Bigg Boss Telugu 6: టాప్ 5లో ఫైనల్స్ వరకు నిలిచేది వీరే.. ఆ రెండు స్థానాలకు బలమైన పోటీ

బిగ్ బాస్ లో ఈసారి టాప్ 5 లో ఎవరు నిలుస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే షో మొదలై నాలుగు వారాలు పూర్తయింది. ఇక ఐదవ వారానికి వచ్చేసరికి ఎవరెవరు టాప్ లో ఉన్నారు అలాగే ఫైనల్స్ వరకు వెళ్లే అర్హత ఎవరికి ఉంది అనే విషయాలు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇక ప్రస్తుతం అయితే ఒక ముగ్గురు టాప్ 5లోకి తప్పకుండా వెళ్తారు అని అనిపిస్తోంది. ఇక మరో రెండు స్థానాల కోసం మాత్రం ఇతరులు ఎక్కువగా పోటీపడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

 రెండు వారాల తరువాత

రెండు వారాల తరువాత

బిగ్ బాస్ 6వ సీజన్ మొదలైనప్పుడు ప్రేక్షకుల నుంచి కొంత నెగిటివ్ టాక్ వచ్చింది. ఎందుకంటే ఈసారి పెద్దగా పేరున్న సెలబ్రిటీలను తీసుకురాకపోవడంపై ఓ వర్గం వారు తీవ్రస్థాయిలో నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. బిగ్ బాస్ సెలక్షన్ ఈసారి ఏమాత్రం బాగోలేదు అనే కామెంట్స్ వలనే రెండు వారాలు కూడా రేటింగ్ పెరగలేదు. అయితే బిగ్ బాస్ మాత్రం రెండు వారాల తర్వాత విభిన్నంగా టాస్క్ లతో మళ్ళీ ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకున్నాడు.

మళ్ళీ పెరిగిన రేటింగ్స్

మళ్ళీ పెరిగిన రేటింగ్స్

ఇక మొత్తానికి మూడో వారం బిగ్ బాస్ షో ట్రాక్లోకి వచ్చింది. నాగార్జున కూడా కంటెస్టెంట్స్ అందరిపై సీరియస్ కావడంతో ప్రస్తుతం ఉన్నవారు సీరియస్ గా గేమ్ ఆడుతున్నారు. గొడవల విషయంలో కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నారు. దీంతో షో రేటింగ్స్ కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

నెంబర్ వన్ లో..

నెంబర్ వన్ లో..

అయితే బిగ్ బాస్ షోలో ఫైనల్ వరకు నిలిచేది ఎవరు అనే విషయంలో కూడా అనేకరకాల కథనాలు అయితే వెలువడుతున్నాయి. ముఖ్యంగా టాప్ 3 కంటెస్టెంట్స్ దాదాపు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. గడిచిన నాలుగు వారాల్లో అందరికంటే ఎక్కువ స్థాయిలో ఓటింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో రేవంత్ నిలుస్తూ వస్తున్నాడు. కాబట్టి అతను తప్పకుండా టైటిల్ విన్నర్ గా నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని అంటున్నారు.

రేవంత్ తర్వాత

రేవంత్ తర్వాత

ఇక బిగ్ బాస్ లో రేవంత్ తర్వాత శ్రీహన్ కూడా టాప్ 3 లో నిలిచే అవకాశం అయితే ఉంది. అతనికి కూడా ఓట్లు బాగానే వస్తున్నాయి. ఇక తర్వాత మూడవ స్థానంలో గీతూ రాయల్ బలమైన పోటీని ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆమెకు కొంత నెగిటివ్ కామెంట్స్ వస్తున్నప్పటికీ కూడా ఆటలో ఒక్కసారిగా ప్రణాళికలు మారుస్తూ ఉండడంతో మళ్ళీ ఓట్లు పెంచుకుంటుంది. కాబట్టి ఈ ముగ్గురు టాప్ త్రీ లో ఫిక్స్ అయినట్లే అని కామెంట్స్ వస్తున్నాయి.

మరికొందరు

మరికొందరు

ఇక బిగ్ బాస్ లో టాప్ 5 లో పోటీపడేందుకు వీళ్ళు దాదాపు ఫిక్స్ అయినట్లే అని అనిపిస్తూ ఉండగా ఇక నాలుగవ స్థానం ఐదవ స్థానం కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. టాప్ ఫైవ్ లో నిలిచి టైటిల్ విన్నర్ గా నిలవాలని అనుకుంటున్న వారిలో ఆదిరెడ్డి కూడా ఉన్నాడు. ఇక అతనితోపాటు శ్రీ సత్య ఇనయా సుల్తానా అలాగే ఆదిత్య కూడా వారి ప్లాన్స్ తో ముందుకు సాగుతున్నారు. ఇక చలాకీ చంటి కూడా పోటీ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు కానీ అతనికి ఓట్లు మాత్రం పెరగడం లేదు మరి వీరిలో బిగ్ బాస్ టాప్ 5లోకి ఎవరెవరు వెళతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X