక్సెస్ కాలేక పోయింది. ఇక ఓటీటీ బిగ్ బాస్ లో మాత్రం బిందు మాధవి గెలిచిన విషయం తెలిసిందే. కానీ అది ఓటీటీ బిగ్ బాస్ ఖాతాలోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు టెలివిజన్ బిగ్ బాస్ షోలో అమ్మాయిలు గెలవాలి అని ఒక వర్గం వరకు కోరుకుంటున్నారు.

ఆ రికార్డ్ అందుకుంటుందా?
అయితే ఈసారి ఇనయా టాప్ 2 లో పోటీని ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కీర్తి, శ్రీ సత్య, అలాగే వాసంతి కాస్త పోటీగా ఉన్నప్పటికీ వారు ఇనయా రేంజ్ లో అయితే క్రేజ్ అందుకోవడం లేదు. ఆమె ఒకవైపు గేమ్ ఆడుతూనే మరొకవైపు జనాల నుంచి మంచి మద్దతు అందుకుంటుంది. కాబట్టి బిగ్ బాస్ 6వ సీజన్ లో ఇనయా సుల్తానా ఫైనల్స్ లో అబ్బాయిలకు పోటీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈసారైనా ఇనయా సుల్తానా బిగ్ బాస్ టైటిల్ ను అందుకొని మొదటి మహిళగా రికార్డును క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











