Bigg Boss Telugu 6: వారిద్దరు కలిసి ఆడుతున్నారు.. బిగ్ బాస్ లోకి నేను వెళ్లింది అందుకే: వాసంతి
బిగ్ బాస్ 6 వ సీజన్ లో ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన వారిలో వాసంతి కూడా ఒకరు. ఆమె ఆదివారం రోజు ఎలిమినేట్ అవుతుంది అని ఎవరు గుర్తించలేదు. అయితే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాసంతి హౌస్ లో ఉన్న వారి గురించి తనదైన శైలిలోకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా కొంతమంది కలిసి ఆడుతున్నారు అని తాను మాత్రం ఒంటరిగానే పోరాడాను అని చెప్పుకొచ్చింది. ఇక బిగ్ బాస్ గురించి ఆమె చెప్పిన విశేషాలలోకి వెళితే..

ఆటలో ఉత్త బొమ్మ
యాంకర్ శివ హోస్ట్ గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఎగ్జిట్ ఇంటర్వ్యూలో వాసంతి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందంలో ఆమె బుట్ట బొమ్మ.. ఆటలో మాత్రం ఉత్త బొమ్మ అని ఆమెకు ఇంట్రడక్షన్ ఇచ్చాడు. అయితే ఎలిమినేషన్ అయినా కూడా నీలో ఆ బాధ కనిపించడం లేదు అని కూడా అనడంతో.. కనిపిస్తేనే బాధ ఉన్నట్లా.. లోపల కూడా ఉంటుంది అని ఆమె తెలియజేసింది.

వాసంతి అంటే మేకప్
ఇక వసంతి కల్ట్ ఫ్యాన్స్, వాసంతి ఆర్మీ వాసంతి బాయ్స్ ఉంటూ మీరు బయట బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అందుకోసం మీరు ఏం చేశారు అని అడగ్గానే.. అదేంటో మీరే చెప్పాలి అని ఎందుకంటే నేను ఇప్పటికే బయటికి వచ్చాను నాకు ఏమీ తెలియదు అని వాసంతి చెప్పింది. ఇక వాసంతి అంటే మేకప్ వేసుకొని నీట్ గా రెడీ అయ్యి గేమ్ ఏమీ ఆడలేదు అని టాక్ అనే ప్రశ్నకు.. బిగ్ బాస్ కు సంబంధించి ఏదైతే కావాలో అన్ని చేసి వచ్చాను అని నేను అనుకుంటున్నాను.. అని వాసంతి చెప్పింది.

ఎల్లంటి సపోర్ట్ లేదు
ఇక హౌస్లో అయితే నాకు ఎలాంటి సపోర్ట్ లేదని కూడా ఆమె చెప్పింది. లోపల అయితే అందరికి ఫెవరిటీజజ్ ఉన్నాయని శ్రీహన్ అలాగే శ్రీ సత్య ఇద్దరు కూడా కలిసి గేమ్ ఆడుతున్నారు అని ఆమె గట్టిగానే సమాధానం ఇచ్చింది. అందులో ఎలాంటి అనుమానం లేదని కూడా చెప్పింది. ఇక హౌస్ లోకి వెళ్లేముందు అల్లరి చేస్తావు అని చెప్పావు నిజంగా చేశవా? అని అడగడంతో.. అది కరెక్ట్ గానే చేశాను అని చెప్పుకొచ్చింది.
ఎక్కడ యాక్టివ్ గా ఉన్నావు?
అయితే నువ్వు ఎంటర్టైన్ చేసావా? ఎక్కడ యాక్టివ్ గా ఉన్నావు? అని అడగడంతో నేను అంతగా యాక్టివ్గా లేకపోతే 10 వారాలపాటు బిగ్ బాస్ లో ఉండలేను అని లేకపోతే నాకు జనాలు కూడా సపోర్ట్ చేసేవారు కాదు అని వాసంతి చెప్పుకొచ్చింది. ఏం చూసుకుని ఇన్ని రోజులు అక్కడ ఉంటానని అనుకున్నావు అని అడగడంతో అక్కడ ఎవరూ కూడా ఏం చూసుకుని ఉండాలని అనుకోరు అని వాసంతి మరింత గట్టిగా సమాధానం ఇచ్చింది.

కోపం ఎందుకు వస్తుంది?
ఇక 100 మార్కులలో ఎంత ఇచ్చుకుంటావో అని అడిగినప్పుడు 70 మాత్రమే ఇచ్చుకుంటాను అని ఎందుకంటే నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు అని చెప్పింది. నామినేషన్ సమయంలో కొన్నిసార్లు వాసంతికి కోపం ఎందుకు వస్తుంది? నార్మల్ డేస్ లో ఎందుకు రాదు అని అడిగినప్పుడు.. ఇక ఇనయా తరహాలో ప్రతి చర్చల్లో దూరాలి అంటారా? అని వాసంతి కౌంటర్ ఇచ్చింది.
ఇక ఇక బిగ్ బాస్ లోకి ఎందుకు వచ్చావు నువ్వు అని శివ ప్రశ్నించడంతో.. ఫేమ్ కోసమే అని వాసంతి చెప్పింది. ఇక ఫేమ్ అది వచ్చిందా లేదా అని కూడా శివ అడిగాడు. మరి పూర్తి ఎపిసోడ్లో ఆమె ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











