Bigg Boss Nominations: లీకైన 12వ వారం నామినేషన్స్.. శ్రీ సత్యకు బిగ్ బాస్ షాక్.. నామినేట్ ఎవరంటే!

ఎప్పుడేం జరుగుతుందో తెలియని సంఘటనలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తోన్న ఏకైక షో బిగ్ బాస్. ఐదేళ్ల క్రితమే తెలుగులోకి వచ్చిన ఈ షో ప్రతి ఏటా ఒక్క సీజన్ చొప్పున సాగిపోతోంది. ఇలా ఐదింటిని రికార్డు స్థాయిలో రేటింగ్‌తో పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ కూడా ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పుడిది చివరి దశకు చేరడంతో మరింత రంజుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో 12వ వారం నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది? ఇందులో ఎవరు నామినేట్ అయ్యారు? అనేవి చూద్దాం పదండి!

సీజన్‌కు పెరుగుతోన్న ఆదరణ

సీజన్‌కు పెరుగుతోన్న ఆదరణ

దేశంలోని ఎన్నో భాషల్లో వస్తున్నా.. తెలుగులో ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ షోకు మాత్రమే అత్యధికంగా స్పందన దక్కుతోంది. అందుకు అనుగుణంగానే ఆరో దాన్ని కూడా సరికొత్త హంగులతో నడుపుతున్నారు. కానీ, దీనికి ఆరంభంలో రేటింగ్ అంతగా రాలేదు. అయితే, క్రమంగా దీనికి రెస్పాన్స్ పెరుగుతోంది. ఇప్పుడు చివరి దశకు రావడంతో స్పందన క్రమంగా పెరుగుతూనే ఉంది.

సగానికి పైగానే వెళ్లిపోయారుగా

సగానికి పైగానే వెళ్లిపోయారుగా

ఆరో సీజన్‌లోకి రికార్డు స్థాయిలో 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. అయితే, ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేసి.. రెండో వారంలో డబుల్ నామినేషన్ పెట్టారు. ఆ తర్వాత ఒక్కొక్కరినే పంపించి.. మళ్లీ పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ చేశారు. ఇలా ఇప్పటికే షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి, మెరీనాలు వెళ్లిపోయారు.

ట్విస్టులతో ఎలిమినేషన్స్ వల్ల

ట్విస్టులతో ఎలిమినేషన్స్ వల్ల

తాజాగా ప్రసారం అవుతోన్న ఆరో సీజన్‌లో ఇప్పటి వరకూ జరిగిన ఎలిమినేషన్స్ అన్నీ ఎన్నో ట్విస్టులతో సాగాయని తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇందులో టాప్ ప్లేయర్లు అనుకున్న వాళ్లు చాలా మంది ఎలిమినేట్ అయిపోయారు. ఫలితంగా నామినేషన్స్ టాస్కులు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పన్నెండో వారం నామినేషన్స్ టాస్కు మీద అందరిలో ఆసక్తి నెలకొంది.

ఈ వారం నామినేషన్ ప్రక్రియ

ఈ వారం నామినేషన్ ప్రక్రియ

ఈ షో మొత్తంలోనే నామినేషన్స్ టాస్కు చాలా ముఖ్యమైనది. అందుకే దీన్ని చాలా కొత్తగా డిజైన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే పన్నెండో వారానికి సంబంధించి.. ఒక కంటెస్టెంట్‌ను కన్ఫెషన్‌ రూమ్‌కు పిలిచి.. తాను నామినేట్ చేసే ఇద్దరు సభ్యుల ఫొటోలను ష్రెడ్డర్‌లో వేయాల్సి ఉంటుంది. అలాగే, అందుకు తగిన కారణాలు చెప్పాల్సి ఉంటుందని కంటెస్టెంట్లకు బిగ్ బాస్ చెప్పాడు.

శ్రీ సత్యకు షాకిచ్చిన బిగ్ బాస్

శ్రీ సత్యకు షాకిచ్చిన బిగ్ బాస్

ఆరో సీజన్‌లో కూడా నామినేషన్స్ టాస్కులు అన్నీ ఎంతో రచ్చ రచ్చగా సాగుతున్నాయి. ప్రతి వారం కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే, ఇప్పుడు కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి ఈ టాస్కులు నిర్వహించడంతో గొడవలు జరగలేదు. అయితే, రాజ్‌ను నామినేట్ చేసే సమయంలో శ్రీ సత్య సరైన కారణాలు చెప్పలేదని బిగ్ బాస్ ఆమెను మందలించినట్లు తెలుస్తోంది.

ఈ వారంలో ఎనిమిది మంది

ఈ వారంలో ఎనిమిది మంది

ఆరో సీజన్‌లోని పన్నెండో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గత రాత్రే ముగిసినట్లు తెలిసింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఏకంగా 8 మంది నామినేట్ అయ్యారని సమాచారం. అందులో ఇనాయా సుల్తానా, శ్రీహాన్ చోటు, రోహిత్, ఫైమా, కీర్తి భట్, రాజశేఖర్, ఆది రెడ్డి, శ్రీ సత్యలు నామినేషన్‌లో ఉన్నట్లు ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చేసింది.

ఎట్టకేలకు అలా తప్పిందిగా

ఎట్టకేలకు అలా తప్పిందిగా

ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఆరో సీజన్‌లోకి ఏకంగా 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో రేవంత్ టైటిల్ ఫేవరెట్‌గా వచ్చాడు. అందుకే బాగా టార్గెట్ అవుతూ ప్రతివారం నామినేషన్స్‌లో ఉంటున్నాడు. అయితే, 12వ వారంలో అతడు కెప్టెన్‌గా ఉండడంతో నామినేషన్స్ తప్పించుకున్నాడు. ఇది అతడి అభిమానులకు ఊరటనిచ్చే న్యూస్ అనొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X