Bigg Boss Telugu: వైల్డ్ కార్డ్ ప్లాన్ లో మార్పులు.. అతను హ్యాండ్ ఇవ్వడంతో మరొకరి కోసం వేట?

బిగ్ బాస్ 6వ సీజన్ ఈసారి రేటింగ్స్ విషయంలో మాత్రం చాలా వెనుకబడిపోయింది. బిగ్ బాస్ నిర్వాహకులు సరికొత్త టాస్కులతో ఆకట్టుకుంటున్నప్పటికీ కూడా జనాలలో ఆదరణ మాత్రం పెరగడం లేదు. ప్రతివారం కూడా రేటింగ్స్ అయితే పూర్తిస్థాయిలో నిర్వాహకులను సంతృప్తి పరశుడం లేదని తెలుస్తోంది. అయితే ఈ తరుణంలోనే వైల్డ్ కార్డు ద్వారా ఒక స్టార్ కమెడియన్ ను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు అతను హ్యాండ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అతని స్థానంలో మరొకరిని తీసుకురావాలని అనుకుంటున్నారు. ఆ వివరాలలోకి వెళితే..

ఈసారి అదే పెద్ద పొరపాటు

ఈసారి అదే పెద్ద పొరపాటు

బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి కూడా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న నిర్వాహకులు ఎంటర్టైన్మెంట్ డోస్ ఎక్కడ కాదు తగ్గకుండా కూడా కంటెస్టెంట్స్ ను సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఈసారి సెలక్షన్ విషయంలోనే వారు చేసిన పొరపాట్లు ఇప్పుడు షో మొత్తం పై కూడా ప్రభావం చూపే అవకాశం వచ్చింది. ముఖ్యంగా కామెడీ విషయంలో అయితే ఎవరు కూడా అంతగా ఆకట్టుకోవడం లేదు.

ట్రాక్ లోకి తేవాలని..

ట్రాక్ లోకి తేవాలని..

బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ కు చాలా దారుణమైన రేటింగ్ రావడంతో ఆ తర్వాత వారమే నాగర్జున అందరిని కూడా ట్రాక్ లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడికి కబుర్లు చెప్పుకోవడానికి వచ్చారా అంటూ ప్రతి ఒక్కరు చేసిన పొరపాట్లను హైలెట్ చేస్తూ మళ్ళీ వారిని సరైన దారిలో పెట్టాలని అనుకున్నారు. ఇక బిగ్ బాస్ 4 వారం కాస్త బాగానే కొనసాగినప్పటికీ మళ్లీ 5వ వారం రేటింగ్స్ తగ్గినట్లుగా తెలుస్తోంది.

బిగ్ బాస్ సీరియస్

బిగ్ బాస్ సీరియస్

ఆఖరికి బిగ్ బాస్ కూడా రేటింగ్ రాకపోవడంతో తీవ్ర స్థాయిలో సీరియస్ కావాల్సి వచ్చింది. మొదట బిగ్ బాస్ కు భారీ స్థాయిలోనే రెస్పాన్స్ వస్తుంది అనే ప్రచారాలు కూడా మొదలయ్యాయి. కానీ బిగ్ బాస్ ఎప్పుడైతే ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదని డైరెక్ట్ గా చెప్పడంతో అప్పుడే అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఈసారి కంటెస్టెంట్స్ పూర్తిస్థాయిలో ఫెయిల్ అయ్యారు అని మళ్ళీ ట్రాక్ లోకి రావడం కష్టమే అని కూడా అర్థమైపోయింది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ..?

వైల్డ్ కార్డ్ ఎంట్రీ..?

బిగ్ బాస్ ను మళ్ళీ ట్రాక్ లోకి తీసుకురావాలి అంటే ముందుగా హౌస్ లో అవసరం లేని వాళ్ళని తీసివేయాల్సి ఉంటుంది. ఇక అదే పనిలో ప్రస్తుతం బిగ్ బాస్ బిజీగా ఉన్నట్లు అనిపిస్తుంది. గత రెండు మూడు వారాల నుంచి కొనసాగుతున్న ఎలిమినేషన్స్ అయితే న్యాయంగానే జరిగినట్లు అనిపిస్తుంది. అయితే ఈ తరుణంలోనే వైల్డ్ కార్డు ద్వారా జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుదీర్ ను తీసుకురావాలని అనుకున్నారు. కానీ అతను మొదట ఒప్పుకున్నప్పటికీ మళ్లీ ఆ తర్వాత ఇతర కమిట్మెంట్స్ కారణంగా రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఎంత ఖర్చయినా పర్వాలేదు

ఎంత ఖర్చయినా పర్వాలేదు

ప్రతి సీజన్లో కూడా ఎవరో ఒకరు వైల్డ్ కార్డు ద్వారా వచ్చే బిగ్ బాస్ స్థాయిని పెంచే ప్రయత్నం అయితే చేశారు. గతంలో ముక్కు అవినాష్ అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నాడు. అయితే ఈసారి ఎంత ఖర్చయినా పర్వాలేదు అని సుడిగాలి సుదీర్ ను తీసుకురావాలని అనుకున్నప్పటికీ ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు మరో జబర్దస్త్ కమెడియన్ కోసం చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరి వైల్డ్ కార్డు ద్వారా ఏ కమెడియన్ ఎంట్రీ ఇస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X