ఇద్దరూ బ్యాగ్స్ ప్యాక్ చేసుకోండి.. బిగ్‌బాస్ డబుల్ ఎలిమినేషన్ ట్విస్టు.. ఈవారం ఎవరు అవుట్ అంటే..
బిగ్‌బాస్ తెలుగు షోలో సండే కావడం, అలాగే ఎలిమినేషన్ రోజు కూడా కావడంతో వినోదంతోపాటు, టెన్షన్ వాతావరణం ఇంటిలో కనిపించింది. ఆటపాటలు ఓ వైపు, ఇంటి సభ్యులను సేఫ్ చేయడమనే ప్రక్రియను హోస్ట్ నాగార్జున చేపట్టారు. సెలబ్రిటీలతో హుషారుగా ఆటలు ఆడిస్తూ.. ఇంటిలో ఇద్దరు సభ్యులను సూట్‌కేసులు ప్యాక్ చేసుకోమని చెప్పడం ప్రోమోలో కనిపించడం ట్విస్టుగా మారింది. ఇంటి సభ్యుల్లో ఏ ఇద్దరిని సూట్ కేసులు ప్యాక్ చేసుకోమన్నారంటే..

దేశంలోనే నెంబర్ వన్ చానెల్‌గా స్టార్ మా
ఆదివారం ఎపిసోడ్‌లోకి సూపర్ హిట్టు హుషారుగా హోస్ట్ నాగార్జున వేదికపైకి వచ్చారు. దేశంలోనే అత్యధిక వ్యూవర్ షిప్ సాధించిన చానెల్‌గా స్టార్ మాకు నంబర్ వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకొని రికార్డు సృష్టించిందని ఓ శుభవార్తను ఇంటి సభ్యులకు అందించారు. దాంతో ఇంటి సభ్యులు కేరింతలు కొడుతూ డ్యాన్సులు చేశారు. అంతేకాకుండా ఆటలపోటీలు నిర్వహించారు.

అరియానా, అవినాష్ కళ్లకు గంతలు కట్టుకొని
ఆదివారం ఫన్ డే కావడంతో ఇంటి సభ్యులతో ఫన్నీ గేమ్స్ ఆడించారు. అవినాష్, అరియానాతో బ్లైండ్ ఫోల్ట్ ఆడించారు. కళ్లకు గంతలు కట్టినా అరియానా చేయ్యి ఎలా పట్టుకొన్నావని అవినాష్‌ను నాగార్జున అల్లరి పట్టించడం కనిపించింది. నాగార్జున ఆట పట్టించడంతో అవినాష్ ఏదో వివరణ ఇస్తూ కనిపించారు.

బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టిన హారిక
ఇక సోహైల్, హారిక బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. అయితే ఇద్దరిలో ఎక్కువ మార్కులు దేత్తడి హారిక కొట్టేసినట్టు కనిపించింది. హారిక మరోసారి డ్యాన్స్ చేయమని కోరితే.. నడుముతో అదరగొట్టే డ్యాన్స్ చేశారు. ఇంక లాస్యను కూడా నాగార్జున ఆటపట్టించారు. నీకు బట్టలో వేసుకోవడం బాగా తెలుసంటే.. అవును మా ఆయనను వేసుకొన్నాగా అంటూ లాస్య సమాధానం చెప్పారు.

మీ ఇద్దరు సూట్‌కేసులు ప్యాక్ చేసుకోండి
ఇక చివర్లో ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టిన హోస్ట్ నాగార్జున.. ఈ వారం ఎప్పటిలా ఎలిమినేషన్ ఉండటం లేదు. ఈ సారి స్పెషల్‌గా ఎలిమినేషన్ ఉంటుంది. మీ ఇద్దరు సూట్‌కేసులు ప్యాక్ చేసుకోండి అంటూ కుమార్ సాయి, మోనాల్ గజ్జర్‌కు నాగ్ ఆదేశాలు ఇవ్వడం, ఆ తర్వాత ఇంటి సభ్యులు ఆ ఇద్దరి బట్టలను ప్యాక్ చేస్తూ కనిపించారు. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషనా? అనే అనుమానాలను బిగ్‌బాస్ రేకెత్తించాడు.

కుమార్ సాయి ఎలిమినేట్
అయితే తాజా సమాచారం ప్రకారం.. బిగ్‌బాస్ షోలో సింగిల్ ఎలిమినేషన్ జరిగినట్టు సమాచారం. ఇంటి నుంచి కుమార్ సాయి వెళ్లిపోయారు. ఒకవేళ కుమార్ సాయి ఇంటి నుంచి బయటకు వెళితే కనుక, రెండో వైల్డ్ కార్డు సెలబ్రిటీ బయటకు పోవడం జరిగిందనే విషయం గమనార్హం. కుమార్ సాయి ఎలిమినేట్ అయినట్టు మీడియా వర్గాలు ధృవీకరించాయి.


Click it and Unblock the Notifications











