Bigg Boss Telugu 6: ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ మళ్ళీ రీ ఎంట్రీ.. త్వరలోనే షాకింగ్ ట్విస్ట్?

బిగ్ బాస్ లో కొన్ని కొన్ని సార్లు ఊహించిన ట్విస్టులు నమోదవుతూ ఉంటాయి. బిగ్ బాస్ కూడా సరికొత్త తరహాలో ప్రేక్షకులకు ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ వారం చలాకి చంటి హౌస్ లో నుంచి వెళ్లిపోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే త్వరలోనే బిగ్ బాస్ లోకి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లలో ఒకరు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ కంటెస్టెంట్స్ ఎవరు? అనే వివరాల్లోకి వెళితే..

 మళ్ళీ ట్రాక్ లోకి

మళ్ళీ ట్రాక్ లోకి

బిగ్ బాస్ ఇటీవల కాలంలో పెద్దగా ఆదరణ అందుకోలేదు అని టాక్ అయితే గట్టిగానే వస్తుంది. ముఖ్యంగా మొదటి ఎపిసోడ్ కు అది దారుణమైన రేటింగ్స్ రావడం నిర్వాహకులను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. దీంతో నాగర్జున సైతం ఆ తర్వాత చర్చలు పెట్టి మరి ప్రణాళికలు మార్చాల్సివచ్చిందట. ఇక రెండోవారం నుంచి సీరియస్ గా ఆయన కంటెస్టెంట్స్ కు క్లాస్ తీసుకోవడంతో మళ్లీ కొంత ట్రాక్ లోకి వచ్చినట్లు అనిపించింది.

 న్యాయం జరగడం లేదు

న్యాయం జరగడం లేదు

రెండో వారం తర్వాత మూడో వారంలోకి వచ్చేసరికి బిగ్ బాస్ రేటింగ్ కొత్త పెరిగిందట. అయితే బిగ్ బాస్ రేటింగ్ పెరుగుతున్న కూడా ఎలిమినేషన్స్ విషయంలో మాత్రం పెద్దగా న్యాయం జరగడం లేదు అని టాక్ కూడా వినిపిస్తోంది. హౌస్ లో నుంచి కంటెస్టెంట్స్ ను పంపించడం వెనుక బిగ్ బాస్ ఆలోచన విధానం ఏమాత్రం బాగోలేదు అని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి.

 ఆమె వెళ్లిపోవడంతో

ఆమె వెళ్లిపోవడంతో


మొదటివారం ఎవరిని పంపించలేదు. తర్వాత రెండో వారం ఒకేసారి ఇద్దరిని పంపించిన విషయం తెలిసిందే. ఇక తర్వాత మూడో వారం అయితే ఎలిమినేషన్ విషయంలో పెద్దగా అభ్యంతరాలు ఏమీ రాలేదు. కానీ నాలుగో వారంలో ఆరోహి వెళ్ళిపోవడంతో సోషల్ మీడియాలో కొత్త నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. ఆమె కంటే మిగిలిన వారిలో చాలామంది ఇంట్లో అనవసరంగా ఉన్నారని ఎందుకు ఆరోహిని ఎలిమినేట్ చేశారు అనే ప్రశ్నలు కూడా వచ్చాయి.

 ఈ వారం అతడు

ఈ వారం అతడు

ఇక ఇప్పుడు ఐదో వరం ఎవరు ఊహించని విధంగా చలాకీ చంటిని పంపించేస్తున్నట్లుగా తెలుస్తోంది. అతను ఇప్పుడే వెళ్ళిపోడు అని వీలైనంతవరకు టాప్ 7 కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉంటారని కూడా ఆ మధ్యలో టాక్ అయితే గట్టిగా వినిపించింది. అప్పటివరకు లేకపోయినా కనీసం మరికొన్ని వారాలపాటు ఉంటాడని కూడా అనుకున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న వారిలో ఎంటర్టైన్మెంట్ అందించే కమెడియన్స్ అయితే పెద్దగా కనిపించడం లేదు అని ఆలోచించారు. కానీ అతని పర్ఫామెన్స్ కూడా అంతగా ఏమీ వర్కౌట్ కావడం లేదు అని తీసేయడమే బెటర్ అని ఆలోచనతో బిగ్ బాస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రీ ఎంట్రీ ఉంటుందా?

రీ ఎంట్రీ ఉంటుందా?

అయితే త్వరలోనే బిగ్ బాస్ లో ఒక రీ ఎంట్రీ ఉండబోతున్నట్లు మరో కొత్త టాప్ వినిపిస్తోంది. గతంలో కొత్తవారిని వైల్డ్ కార్డు ద్వారా తీసుకువచ్చారు. అలాగే మొదట ఎలిమినేట్ అయ్యి ఆ తర్వాత మళ్లీ షోలోకి అడుగు పెట్టినవారు కూడా ఉన్నారు. ఇక ఈసారి ఆరోహి రావు మళ్లీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ఒక కొత్త టాక్ అయితే వినిపిస్తోంది. ఇంతవరకు ఈ విషయంలో పెద్దగా క్లారిటీ లేదు. కానీ ఎవరో ఒకరు మాత్రం మళ్ళీ హౌస్ లో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ అయితే వస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X