twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: రేవంత్ పై ఫైర్ అయిన వాసంతి.. వంద సార్లు పడుకున్నాడంటూ..

    |

    ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ రసవత్తరంగా సాగనుంది. తాజాగా బిగ్ బాస్ పెట్టిన పోటీల్లో ఇంటి సభ్యులు కనబర్చిన తీరు కొద్దిగా రంజుగా సాగింది. ఇటీవల ఇంటి సభ్యులపై బిగ్ బాస్ మండిపడి.. పనిష్ మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్నటి ఎపిసోడ్ లో హౌజ్ మేట్స్ పశ్చాత్తాపం చెందినట్లయితో తమ ఆట తీరు ఎలా మెరుగుపరుచుకుంటారో ప్రతిజ్ఞ చేయించుకుంటాడు బిగ్ బాస్. ఆ తర్వాత పెట్టిన ఎలిజిబిలిటీ పోటీ హోరాహోరీగా సాగింది. దాదాపుగా అందరు బాగా గేమ్ ఆడేందుకే ప్రయత్నించారు. తాజాగా ఇంటి సభ్యులకు మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

    ఎలిజిబిలిటీ టాస్క్..

    ఎలిజిబిలిటీ టాస్క్..

    బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ అక్టోబర్ 20 తేది ఎపిసోడ్ లో ఎలిజిబిలిటీ టాస్క్ నడిచింది. ఈ టాస్క్ లో దాదాపుగా అందరు బాగానే పర్ఫామెన్స్ ఇచ్చారు. ఇంటి సభ్యులకు రేవంత్ కు మధ్య గొడవలు జరిగాయి. శ్రీసత్య, అర్జున్, మెరీనాకు రేవంత్ ల మధ్య ఎక్కువగా వాదనలు జరిగాయి. ఇక ప్రతీసారి రేవంత్ చాలా అగ్రెసివ్ గా ఉంటాడన్న విషయం తెలిసిందే.

    అర్జున్ కు శ్రీహాన్ మధ్య మాటల యుద్దం..

    అర్జున్ కు శ్రీహాన్ మధ్య మాటల యుద్దం..

    ఇక అర్జున్, శ్రీహాన్, రోహిత్ మధ్య ఆట ఫిజికల్ గా మారింది. అర్జున్ కాళ్లపై రేవంత్ పిడి గుద్దులు గుప్పించాడు. అర్జున్ కు శ్రీహాన్ మధ్య మాటల యుద్దం నడిచింది. గీతూ రాయల్ ఆ టాస్క్ మధ్యలో కూడా కామెడీ చేసే ప్రయత్నం చేసింది. అలాగే ఈ టాస్క్ లో తోపులాటలు కూడా జరిగాయి.

    కిందపడిపోయిన శ్రీ సత్య..

    కిందపడిపోయిన శ్రీ సత్య..

    బొమ్మ కోసం లాగేటప్పుడు ఆ బొమ్మను పట్టుకున్న శ్రీ సత్య కింద పడిపోయింది. ఆర్జే సూర్యకు కోపం రావాలని, కారం కలిపిన అన్నం కావాలని చెప్పగా శ్రీ సత్య కలిపి తీసుకొచ్చి తినిపించింది. ఈ టాస్క్ లో మొదటి రౌండ్ లో ఇనయా సుల్తానా టీమ్ గెలిచింది.

    అఫెన్సివ్ లాంగ్వేజ్ వాడుతున్నాడని..

    అఫెన్సివ్ లాంగ్వేజ్ వాడుతున్నాడని..

    ఇక తాజాగా ఇంటి సభ్యులకు బిగ్ బాస్ డిజాస్టర్ ఎవరు అనే టాస్క్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ టాస్క్ ప్రకారం ఎవరినైతే డిజాస్టర్ అని ఫీల్ అవుతున్నారో వాళ్ల పేరు చెప్పి కారణాలు తెలపాలి. రేవంత్ పేరును చెప్పిన అర్జున్ కల్యాణ్.. టాస్క్ మొత్తం బాగా ఆడినప్పటికీ గేమ్ లో అగ్రెసివ్ అయిపోతున్నాడని, కొన్నిసార్లు కంట్రోల్ దాటుతున్నాడని, అఫెన్సివ్ లాంగ్వేజ్ వాడుతున్నాడని తెలిపాడు.

    ఫిజికల్ గా ఆడటం మాత్రమే కాదు..

    ఫిజికల్ గా ఆడటం మాత్రమే కాదు..

    దీనికి రేవంత్.. మొదటి నుంచి ఇలానే ఉన్నానని చెప్పాడు. తర్వాత తనకంటే గీతూ రాయల్ తక్కువ గేమ్ ఆడిందని వాసంతి చెప్పింది. టాస్క్ అంటే ఫిజికల్ గా ఆడటం మాత్రమే కాదు.. నేను ఆడింది కూడా గేమే అని బదులిచ్చింది. తర్వాత వచ్చిన మెరీనా, గీతూ రాయల్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం డిజాస్టర్ కంటెస్టెంట్ కింద రేవంత్ ని నామినేట్ చేసింది శ్రీ సత్య. గేమ్ బాగా ఆడావ్ కానీ, కెప్టెన్ షిప్ అయిపోయిన తర్వాత వెంటనే బిగ్ బాస్ రూల్స్ నువ్ ఫాలో అవ్వలేదు అని చెప్పింది శ్రీసత్య.

    రూల్స్ ఫాలో అవ్వనివాళ్లు..

    తర్వాత వాసంతిని డిజాస్టర్ గా పేర్కొన్నాడు రేవంత్. దీంతో గేమ్ లో రూల్స్ ఫాలో అవ్వనివాళ్లు నాకు చెబుతున్నారు రూల్స్ ఫాలో అవ్వమని అంటూ వెళ్లింది వాసంతి. హౌజ్ లో వంద సార్లు పడుకోవడం కనిపించలేదా.. రూల్స్ గురించి నువ్ నాకు చెప్పు అంటూ ఆర్గ్యుమెంట్ చేసింది వాసంతి.

    English summary
    Vasanthi Fire On Revanth Over Violating Bigg Boss Rules In Disaster Task In Bigg Boss Telugu 6th Season October 21st Episode Second Promo
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X