Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Bigg Boss Telugu 6: ఓటింగ్స్ లో ఊహించని మార్పులు.. తగ్గిన రేవంత్ హవా.. టాప్ లో ఎవరంటే?
బిగ్ బాస్ షో మొన్నటివరకు కాస్త నీరసంగా కొనసాగిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడైతే నాగార్జున కంటెస్టెంట్స్ అందరిపై తినడానికి కబుర్లు చెప్పుకునేందుకు వచ్చారా అంటూ విరుచుకుపడ్డారో అప్పటి నుంచి కూడా మళ్ళీ ట్రాక్ లోకి వచ్చినట్లు అయింది. ఇంతకుముందు ప్రతిసారి ఏదో సరదాగా నవ్వుకుంటూ వచ్చినా కంటెస్టెంట్స్ అందరూ ఇప్పుడు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఇక రెండోవారం చివర నామినేషన్స్ తర్వాత మూడో వారం ఓటింగ్స్ కూడా భారీ స్థాయిలో మారిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు ఎక్కువ స్థాయిలో ఓట్లు అందుకున్నారు అనే వివరాల్లోకి వెళితే..
అప్పటి నుంచి ఫోకస్
బిగ్ బాస్ మొదటి వారం చాలా వరకు నీరసంగా కొనసాగింది అనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. ఇక తర్వాత రేటింగ్స్ వివరాలు బయటకు రావడంతో స్టార్ మా బిగ్ బాస్ చరిత్రలోనే అతి తక్కువగా ఓపెనింగ్ రేటింగ్స్ అందుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక శని ఆదివారంలో నాగార్జున ఒక్కసారిగా ఆగ్రహానికి లోనవ్వడంతో ఆ తర్వాత కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆటపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
నామినేషన్స్ లో..
ఇక మూడోవారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు అనే వివరాల్లోకి వెళితే ఈసారి ఆదిత్య, ఆరోహి ఇద్దరూ కూడా నామినేషన్స్ లో నిలిచారు. ఇక ఆ తర్వాత చంటి గీతూ ఇనయా నేహా రేవంత్ శ్రీహన్ సుదీప వర్షిని ఇలా మొత్తంగా పదిమంది కంటెస్టెంట్స్ అయితే ఇప్పుడు నామినేషన్స్ లో ఉన్నారు. ఇక వీరిలో డేంజర్ జోన్ లో మాత్రం సుదీప ఉన్నట్లుగా తెలుస్తోంది
టాప్ 2 కంటెస్టెంట్స్
ఇక ఈసారి గీతు రాయల్ అందరికంటే ఎక్కువ స్థాయిలో ఓట్లు అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఆమెపై సోషల్ మీడియాలో ఒకవైపు నెగిటివ్ కామెంట్స్ ఊహించని స్థాయిలో పెరుగుతున్నప్పటికీ కూడా ఓట్లు మాత్రం గట్టిగానే పడుతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వాసంతి అత్యధిక ఓట్లు అందుకున్న కంటెస్టెంట్స్ లలో రెండవ స్థానంలో కొనసాగుతోంది.
తగ్గిన రేవంత్ హవా
ఇక ఈసారి రేవంత్ కు చాలా వరకు ఓట్లు తగినట్లుగా తెలుస్తోంది. రెండో వారంలో అనవసరపు వివాదాల కారణంగా సోషల్ మీడియాలో అతనిపై కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఐదవ స్థానంలో ఆరోహి కొనసాగుతోంది. ఆమె గత వారం కంటే ఈసారి ఎక్కువ స్థాయిలో ఓట్లు అందుకుని ఆడియన్స్ మద్దతును పెంచుకుంటుంది.
డేంజర్ జోన్ లో..
అయితే ఈ వారం అతి తక్కువగా ఓట్లు అందుకున్న వారిలో సుదీప అరియానా ఉండడం విశేషం. వీరికి మిగతా వారి కంటే తక్కువ స్థాయిలో ఓట్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక వీరిద్దరూ 9, 10వ స్థానంలో ఉండగా ఎనిమిది ఏడవ స్థానంలో శ్రీహన్ చంటి కొనసాగుతున్నారు. ఇక ఐదవ స్థానంలో నేహా మిగతా వారి కంటే కొన్ని ఎక్కువ ఓట్లు అందుకుంటూ కొనసాగుతోంది.