Bigg Boss telugu 6: ఓటింగ్స్ తో టాప్ 3 ఫిక్స్ అయినట్లేనా.. ఆ ఇద్దరిలో ఒకరు ఔట్?

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో 6వ సీజన్ మొదలైనప్పుడు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ మొదటి ఎపిసోడ్ కు చాలా తక్కువ రేటింగ్ రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకు కారణం కూడా లేకపోలేదు. నాగార్జున హడావిడి చేసినప్పటికీ కూడా కంటెస్టెంట్స్ సెలెక్షన్స్ విషయంలో మాత్రం ఈసారి బిగ్ బాస్ ఏమంతా మాత్రం మెప్పించలేదు అనే కామెంట్స్ వచ్చాయి. ఇక జనాలు ఓటు వేయడంలో కూడా పెద్దగా ఆసక్తి చూడలేదు అని తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు వచ్చిన ఓట్లతో ఎవరు టాప్ లో ఉన్నారో అలాగే ఎలిమినేషన్స్ లో ఉన్నవారిలో ఎవరికి తక్కువ ఓట్లు వచ్చాయి అనే వివరాల్లోకి వెళ్తే..

సీరియస్ కావడంతో

సీరియస్ కావడంతో

బిగ్ బాస్ 6వ సీజన్ మొదటి ఎపిసోడ్ కు చాలా తక్కువ రేటింగ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక మొదటి రోజు అంత తక్కువగా వచ్చింది అంటే ఇక తర్వాత రోజుల్లో రేటింగ్స్ ఇంకా ఎంత తక్కువగా వచ్చి ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే నాగర్జున గతవారం వచ్చి రాగానే అందరిని ఒక ఆటాడుకున్నాడు. ఆయన సీరియస్ కావడంతో కంటెస్టెంట్స్ అందరూ కూడా మళ్లీ చాలా సీరియస్ గానే గేమ్ ఆడుతున్నట్లు అనిపిస్తోంది.

టాప్ 2లో

టాప్ 2లో

ఇక ప్రస్తుతం నామినేషన్ లో ఉన్న వారికి ఎవరు అత్యధిక ఓట్లు అందుకున్నారు అనే వివరాల్లోకి వెళితే.. ఎప్పటి లాగానే రేవంత్ మళ్లీ టాప్లో కొనసాగుతున్నాడు. గత వారం అతనికి కాస్త తక్కువ ఓట్లు వచ్చినప్పటికి ఈసారి అందరికంటే ఎక్కువ ఓట్లు అందుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక శ్రీహన్ అందరికంటే ఎక్కువ ఓట్లు అందుకున్న రెండవ కంటెస్టెంట్ గా ఉన్నాడు.

 గీతూ ఆదిత్య

గీతూ ఆదిత్య

ఇక మిగతా వారిలో గీతూ మళ్ళీ మూడవ స్థానంలో కొనసాగుతోంది. ఆమె గతవారం మొదటి స్థానంలో ఉంటూ అత్యధిక ఓట్లు అందుకుంది. ఇక ఈసారి రేవంత్ శ్రీహన్ తర్వాత ఆమె మూడవ స్థానంలో కొనసాగుతోంది. ఇక నాలుగో స్థానంలో ఆదిత్య కొనసాగుతున్నాడు. అతను పెద్దగా వివాదాలకు వెళ్లకుండా చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

చంటి, ఆరోహి

చంటి, ఆరోహి

ఇక అత్యధిక ఓట్ల అందుకున్న వారిలో 5వ స్థానంలో వాసంతి కొనసాగుతోంది. ఇక తర్వాత జబర్దస్త్ చంటి కూడా ఇప్పుడిప్పుడే ట్రాక్ లోకి వస్తూ ఉండడంతో అతనికి మంచి ఓట్లు అందుతున్నాయి. దీంతో అతను ఈ లిస్టులో 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆరోహి తన గొంతును ఎంత పెంచుతున్నప్పటికీ కూడా ఓట్లు మాత్రం పడటం లేదు. ఆమె ఇప్పుడు ఏడవ స్థానంలో కొనసాగుతోంది.

ఈవారం వెళ్లిపోయేది?

ఈవారం వెళ్లిపోయేది?

ఇక చివరి మూడు స్థానాల వివరాల్లోకి వెళితే ఈసారి నేహా ఎనిమిదివ స్థానంలో కొనసాగుతోంది. ఇక తర్వాత అత్యధిక ఓట్ల అందుకున్న కంటెస్టెంట్స్ లలో చివరి రెండు స్థానాల్లో ఇనయా, సుదీప సాగుతున్నారు. ముఖ్యంగా సుదీపకు అందరికంటే తక్కువ ఓట్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక సుదిప లేదా ఇనయా.. ఇద్దరిలో ఎవరో ఒకరు హౌస్ లో నుంచి ఈ వారం బయటకు వెళ్ళిపోవచ్చు అని పాకోస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X