Bigg Boss Telugu 6: సూర్యకు సీక్రెట్ సిగ్నల్.. నాగార్జున ముందే వాసంతి యవ్వారం!

బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ మొదలైనప్పుడు అంత ఆసక్తికరంగా ఏమీ అనిపించలేదు. కానీ మూడవ వారంలోకి వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ అందరూ కూడా వారి ఒరిజినల్ క్యారెక్టర్స్ బయట పెట్టడంతో బిగ్ బాస్ పై కొంత ఆసక్తి పెరిగింది. ఇప్పుడు రేటింగ్స్ కూడా పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏడో వారంలోకి అడుగుపెట్టడానికి కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎలిమినేషన్ నుంచి తప్పించుకునేందుకు బాగానే ప్రయత్నాలు చేశారు. ఇక ఆ సంగతి అటు ఉంచితే వాసంతి మైండ్ గేమ్ పై సోషల్ మీడియాలో ఒక టాక్ వైరల్ గా మారింది. ఆమె జుట్టు కట్ చేసుకున్నప్పుడు సూర్యకు సిగ్నల్ ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో టాక్ కొనసాగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

అసలైన అవతారాలు

అసలైన అవతారాలు

బిగ్ బాస్ లో కొన్నిసార్లు ఊహించని త్యాగాలు చేయాల్సి ఉంటుంది అవసరమైతే ఒకరి కోసం మరొకరు బయటకు కూడా వెళ్లిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి అని బిగ్ బాస్ అప్పుడప్పుడు గేమ్ ఆడుతూ ఉంటాడు. ఇక ఎవరికి వారు నచ్చినట్లుగా ఇప్పుడు గేమ్ అయితే ఆడుతున్నారు. ఈసారి కంటెస్టెంట్స్ మొదటి రెండు మూడు వారాల్లో చాలా సాధారణంగా కనిపించినప్పటికీ నాలుగో వారంలోకి వచ్చేసరికి వారి అసలైన అవతారాలను బయటపెట్టారు.

నామినేషన్ లో ఉండకుండా

నామినేషన్ లో ఉండకుండా

అయితే మిగతా వాళ్ళు ఒక స్టైల్ లో వెళ్తుంటే వాసంతి తనకు నచ్చినట్లుగా తన స్టైల్ లో ముందుకు సాగుతోంది. మరి సెల్ఫిష్ గా ఆలోచించకూడదు అనేవారు కూడా ఉన్నారు. మరికొందరు బయటపడకుండా కూడా సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నారు. ఇక రీసెంట్ గా వాసంతి అయితే రోజురోజుకు తన క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఆమె ఒకవైపు అబ్బాయిలతో కాస్త అల్లరిగా ఉంటూనే మరొకవైపు అమ్మాయిలతో కూడా డేరింగ్ గా అడుగులు వేస్తోంది. వీలైనంత వరకు గోడవలు రాకుండా నామినేషన్ లో ఉండకుండా చేసుకుంటోంది.

 రోహిత్ త్యాగం వలన

రోహిత్ త్యాగం వలన

ఇక రీసెంట్ గా వాసంతి ఎలిమినేషన్ చివరలో ఆలోచించిన విధానం హాట్ టాపిక్ గా మారింది. బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ లో ఎవరైనా ఒకరు తదుపరి రెండు వారాలు కూడా ఎలిమినేషన్ లో ఉండడానికి ఒప్పుకోవాలి అని త్యాగం చేయడానికి ఎవరు సిద్ధంగా ఉంటారని అనుకున్నప్పుడు వేరే దారి లేకపోవడంతో రోహిత్ త్యాగం చేయాల్సి వచ్చింది. అయితే అతను చేసిన త్యాగం కారణంగా అప్పుడు బ్యాటరీ రీఛార్జ్ లో వాసంతికి బిగ్ బాస్ ఇంటి నుంచి ఒక గిఫ్ట్ కూడా పంపించాడు. అయితే నాగార్జున ఆ విషయంలో రోహిత్ ను చాలా మెచ్చుకున్నాడు. ఇక అతని కోసం ఎవరైనా ఏ త్యాగం చేస్తారు అని కూడా నాగార్జున అనడంతో కొందరు హౌస్ మెంట్స్ ముందుకు వచ్చారు.

జుట్టు కట్ చేసుకోవాలి అని..

జుట్టు కట్ చేసుకోవాలి అని..

ఇక జుట్టు కత్తిరించుకోవాలి అని బిగ్ బాస్ నుంచి ఆదేశాలు రావడంతో వాసంతి అందుకు ఒప్పుకుంది. ఇక ఆమె జుట్టు కత్తిరించడానికి సూర్య ముందుకు వచ్చాడు అయితే అప్పుడే వాసంతి చాలా సీక్రెట్ గా భుజాల వరకు మాత్రమే కట్ చేయమని సిగ్నల్ ఇచ్చింది. ఒక విధంగా ఆ విధంగా సైగలు ఇవ్వడం పై సోషల్ మీడియాలో చాలా రకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి.

సూర్యకు సిగ్నల్

సూర్యకు సిగ్నల్

బిగ్ బాస్ రెండవ సీజన్లో దీప్తి సునయన జుట్టు మెడల వరకు కత్తిరించుకుంది. ఇక ఆ తర్వాత మూడవ సీజన్లో శివ జ్యోతి కూడా అదే తరహాలో చేయగా నాలుగో సీజన్లో అలేఖ్య హారిక కూడా జుట్టు కట్ చేసుకుంది.

కానీ వీళ్ళ తరహాలో కాకుండా వాసంతి కేవలం భుజాల వరకు మాత్రమే జుట్టు కట్ చేసే విధంగా తెలివిగా ఆలోచించి సూర్యాకు సిగ్నల్ ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో వివిధ రకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి. మరి తదుపరి వారంలో వాసంతి ఇంకా ఏ విధంగా ముందుకు వెళుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X